అందరూ సుభిక్షంగా ఉండాలి.: గోవిందరావు

శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు వేల్పుల గోవిందరావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం బీజేపీ మండల క్యాంపు కార్యాలయంలో మండలం, ఆమదాలవస నియోజకవర్గ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని అన్నారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, రైతాంగం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు.



