← Back to news

ఫ్రీ బస్సుకు సంవత్సరం పూర్తి.. మహిళలతో CM జర్నీ

By Mahesh· 15 Aug 2026· AP
ఫ్రీ బస్సుకు సంవత్సరం పూర్తి.. మహిళలతో CM జర్నీ

AP: కూటమి ప్రభుత్వం ప్రెస్టీజియస్‌గా అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఫ్రీ బస్సు పథకానికి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ‘స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం’ పేరుతో రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహించారు. అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌ నుంచి సీఎం చంద్రబాబు మహిళలతో కలిసి బస్సులో జర్నీ చేశారు. వివిధ జిల్లాల మహిళలతో మాట్లాడి పథకం ద్వారా కలుగుతున్న బెనిఫిట్స్ అడిగి తెలుసుకున్నారు. ఓ మహిళ నెలకు రూ.4 వేలు ఆదా అవుతోందని సీఎంకు తెలిపారు. మహిళల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై సీఎం అడిగి తెలుసుకున్నారు.

More in AP