← Back to news

ఢిల్లీలో స్ట్రీట్ లైట్స్ లేవా?

By Krishna· 1h ago· X

ఢిల్లీ యూనివర్సిటీ, హిందూ కాలేజ్ ముందు రాత్రి 9 గంటల టైంలో స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదంటూ.. ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది. CM, LG ఇళ్లకు 200 మీటర్ల దూరంలోనే ఈ పరిస్థితి ఉంది అని విమర్శించింది. ఈమధ్య ఢిల్లీలో మహిళలపై దాడులు, రేప్ ఘటనలు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు సైతం దీనిపై ఫైర్ అయ్యింది. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం.. సిటీలో వేల స్మార్ట్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాయి. దీపావళి నాటికి 20 వేల స్మార్ట్ లైట్లు ఏర్పాటు చేస్తామని PWD మంత్రి అన్నారు. మరి నిజమేంటి?

More in National