మంత్రి లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం: ఎస్‌ఎఫ్‌ఐ

AP: విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 25న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాయదుర్గం పర్యటనను అడ్డుకుంటామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో విద్యా సమస్యలపై బంగి శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్, బాలికల కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, గురుకులాలు, డిగ్రీ కళాశాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, తాగునీరు అందించాలని కోరారు.



