Latest

ఆర్థిక ఇబ్బందుల మధ్య అద్భుత ప్రతిభ
TG: నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సంజన ప్రభుత్వ పాఠశాలలో చదివి 548 మార్కులతో ఉన్నత విద్యకు ఎంపికై ప్రతిభ చాటింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామచంద్రరావు బంజర్‌కు చెందిన సింగిశాల యేసురావు, నాగరాణి దంపతుల కుమార్తె సంజన టేకులపల్లి ఆదర్శ పాఠశాలలో పదోతరగతి చదివి 548 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. మహబూబ్‌నగర్ సమగ్ర విద్యా సంస్థలో సీటు సంపాదించింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సాధించిన విజయంపై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతినిధులు ఎల్.ఎస్.రెడ్డి, కిన్నెర వెంకటేశ్వరరావు సంజనను సన్మానించారు.

3 నెలలుగా చీకట్లోనే ఆదివాసీ గ్రామం.. కొవ్వొత్తులతో నిరసన
AP: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని వెదుళ్లువలస ST గదబ PVTG ఆదివాసీ గ్రామం మూడు నెలలుగా వీధి లైట్లు లేక చీకట్లోనే ఉంది. రాత్రివేళల్లో పాములు, జెర్రులు వంటి విషపురుగుల వస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. తమ ప్రాణాలకు సేఫ్టీ లేకుండా పోయిందని మహిళలు, గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించాలని కొవ్వొత్తులతో ర్యాలీ చేసి తమ నిరసనలు తెలిపారు. ఎలక్ట్రిసిటీ బిల్స్, డిమాండ్ నోటీసుల విషయంలో పంచాయతీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అధికారుల మధ్య కోఆర్డినేషన్ లోపమే కారణమని ఆరోపించారు.

దర్యాప్తు ముగించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం
AP: విజయనగరం గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో విజయనగరం రూరల్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రమణ ప్రాణాలు కోల్పోయారు. కొండకరకాం కేసు దర్యాప్తు నిమిత్తం ఎస్‌ఐ అశోక్‌తో పాటు సిబ్బందితో కలిసి వెళ్లిన రమణ.. తిరిగి వస్తుండగా పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో రమణ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
గాయం తర్వాత బయట కనిపించిన రష్మిక!
తుంటి గాయంతో కొన్నిరోజులుగా ఇంటికే పరిమితమైన రష్మిక చాలా రోజుల తర్వాత బయట కనిపించారు. హైదరాబాద్‌లో ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు తన హస్బెండ్ విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక అటెండ్ అయ్యారు. బ్లాక్ డ్రెస్‌లో ఇద్దరూ నడుస్తూ వేడుకలో సందడి చేశారు.

ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గం.. రైతుల తీర్మానం
AP: ఐదు దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన జంఝావతి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన జంఝావతి సాధన సమితి కార్యాచరణ కమిటీ సమావేశంలో ప్రాజెక్టు కోసం గాంధేయ మార్గంలో సాధన దీక్షలు కొనసాగించాలని తీర్మానించారు. రైతులను సమీకరించేందుకు పర్యవేక్షణ, ప్రచార, మీడియా, లీగల్, సాంస్కృతిక తదితర కమిటీలను ఏర్పాటు చేశారు. త్వరలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటిస్తూ రైతులను చైతన్యపరచాలని నిర్ణయించారు.

ఈడీ కేసులో కారుమూరి సంచలన ఆరోపణలు!
AP: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో ఈరోజు మెడికల్ టెస్టులు చేశారు. నిన్న కొండాపూర్‌లోని అయన ఇంట్లో ED అధికారులు అరెస్ట్ చేశారు. మెడికల్ టెస్టుల తరువాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఇదే కేసులో ఆయన కొడుకు సునీల్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. తన అకౌంట్‌లో ఎలాంటి డబ్బులు క్రెడిట్ కాలేదని కారుమూరి తెలిపారు. సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ నుంచి తనకు డబ్బులు వచ్చాయన్న ఆరోపణలు నిజం కాదని స్పష్టం చేశారు. కేసులో నిజానిజాలు కోర్టులో తేలుతాయని మీడియాతో అన్నారు.

తాటిబెల్లం కాఫీ బెనిఫిట్స్ వేరే లెవెల్!
తాటిచెట్టు నీరా నుంచి తయారయ్యే తాటిబెల్లం సూపర్ హెల్దీ ఆప్షన్‌గా మారి మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఇందులో ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉండటంతో ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా డైజెషన్, బ్లడ్ ప్రెజర్ నియంత్రణకు బాగా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం టీ, కాఫీ, స్వీట్స్‌లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. తమిళనాడులోని ఇయర్లీ 1.6 లక్షల టన్నుల ఉత్పత్తులతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు APలోని చింతూరు YSR ఉద్యాన విశ్వవిద్యాలయం గిరిజనుల ఆదాయం పెంచేందుకు తాటిబెల్లం ప్రాసెసింగ్, ట్రైనింగ్ ఇస్తోంది.

ములగలంపాడులో తాగునీటి కష్టాలు.. ప్రజల అవస్థలు
AP: నెలరోజులుగా తాగునీరు లేక ప్రజల అవస్థలు.. మోటార్ పనిచేయక గ్రామంలో తీవ్ర ఇబ్బందులు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ములగలంపాడు గ్రామంలో నెల రోజులుగా మంచినీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ట్యాంకుకు నీటిని ఎక్కించే మోటార్ పనిచేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
దిల్లీలో పోలీసులపై అటాక్.. కారం పొడి, ఇటుకలతో దాడి!
దిల్లీలోని ముకుంద్‌పూర్‌లో పోలీసులపై అటాక్ జరిగింది. పెట్రోలింగ్‌లో ఉన్న ముగ్గురు పోలీసులపై కొంతమంది కారం పొడి, ఇటుకలు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఓ హెడ్ కానిస్టేబుల్‌కు తలకు గాయమైంది. సరైన డాక్యుమెంట్స్ లేని బైక్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లిన తరువాత ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నాయి.
పనిచేయని గాలి యంత్రం.. వాహనదారుల అవస్థలు
TG: ఐదురోజులుగా గాలి నింపే యంత్రం పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకులో ఏర్పాటు చేసిన గాలి నింపే యంత్రం గత ఐదు రోజులుగా అందుబాటులో లేదని వినియోగదారులు వాపోతున్నారు. నాణ్యత ప్రమాణాలతో సేవలు అందిస్తున్నామని ప్రచారం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. టైర్లలో గాలి నింపుకోవడానికి వాహనదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడం, డాలర్ బలహీనపడటంతో గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,63,970 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.800 పెరిగి రూ.1,50,300 గా నమోదైంది. పసిడి ప్రియులు గోల్డ్ షాపింగ్ చేసేముందు లైవ్ రేట్లను ఒక్కసారి చెక్ చేసుకోవడం బెటర్.

మంత్రి లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం: ఎస్‌ఎఫ్‌ఐ
AP: విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 25న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాయదుర్గం పర్యటనను అడ్డుకుంటామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో విద్యా సమస్యలపై బంగి శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్, బాలికల కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, గురుకులాలు, డిగ్రీ కళాశాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, తాగునీరు అందించాలని కోరారు.
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా 5కే రన్
TG: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శివాని పబ్లిక్ పాఠశాలలో మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా 5కే రన్ నిర్వహించారు. విద్యార్థులు, టీచర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నర్సంపేట సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

230 మంది విద్యార్థులు..మూడే తరగతులు
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కరీముఖిపుట్ ZPHSలో సుమారు 230 మంది విద్యార్థులున్నారు. వాళ్లందరికీ కలిపి మూడే తరగతుల్లో పాఠాలు చెప్తున్నారు. వీటికి పైకప్పు సరిగా లేదు. ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో తరగతుల్లోకి నీరు చేరి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు సైతం ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మరిన్ని తరగుతులు నిర్మించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

యువత రాజకీయ ప్రలోభాలకు దూరంగా ఉండాలి: డీవైఎఫ్‌ఐ
AP: యువత రాజకీయ ప్రలోభాలకు దూరంగా ఉండాలని, స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించాలని డీవైఎఫ్‌ఐ నాయకుడు యనమల చరణ్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం శ్రీరామపురంలో డీవైఎఫ్‌ఐ 16వ రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. యనమల చరణ్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి.. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, గంజాయి మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు యువతను చెడు మార్గాల వైపు మళ్లిస్తున్నాయని ఆరోపించారు.

OSD సుమంత్ కేసులో పోలీసుల స్పీడ్.. మరో ముగ్గురు అరెస్ట్!
TG: కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్టూరులో ముగ్గురిని ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ అరెస్టులతో ఈ కేసులో నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రధాన నిందితుడు సుమంత్‌తో పాటు మరో ఇద్దరు Abscondingలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీస్ స్పెషల్ టీమ్స్ వెతుకుతున్నాయి.
నీటి కోసం నిత్యం పోరాటం
AP: గుక్కెడు నీటి కోసం ప్రతిరోజూ దూరం వెళ్లాల్సిన దుస్థితి.. తాండవలస గిరిజనులు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలోని చిడిమెట్టు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సరిపడా నీటి సౌకర్యం లేకపోవడంతో దూరంగా ఉన్న నీటి ఊటల నుంచి ప్రతిరోజూ నీటిని మోసుకురావాల్సి వస్తోందని తెలిపారు. దీంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

మహమ్మద్ ఖదీర్‌బాబుకు బుక్ బ్రహ్మ సాహిత్య పురస్కారం
బెంగళూరులో మూడు రోజులపాటు నిర్వహించిన బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఈ ఏడాది బుక్ బ్రహ్మ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ తెలుగు రచయిత, జర్నలిస్టు మహమ్మద్ ఖదీర్‌బాబు అందుకున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఖదీర్‌బాబు కథా రచయిత, సంపాదకుడు, సీనియర్ జర్నలిస్టు. ‘దర్గామిట్ట కతలు’, ‘పోలేరమ్మబండ కతలు’, ‘న్యూ బాంబే టైలర్స్’, ‘బియాండ్ కాఫీ’, ‘మెట్రో కథలు’, ‘దాహగీతి’ కథా సంకలనాలు వెలువరించారు. ‘రైటర్స్ మీట్’ స్థాపించి యువ రచయితలకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి
AP: ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోని భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలతో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పారుపక గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూములను ఆక్రమించి మతపరమైన కట్టడాలు నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగితే భవిష్యత్తులో గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి నిర్మాణాలపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆ ఓటర్లకు Alert.. నేటి నుంచే నోటీసులు!
TG: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఈరోజు నుంచి ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. తెలంగాణాలో 92.8 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తప్పులను అధికారులు గుర్తించారు. వారిలో 60.51 లక్షల అనామలీస్, 32.36 అన్-మ్యాపింగ్ లో ఉన్నారు. వీరందరికి నోటీసులు ఇవ్వనున్నారు. 2002లో ఓటర్ల లిస్ట్ తో వివరాలు మ్యాచ్ కాకపోవడం, ఎన్యుమరేషన్ Formsలో తేడాలు వంటి కారణాలతో నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారు కొన్ని Documentsతో వివరాలను Verify చేసుకోవాలని అధికారులు సూచించారు.

హౌస్‌కీపింగ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
AP: విశాఖ విమానాశ్రయంలో ఉద్యోగాలు కోల్పోయిన హౌస్‌కీపింగ్ కార్మికుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు డిమాండ్ చేశారు. ఆరు రోజులుగా విమానాశ్రయం వద్ద కార్మికులు చేస్తున్న నిరసనకు ఆయన సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగాలు కోల్పోయిన హౌస్‌కీపింగ్ సిబ్బందికి న్యాయం చేయాలని కోరారు.