← Back to news

జనసేనలో మరణించిన నేతకు పదవి

By DK· 25 Jun 2026
జనసేనలో మరణించిన నేతకు పదవి

AP: జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలో తప్పులు దొర్లాయి. నెలరోజుల క్రితమే మరణించిన ఒక నాయకుడికి నూతన కమిటీలో పదవి కేటాయించడం చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలానికి చెందిన జనసేన నాయకుడు కుంకుమ కిరణ్‌కుమార్ గతనెలలో మరణించారు. ఆయన మృతి పట్ల మే 22న జనసేన సోషల్‌ మీడియాలో శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన అనంతపురం పార్లమెంట్ నిర్మాణ కమిటీ లీస్ట్‌లో కిరణ్‌కుమార్ పేరును, ఫోటోను సభ్యుడిగా చేర్చారు.

జనసేనలో మరణించిన నేతకు పదవి

More in Politics