MI ప్లేయర్ నమన్ ధీర్‌కు టీమిండియా పిలుపు

ముంబై టీమ్ ప్లేయర్ నమన్ ధీర్ భారత ODI జట్టులో చోటు దక్కించుకున్నారు. దీనికి కారణం షేర్ ఏ పంజాబ్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టడమే అని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ఆడిన 10 మ్యాచుల్లో రెండు సెంచరీలు సహా 72 సగటుతో 655 రన్స్ చేశారు. పోటీగా నిలిచారు. ఓ మ్యాచులో 64 బంతుల్లోనే 173 పరుగులు చేశారు. టోర్నీలో 49 ఫోర్లు, 49 సిక్సర్లు బాదారు. మరి తుది జట్టులో చోటు దక్కించుకుంటాడేమో లేదో చూడాలి.



