← Back to news

గచ్చిబౌలిలో ట్రాఫిక్‌కు చెక్.. 3 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్!

By Mahesh· 16h ago· హైదరాబాద్

TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి IIIT జంక్షన్‌లో భారీ ట్రాఫిక్ ప్రాజెక్ట్ పనులు ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. H-CITIలో భాగంగా ఇక్కడ 3 ఫ్లైఓవర్లు, 6-లేన్ అండర్‌పాస్ నిర్మిస్తున్నారు. ఈ మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్ పూర్తయితే IT కారిడార్‌లో రోజూ జర్నీ చేసే లక్షలాది మందికి ట్రాఫిక్ కష్టాలు తగ్గి, కనెక్టివిటీ మరింత ఫాస్ట్‌గా మారనుంది. పనులు జరుగుతున్న టైమ్‌లో వాహనదారులు Cyberabad Traffic Police సూచించే డైవర్షన్లను ఫాలో కావాలని అధికారులు తెలిపారు.

More in TG