← Back to news

జాబ్‌ కొట్టాలనుకునే యువతకు బంపర్‌ ఆఫర్‌

By dk· 16 Aug 2026· నల్గొండ జిల్లా
జాబ్‌ కొట్టాలనుకునే యువతకు బంపర్‌ ఆఫర్‌

TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న యువతీ యువకులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అచలగురు మందిరంలో ఉద్దీపన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని MLA, ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వేముల వీరేశం ఆదివారం ప్రారంభించారు. నిపుణులైన ఫ్యాకల్టీతో మూడునెలల పాటు శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్‌ తీసుకోలేని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ లక్ష్యాలను సాధించాలని సూచించారు.

More in Local