Latest

రూ.19.35 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 353 మందికి రూ.3.44 కోట్ల మేర వైద్య ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు.ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం 18 రీయింబర్స్‌మెంట్, 2 ఎల్‌ఓసీలకు సంబంధించిన మొత్తం రూ.19,35,426 విలువైన చెక్కులను ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గం నుంచి సీఎంఓ కార్యాలయానికి పంపిన 500 దరఖాస్తుల్లో మిగిలిన 147 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
ఈనెల 24 నుంచి ఆటో డ్రైవర్ల సమ్మె
TG : ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే ఆటో డ్రైవర్ల సమ్మెను సక్సెస్ చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో ఆటో డ్రైవర్ల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని చెప్పారు. ఆటోలకు రేడియం స్టిక్కర్ మినహాయింపు, మీటర్ చార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. Ola, Uber, Rapido బైక్ టాక్సీలను బ్యాన్ చేసి ప్రభుత్వ యాప్ తీసుకురావాలని, రూ. 12,000 సాయం అందించాలని కోరారు.

డంపు యార్డు వద్దని ఎమ్మెల్యేకు వినతి
షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో డంపు యార్డు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని డంపు యార్డ్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతి పత్రం అందజేశారు. డంపు యార్డు వస్తే 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతారని వెల్లడించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ విషయంపై నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాంబల్ నాయక్, పినపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కోసం పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డి
మాజీ పార్లమెంటు సభ్యులు, సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్థంతి సభలు రాష్ర్ట వ్యాప్తంగా జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటాలను నాయకులు గుర్తుచేసుకున్నారు. పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం సురవరం సుధాకర్ రెడ్డి జీవితాంతం చేసిన సేవలను కొనియాడారు. ప్రజా ఉద్యమాల బలోపేతానికి, సామాజిక న్యాయ సాధనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

నర్సంపేటలో కొవ్వొత్తులతో నిరసన
TG : విశాఖపట్నం పాఠశాలలో చిన్నారికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. అమరవీరుల స్థూపం దగ్గర పేరెంట్స్, స్థానికులు కొవ్వొత్తులు వెలిగించి ఆ చిన్నారికి మద్దతుగా నిలిచారు. ప్రతి స్కూల్‌లో పిల్లల సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని, స్కూల్ యాజమాన్యం, స్టాఫ్ బాధ్యతగా ఉండాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలంగా చేయాలని అన్నారు.

అమ్మవారి ఆలయ పరిసరాల్లో డీజేలపై నిషేధం
పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పరిసరాలలో డీజే సౌండ్ సిస్టలను నిషేధించినట్లు ఆలయ ఈవో లీలా కుమార్ శనివారం తెలిపారు. కొంతమంది వ్యక్తులు ప్రతి కార్యక్రమానికి ఆలయ పరిసరాల్లో డీజే పాటలు పెడుతున్నారన్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆలయ పరిసరాలలో డీజేలు నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అయితే దీనిపై కొందరు సంతృప్తిని వ్యక్త పరచగా, కొందరు దీనిని పునరాలోచించాలని ఈ. ఓ. ని కోరుతున్నారు.

యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్-2026
తెలంగాణ FDC ఆధ్వర్యంలో 'యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్- 2026 - సీజన్ 2' పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో FDC ఛైర్మన్ దిల్ రాజు సూచనతో MD జి. ముకుంద రెడ్డి, క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రభుత్వ పథకాలపై షార్ట్ ఫిల్మ్స్ (3 నిమిషాలు), పాటలు (5 నిమిషాలు), జానపద గేయాలు, ఇన్ఫ్లుయెన్సర్ వీడియోల కేటగిరీల్లో ఈ కాంపిటీషన్ ఉంటుంది. సెప్టెంబర్ 15 లోగా ఎంట్రీలను పంపించాలి. ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వారికి రూ. 3 లక్షల బహుమతి లభిస్తుంది.

కంపెనీ అయినా పెట్టాలే.. లేకపోతే మా భూములు మాకియ్యాలె..
‘‘కంపెనీలు పెట్టడానికి భూములు కావాలంటే ఇచ్చినం. ఇప్పటి దాకా కంపెనీ రాలే. కంపెనీలు వస్తే మా లోకల్ వాళ్లకు జాబులొస్తయ్ అనుకున్నం. ఇగ అట్ల లేదనుకుంటే మా భూములు మాకియ్యాలె...‘‘ అని రైతులు చెబుతున్నారు. వికారాబాదు జిల్లా, మోమిన్ పేట మండలం, ఎన్కతల గ్రామంలో రాష్ర్ట ప్రభుత్వం ఎలక్ర్టానిక్ వాహనాల కోసం ’మొబిలిటీ వ్యాలీ’ ఏర్పాటు కోసం భూములను సేకరించింది. రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ MLA ఆనంద్ రైతులను కలిశారు. పరామర్శించారు. మద్ధతు తెలిపారు.

9వ తరగతి నుంచే ప్లానింగ్
TG : పదో తరగతి పరీక్షల్లో మంచి రిజల్ట్స్ రావాలంటే విద్యార్థులు 9వ తరగతి నుంచే ప్లాన్ ప్రకారం చదువుకోవాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. తిర్యాణి ZPHSలో స్టూడెంట్స్, టీచర్లతో జరిపిన రివ్యూలో ఆయన మాట్లాడారు. విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా వారిలో ఉన్న కొత్త ఆలోచనలు బయటకు తీసేందుకు 'విద్యా ప్లస్' ప్రోగ్రామ్‌ను వాడుకోవాలని చెప్పారు. ప్రతిఒక్కరూ యోగా, ఎక్సర్‌సైజ్ ద్వారా ఆరోగ్యంగా ఉండటానికి ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ క్లబ్‌ల ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

కరపలో చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్
AP : కాకినాడ జిల్లా కరప గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఆధ్వర్యంలో యూత్ నేతలు ఘనంగా జరిపారు. ఈ ప్రోగ్రామ్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన జనసేన నాయకుడు డాక్టర్ బొండా సూర్యారావు కేక్ కట్ చేశారు. పేదలకు, వికలాంగులకు నిత్యావసర సరుకులు పంచారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి రక్తం అందించి ప్రాణాలు కాపాడుతున్నారని, ఆయన సేవలు గొప్పవని సూర్యారావు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

బైకులను గాయబ్ చేస్తున్నోళ్ల అరెస్టు
వరుసగా బైకులు దొంగిలిస్తూ, చైన్ స్నాచింగుకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు బైకులతో పాటు, తులంన్నర బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల 18న సారంగాపూర్ మండలం అర్రపెల్లిలో రాత్రి వేళ చైన్ స్నాచింగ్ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు... పక్కా సమాచారంతో రేచపల్లి ఎక్స్ రోడ్ వద్ద నిందితులు రేగొండ జగదీశ్వర్, ఎలాగందుల పవన్ చందులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు దొంగిలించిన బైకులను కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.

BJP కౌన్సిల్ మెంబర్‌గా కుడితాడి చిరంజీవి
TG : హనుమకొండ జిల్లాలో బీజేపీ ఎల్కతుర్తి మండల మాజీ అధ్యక్షుడు కుడితాడి చిరంజీవికి కొత్త పదవి దక్కింది. ఆయనను సిద్దిపేట జిల్లా పార్టీ కార్యవర్గ (కౌన్సిల్) సభ్యుడిగా ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్, ఇతర నాయకులు, సహకరించిన ఎల్కతుర్తి మండల పార్టీ శ్రేణులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

🇺🇸🇮🇷 అమెరికా–ఇరాన్ టెన్షన్ మళ్లీ పెరుగుతోందా?
అమెరికా–ఇరాన్ మధ్య కాల్పులు ఆగిపోయినా.. మాటల యుద్ధం మాత్రం మళ్లీ వేడెక్కుతోంది. అమెరికా సోమవారం కొత్త ఆంక్షలు ప్రకటించబోతోంది. ఇవి ఇరాన్‌తో పాటు దాని ప్రధాన వాణిజ్య భాగస్వాములపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ మాత్రం కొత్త ఆంక్షలకు తమ స్పందన “తీవ్రంగా ఉంటుంది” అని హెచ్చరిస్తోంది. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. దీంతో టెన్షన్ కేవలం ఇరు దేశాల మధ్యే కాదు.. ప్రపంచ చమురు ధరలపైనా ప్రభావం చూపుతోంది.

మందమర్రిలో ప్రారంభమైన కొత్త కోర్టు
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో కొత్త కోర్టు బిల్డింగు ఓపెనైంది. ఇది జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు. దీనిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక ముఖ్య అతిథులుగా పాల్గొని దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సత్వర న్యాయం అందేలా కేసుల పరిష్కారంలో వాయిదాలు తగ్గించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు.

Messiకి ఫైన్ ఎందుకు పడింది?
మ్యాచ్‌లో గోల్ కొట్టిన Messi.. అదే మ్యాచ్‌లో వివాదంలోనూ చిక్కుకున్నాడు. ⚽ ఆగస్టు 19న Philadelphia Unionతో జరిగిన 2–2 డ్రాలో, ప్రత్యర్థి ఆటగాడు Quinn Sullivanతో జరిగిన ఘర్షణలో Messi అతని మెడ వెనుక భాగంపై చేయి చేసుకున్నాడు. మ్యాచ్‌లో రిఫరీ వెంటనే కార్డు ఇవ్వకపోయినా, తర్వాత MLS డిసిప్లినరీ కమిటీ వీడియోను సమీక్షించి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చింది. దీంతో Messiకి వెల్లడించని మొత్తంలో జరిమానా విధించింది. అయితే ఇది మ్యాచ్ నిషేధం కాదు.. Messi తదుపరి మ్యాచ్‌లో ఆడేందుకు అందుబాటులోనే ఉన్నాడు.

కేసుల దర్యాప్తు వేగవంతం
TG : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేసుల ఇన్వెస్టిగేషన్ నుంచి తీర్పు వరకు ప్రతి పనినీ టైమ్‌కి పూర్తి చేయాలని సీపీ అంబర్ కిశోర్ అధికారులను ఆదేశించారు. కోర్టు డ్యూటీ, లైజనింగ్ అధికారులతో జరిపిన రివ్యూలో ఆయన మాట్లాడారు. సాక్షులను కోర్టులో హాజరుపరచడం, కాగితాల పరిశీలన, సీసీటీఎన్‌ఎస్ అప్‌డేట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. నిజాయితీగా, నీతిగా ఉంటూ ఆధారాలతో సమన్వయంగా పనిచేస్తేనే కోర్టుల్లో న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

AI గ్లాసెస్ చూస్తున్నాయా… లేక మనల్నే రికార్డ్ చేస్తున్నాయా?
AI స్మార్ట్ గ్లాసెస్ స్మార్ట్‌గా మారుతున్న కొద్దీ, వాటిపై ప్రైవసీ డౌట్స్ కూడా పెరుగుతున్నాయి. కెమెరా, మైక్ ఉండటంతో చుట్టూ ఉన్నవారికి తెలియకుండానే ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసే అవకాశం ఉందనే ఆందోళనలు వస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌లోని కొన్ని సినిమాహాళ్లు ఫిల్మ్ పైరసీ, ప్రైవసీ కారణాలతో కెమెరా ఉన్న స్మార్ట్ గ్లాసెస్‌పై ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టాయి. మరోవైపు, పబ్లిక్‌లో వ్యక్తులను వారి అనుమతి లేకుండా రికార్డ్ చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. టెక్నాలజీ స్మార్ట్ అవుతోంది… మన Privacy సంగతేంటి? 👀

మంచిర్యాలలో BJP ఆందోళన
TG : 22A నిషేధిత భూముల జాబితాలో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని కోరారు. మంచిర్యాల కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు కలెక్టరేట్ గేటుకే వినతిపత్రాన్ని కట్టి తమ నిరసనను తెలియజేశారు.

మన బాడీని విద్యార్థుల చదువు కోసం ఉపయోగిద్దాం
TG : మనం చనిపోయి కూడా మన బాడీని విద్యార్థుల చదువు కోసం ఉపయోగపడేలా చేద్దాం అని CPI నాయకులు పిలుపునిచ్చారు. CPI మాజీ పార్లమెంటు సభ్యులు సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కొందుర్గు మండల కేంద్రంలో ఆయన ఫొటోకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన చేసిన పోరాటాల గురించి మాట్లాడుతూ, తన బాడీని గాంధీ హాస్పిటల్ కి ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఆయన మార్గంలో మనం కూడా నడవాలని CPI నాయకులు తెలిపారు.

క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్‌దేనా? Zee భారీ డీల్!
ఇండియాలో క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్‌కు కూడా మార్కెట్ పెరుగుతుండటంతో బ్రాడ్‌కాస్టర్ల ఫోకస్ మారుతోంది. తాజాగా Zee Entertainment ఇటలీ ఫుట్‌బాల్‌లోని టోర్నమెంట్లైన Serie A, Coppa Italia, Supercoppa Italiana ప్రసార, డిజిటల్ హక్కులను దక్కించుకుంది. దీంతో ఇటలీ టాప్ క్లబ్‌ల మ్యాచ్‌లను భారత ఫ్యాన్స్ Zee ప్లాట్‌ఫామ్‌లలో చూసే అవకాశం ఉంటుంది. విదేశీ ఫుట్‌బాల్‌కు యువతలో పెరుగుతున్న ఆసక్తి ఈ డీల్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. క్రికెట్ డామినేషన్ ఉన్న ఇండియాలో ఫుట్‌బాల్ కూడా పెద్ద స్పోర్ట్స్ మార్కెట్‌గా మారుతోందా?

షుగర్ లేని స్వీట్స్!
బెల్లంతో స్వీట్స్ ప్రిపేర్ చేయడం వల్ల టేస్ట్‌తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బెల్లం డైజెషన్‌ను ఇంప్రూవ్ చేసి మలబద్ధకం ప్రాబ్లమ్‌ను తగ్గిస్తుంది. అలాగే లివర్‌ను క్లీన్ చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. వైట్ షుగర్‌కి బదులుగా బెల్లం వాడి ఓట్స్ కుకీస్, టీ కేక్, మిల్లెట్ ఖీర్, కోకోనట్ లడ్డు లాంటివి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చని జయంతి మధుకర్ తెలిపారు. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే డైజెషన్ ఫాస్ట్‌గా అవుతుంది. అయితే బెల్లం కూడా లిమిట్‌గానే యూజ్ చేయడం మంచిది.