← Back to news

నీళ్ల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్

By DK· 9 Jul 2026· నిజామాబాద్ జిల్లా
నీళ్ల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్

TG: నీటి సమస్య పరిష్కరించాలని యూనివర్సిటీ స్టూడెంట్స్ రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ (TU)లో నీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. సమస్యపై యూనివర్సిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

More in Education