హైకోర్టుల్లో 30 శాతం జడ్జి పోస్టులు ఖాళీ

దేశంలో ఉన్న హైకోర్టు జడ్జి పోస్టుల్లో 30 శాతం కంటే ఎక్కువ ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 1,122 పోస్టుల్లో జూలై నాటికి 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే భారీగా వర్క్ లోడ్‌తో న్యాయమూర్తులపై ఒత్తిడి పెరుగుతోంది. హైకోర్టుల్లో 60 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో సగం కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 52 ఖాళీలు ఉన్నాయి. కలకత్తా హైకోర్టులో 31, పంజాబ్-హర్యానా హైకోర్టులో 30 ఖాళీలు ఉన్నాయి.



