Latest

క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్‌దేనా? Zee భారీ డీల్!
ఇండియాలో క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్‌కు కూడా మార్కెట్ పెరుగుతుండటంతో బ్రాడ్‌కాస్టర్ల ఫోకస్ మారుతోంది. తాజాగా Zee Entertainment ఇటలీ ఫుట్‌బాల్‌లోని టోర్నమెంట్లైన Serie A, Coppa Italia, Supercoppa Italiana ప్రసార, డిజిటల్ హక్కులను దక్కించుకుంది. దీంతో ఇటలీ టాప్ క్లబ్‌ల మ్యాచ్‌లను భారత ఫ్యాన్స్ Zee ప్లాట్‌ఫామ్‌లలో చూసే అవకాశం ఉంటుంది. విదేశీ ఫుట్‌బాల్‌కు యువతలో పెరుగుతున్న ఆసక్తి ఈ డీల్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. క్రికెట్ డామినేషన్ ఉన్న ఇండియాలో ఫుట్‌బాల్ కూడా పెద్ద స్పోర్ట్స్ మార్కెట్‌గా మారుతోందా?

షుగర్ లేని స్వీట్స్!
బెల్లంతో స్వీట్స్ ప్రిపేర్ చేయడం వల్ల టేస్ట్‌తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బెల్లం డైజెషన్‌ను ఇంప్రూవ్ చేసి మలబద్ధకం ప్రాబ్లమ్‌ను తగ్గిస్తుంది. అలాగే లివర్‌ను క్లీన్ చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. వైట్ షుగర్‌కి బదులుగా బెల్లం వాడి ఓట్స్ కుకీస్, టీ కేక్, మిల్లెట్ ఖీర్, కోకోనట్ లడ్డు లాంటివి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చని జయంతి మధుకర్ తెలిపారు. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే డైజెషన్ ఫాస్ట్‌గా అవుతుంది. అయితే బెల్లం కూడా లిమిట్‌గానే యూజ్ చేయడం మంచిది.
'ఛాత్రో కీ గూంజ్' .. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పూణేలోని ఏఐఎస్‌ఎస్‌ఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (AISSMS) ఆవరణలో విద్యార్థినులతో మాట్లాడారు. 'ఛాత్రో కీ గూంజ్' (Chhatron Ki Goonj) పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని విద్యావ్యవస్థ, ఉపాధి, యువత సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముందు ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు 50-60 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.

ఢిల్లీ IITలో విద్యార్థి ఆత్మహత్య
IIT ఢిల్లీ క్యాంపస్‌లో ఇవాళ ఉదయం ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌కు చెందిన ఎం.ఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి రిషికేశ్ కుమార్(31) లెక్చర్ హాల్ కాంప్లెక్స్ ఆరో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరకలేదు. ఈ ఘటనకు గల కారణాలు తెలియలేదు. క్రైమ్ టీమ్, FSL టీమ్ సాక్ష్యాలు సేకరించాయి. మార్చి నుంచి IIT ఢిల్లీలో రెండో ఆత్మహత్య ఇది.

ఏపీలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
AP: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026ను రిలీజ్ చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్-1లో 149 పోస్టులు, గ్రూప్-2లో 673 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక శాఖలు, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ శాఖలలోనూ ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జీవోలో పేర్కొంది.

సినిమా సెట్లో ఈ చిన్న తప్పు చేస్తే అంతే!
సినిమా సెట్లో చిన్న మిస్టేక్ జరిగినా కంటిన్యూటీ మ్యాచ్ కాక పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే యాక్టర్ మూవ్‌మెంట్స్, డ్రెస్సెస్, డైలాగ్స్ అన్నీ సేమ్‌గా ఉండేలా చూసే బాధ్యత స్క్రిప్ట్ సూపర్‌వైజర్లదే. 25 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న శుభా రామచంద్ర తలాష్, భాగ్ మిల్కా భాగ్ లాంటి మూవీస్ సీక్రెట్స్ షేర్ చేశారు. తలాష్ లో ఆమిర్ ఖాన్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో 20 టేకుల సీన్ రీషూట్ చేశారట. షూటింగ్ సమయంలో నోట్స్ రాస్తూ డైరెక్టర్, ఎడిటర్‌కి ప్రతీ షాట్ పర్ఫెక్ట్‌గా రావడానికి వీళ్లే మెయిన్ హెల్ప్ చేస్తారు.

తమ ఉద్యోగాలనే AIకి నేర్పిస్తున్న క్రియేటర్లు!
హాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో కొంతమంది స్క్రీన్‌రైటర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇప్పుడు AI మోడళ్లకు తమ వర్క్ నేర్పే గిగ్ జాబ్స్ చేస్తున్నారు. స్క్రిప్ట్ రాయడం, షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేయడం, పిచ్ డెక్ తయారు చేయడం వంటి పనుల్లో AI ఇచ్చిన ఫలితాలను పరిశీలించి, వాటిని ఎలా మెరుగుపరచాలో చెబుతున్నారు. ఇందుకోసం కొందరికి గంటకు $12 నుంచి $200 వరకు చెల్లిస్తున్నారని రిపోర్ట్ చెబుతోంది. వింత ఏంటంటే AI తమ ఉద్యోగాలను తీసుకుంటుందేమో అని భయపడుతున్నవారే, ఇప్పుడు దానికి ఆ ఉద్యోగాలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు.

రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్
చాలా రోజుల తర్వాత రవితేజకు బాక్సాఫీస్ దగ్గర మంచి బూస్ట్ కనిపించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ₹24.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తాజా ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇండియాలో ₹14.80 కోట్ల నెట్ రావడంతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోనే భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. ఫ్యాన్స్‌కు నచ్చిన ఎమోషనల్ తండ్రీకూతుళ్ల కథ, ట్రైలర్‌పై ముందే వచ్చిన క్యూరియాసిటీ, రవితేజ కొత్త తరహా పాత్ర—ఈ మూడూ ఓపెనింగ్‌కు ప్లస్ అయ్యాయి. ఇది రవితేజ సోలో సినిమాల్లోనే అత్యుత్తమ ఫస్ట్ డే ఓపెనింగ్.
Justice for రూపారెడ్డి
TG : నల్గొండలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని అక్షర హైస్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. కొవ్వొత్తులు వెలిగించి, మానవహారంగా ఏర్పడి రూపారెడ్డికి నివాళులర్పించారు. స్కూళ్లలో టీచర్లు, విద్యార్థుల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని కోరారు. రూపారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

ట్రంప్ మాస్టర్ ప్లాన్: మిస్సైల్స్ కూడా ఏం చేయలేవు!
వైట్ హౌస్‌లో ప్రెసిడెంట్ ట్రంప్ నిర్మిస్తున్న $400 మిలియన్ల భారీ బాల్‌రూమ్ ప్రాజెక్ట్ వర్క్స్ కొనసాగించడానికి US సుప్రీం కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. పాత ఈస్ట్ వింగ్‌ను కూల్చేసి నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్‌లో కేవలం గ్రాండ్ బాల్‌రూమ్ మాత్రమే కాదు, గ్రౌండ్ కింద హైటెక్ సీక్రెట్ సెటప్ కూడా ఉంది. భూమి లోపల బాంబ్ షెల్టర్స్, అడ్వాన్స్డ్ మెడికల్ హాస్పిటల్స్, డ్రోన్లు, మిస్సైల్స్ దాడులను తట్టుకునే డిఫెన్స్ సిస్టమ్స్ నిర్మిస్తున్నారు. ఇది దేశ భద్రతకు చాలా కీలకమని ట్రంప్ గవర్నమెంట్ కోర్టుకు తెలిపింది.

MLA కోరం కనకయ్య అకస్మిక తనిఖీ
TG : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని బొజ్జాయిగూడెం ఆశ్రమ స్కూల్‌ను MLA కోరం కనకయ్య హఠాత్తుగా సందర్శించారు. స్కూల్లో విద్యార్థులకు అందించే భోజనం, హాస్టల్ సదుపాయాలు, మరుగుదొడ్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ రాంబాబు, పాక్స్ ఛైర్మెన్ మెట్ల కృష్ణ, ఉప సర్పంచ్ కిరణ్ కుమార్, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పెయింటర్లకు లేబర్ కార్డులు కావాలె...
పెయింటింగ్ వృత్తిలో ఉన్న పెయింటర్లందరికీ లేబర్ కార్డులు ఇవ్వాలని పెయింటర్ల యూనియన్ నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే కార్డులున్న వారివి కూడా చాలా కాలం నుంచి రెన్యువల్ కావడం లేదని, తక్షణమే రెన్యువల్ చేయాలని వారు డిమాండు చేస్తున్నారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టరేట్‌లో భవన నిర్మాణ కార్మిక అధికారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అలాగే కార్డులు లేని వారు తక్షణం ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, 2 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను యూనియన్ తరఫున సన్మానించారు.

జడ్జెస్ ఏమీ దేవుళ్లు కారు?
జడ్జెస్ ఏమీ దేవుళ్లు కారు, ప్రతీ జడ్జిమెంట్ పర్ఫెక్ట్‌గా ఇచ్చేయలేరని రిటైర్ అవుతున్న సుప్రీం కోర్ట్ జడ్జి సంజయ్ కరోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జడ్జిగా ఉన్నప్పుడు వినయం ఉండాలని, ప్రతీ కేసు వెనుక ఉన్న మనిషిని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలని చెప్పారు. శనివారం జరిగిన తన ఫేర్‌వెల్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన, జడ్జిమెంట్స్ ఇచ్చే ప్రాసెస్‌లో వినయం ఎంత ముఖ్యమో చెప్పారు.

పాలిటెక్నిక్ విలీనానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన
TG : పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్డ్ యూనివర్సిటీలో కలపొద్దంటూ AISF ఆధ్వర్యంలో విద్యార్థులు షాద్‌నగర్ RDO ఆఫీస్ ముందు నిరసన చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. రెండు గంటల పాటు జరిగిన ఈ ఆందోళన వల్ల పాత నేషనల్ హైవేపై ట్రాఫిక్ ఆగిపోయింది. తర్వాత RDO సరిత బయటకు వచ్చి, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో విద్యార్థులు నిరసన ముగించారు. ఈ కార్యక్రమంలో AISF నాయకులు ఆకాశ్ నాయక్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ ఆత్మవిమర్శ చేసుకోవాలి
TG: ముఖ్యమంత్రిపై మంత్రి కొండ సురేఖ కూతురు చేసిన కామెంట్స్ తనకు సంబంధం లేదని మాట్లాడడం సరికాదని, ఆత్మవిమర్శ చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. అసెంబ్లీ సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, ఆది శ్రీనివాస్‌లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సురేఖ చేసే పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల మనసు గాయపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పైన, వారి సోదరులపైన ఆమె కూతురు విమర్శలు చేస్తుంటే కొండా సురేఖ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.

పెద్దకాకాని శివాలయంలో అమ్మవారి నగలు మాయం
AP: గుంటూరు జిల్లా పెద్దకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి 80 గ్రాముల నల్లపూసల మంగళసూత్రం మాయమైంది. దీని విలువ సుమారు రూ.15 లక్షలు. రెండు రోజుల క్రితం గుర్తించిన అర్చకులు ఈవోకు సమాచారం అందించారు. ఆలయ అంతర్గత విచారణలో ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గర్భగుడిలోకి వెళ్లే 17 మంది అర్చకులను పోలీసులు విచారించగా, ఐదుగురిపై అనుమానం వ్యక్తమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధుల హక్కులు కాపాడాలి: జడ్జ్ స్వాతి రెడ్డి
TG : వృద్ధుల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని షాద్‌నగర్ జడ్జ్ స్వాతి రెడ్డి చెప్పారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా FCN వృద్ధాశ్రమంలో జరిగిన ప్రోగ్రామ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారా వృద్ధులకు ఉండే హక్కుల గురించి వివరించారు. అక్కడ ఉన్న వృద్ధులకు పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు, ఇతరులు పాల్గొన్నారు.

50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనం సాధ్యమేనా?
హైదరాబాదులో 50 గజాల స్థలంలో కడుతున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. అంత స్థలంలో ఏడంతస్తుల బిల్డిండ్ కట్టడం సాధ్యమేనా అని జనం చర్చించుకుంటున్నారు. ఒక గజం అంటే 1 9 చదరపు అడుగులు. ఆ లెక్కన 50 గజాలంటే 450 చదరపు అడుగులు. ఇంత చిన్న విస్తీర్ణంలో ఏడంతస్తులు సాధ్యం కాదని భవన నిర్మాణరంగ నిపుణులు అంటున్నారు. పైగా Telangana Building Rules ప్రకారం 50 చ.మీ. కంటే తక్కువ ప్లాట్లకు సాధారణంగా ఏడు మీటర్ల ఎత్తు మాత్రమే ఉండాలనే రూల్ ఉందని, ఏడంతస్తుల భవనం సుమారు 21 మీటర్ల కంటే ఎక్కువే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

గిరిజనుల కోసం CPM మహాధర్నా
AP : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో CPM నేతలు RDO ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. గిరిజనుల హక్కులు, భూముల విషయంలో అధికారులు, పోలీసులు భూస్వాములకే సపోర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గిరిజనుల కోసం పోరాడుతున్న తమ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీషీట్లను వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టాన్ని అమలు చేయాలని, ఎల్‌టీఆర్ భూముల విషయంలో పోలీసుల జోక్యం ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో CPM ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

గచ్చిబౌలిలో కూలిన బిల్డింగ్.. స్పాట్‌కు చేరుకున్న MLA
TG: ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాద ఘటన జరిగింది. అంజయ్యనగర్‌లో కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఏడంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ స్పాట్‌కు చేరుకున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్‌కు పాల్పడిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ప్రమాదానికి సంబంధిత అధికారులు, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు.

విదేశాల్లో నెలకు రూ.2 లక్షల సాలరీతో జాబ్స్
తెలంగాణ యూత్‌కి ఫారెన్‌లో బ్లూ కాలర్ జాబ్స్ ఇప్పించేందుకు గవర్నమెంట్ 'టామ్‌కామ్' ద్వారా ప్లాన్ చేసింది. కనీస విద్యార్హత ఉండి, అక్కడి లోకల్ లాంగ్వేజ్ వస్తే చాలు.. నెలకు రూ.2 లక్షల వరకు శాలరీ సంపాదించవచ్చు. ప్రతీ ఇయర్ 5 వేల మందికి, 2047 కల్లా 2 లక్షల మందికి విదేశాల్లో జాబ్స్ ఇప్పించడమే టార్గెట్. గవర్నమెంట్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఇస్తుంది. జర్మనీ, జపాన్, యూఏఈల్లో హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్‌లో భారీగా వేకెన్సీస్ ఉన్నాయి.