పనిచేయని గాలి యంత్రం.. వాహనదారుల అవస్థలు
TG: ఐదురోజులుగా గాలి నింపే యంత్రం పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకులో ఏర్పాటు చేసిన గాలి నింపే యంత్రం గత ఐదు రోజులుగా అందుబాటులో లేదని వినియోగదారులు వాపోతున్నారు. నాణ్యత ప్రమాణాలతో సేవలు అందిస్తున్నామని ప్రచారం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. టైర్లలో గాలి నింపుకోవడానికి వాహనదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.



