Latest

బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు షేక్ హసీనా రెడీ!
Politics· 29 Jul 2026

బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు షేక్ హసీనా రెడీ!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన సొంత దేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ తనను అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా లేదా చంపేసినా డిసెంబర్ నాటికి ఖచ్చితంగా వెళ్తానని స్పష్టం చేశారు. 2024 స్టూడెంట్స్ ప్రొటెస్ట్ టైమ్‌లో క్రైమ్స్ చేశారనే ఆరోపణలతో అక్కడి కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం ఇండియాలో ఉంటున్న 78 ఏళ్ల హసీనా, తనపై వచ్చిన కేసెస్ అన్నీ పొలిటికల్ రివేంజ్ అని, తన ప్రజల కోసమే రిస్క్ చేసి తిరిగి వెళ్తున్నానని స్పష్టం చేశారు.

తెలంగాణ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల
Education· 29 Jul 2026

తెలంగాణ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-SET-2026) నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 3 నుంచి 30 వరకు ఫైన్ లేకుండా <a href="http://www.telanganaset.org/">ఆన్‌లైన్‌</a>లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేట్ అయితే ₹3000 ఫైన్‌తో సెప్టెంబర్ 12 వరకు ఛాన్స్ ఉంది. అప్లికేషన్‌లో తప్పులుంటే సరిదిద్దుకోవడానికి సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు టైమ్ ఇచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థులపై కాల్పులకు అమిత్ షానే కారణం: రాహుల్ గాంధీ
Politics· 29 Jul 2026

విద్యార్థులపై కాల్పులకు అమిత్ షానే కారణం: రాహుల్ గాంధీ

లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా హీట్ పెరిగింది. NEET నిరసనల సమయంలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించడానికి అమిత్ షానే ఆదేశించారని ఆయన అన్నారు. అంతేకాదు, "అమిత్ షా భయపడుతున్నారు అందుకే సభకు రావడం లేదు" అని కూడా చెప్పారు.దీంతో BJP సభ్యులు "ఆధారాలేంటి?" అంటూ నిలదీశారు. కిరణ్ రిజిజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా.. స్పీకర్ ఓం బిర్లా రాహుల్ చేసిన కొన్ని కామెంట్స్‌ను 'అన్‌పార్లమెంటరీ'గా పేర్కొంటూ రికార్డుల నుంచి తొలగించారు.

ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారికి సర్కార్ గుడ్ న్యూస్
Infotainment· 29 Jul 2026

ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారికి సర్కార్ గుడ్ న్యూస్

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా కొనే ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై టాక్స్ 100 శాతం మినహాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళల పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలను కొంటే మరిన్ని ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడమే ఈ నిర్ణయం లక్ష్యమని పేర్కొంది.

IITల్లో విద్యార్థుల ఆత్మహత్యలు
News· 29 Jul 2026

IITల్లో విద్యార్థుల ఆత్మహత్యలు

IIT బాంబేలో 'సోహిల్ రాజ్‌కుమార్' అనే మెటీరియల్ సైన్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. కుటుంబ, ప్రేమ సమస్యల వల్లే అతను సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం అతని ఫోన్, చాట్స్ చెక్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే IIT గౌహతిలోనూ 'రితేష్ రాజ్' అనే స్టూడెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అక్కపెల్లి వద్ద రాకపోకలు బంద్.. హైఅలర్ట్
TG· 29 Jul 2026

అక్కపెల్లి వద్ద రాకపోకలు బంద్.. హైఅలర్ట్

TG: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అక్కపెల్లి గ్రామం వద్ద పాలవాగు ఉప్పొంగి లోలెవల్ వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రహదారిని పూర్తిగా మూసివేసి రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ మల్లికార్జున్, సీఐ, ఎంపీడీవో కలిసి పరిస్థితిని పరిశీలించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, వాగులు, చెరువుల వద్దకు వెళ్లి చేపల వేట, ఈత, ఫోటోలు తీయొద్దని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

జయం రవి డివోర్స్ కేసులో కోర్టు షాక్!
Legal· 29 Jul 2026

జయం రవి డివోర్స్ కేసులో కోర్టు షాక్!

కోలీవుడ్ యాక్టర్ జయం రవి డివోర్స్ కేసులో చెన్నై ఫ్యామిలీ కోర్టు కీలక ఆర్డర్స్ ఇచ్చింది. రవి మోహన్ నుంచి నెలకు ₹40 లక్షల భరణం కావాలన్న భార్య ఆర్తి పిటిషన్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. కేసు పూర్తయ్యే వరకు నెలకు ₹3 లక్షలు మాత్రమే పే చేయాలని ఆదేశించింది. అంతేకాదు, కొడుకులు ఆరవ్, అయాన్‌లను రవి మోహన్ కలవడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదని క్లారిటీ ఇచ్చింది. కాగా, 15 ఏళ్ల పెళ్లి బంధం తర్వాత 2024లో రవి డివోర్స్ అప్లై చేశారు.

విద్యాశాఖను RSS నడుపుతోంది: రాహుల్ గాంధీ
Politics· 29 Jul 2026

విద్యాశాఖను RSS నడుపుతోంది: రాహుల్ గాంధీ

పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరుగుతుండగా.. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌తో లోక్‌సభ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. "విద్యాశాఖను నడుపుతోంది మంత్రి కాదు.. RSS" అని ఆయన చెప్పడంతో BJP సభ్యులు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొద్దిసేపు రచ్చ జరిగింది. ఇదే సమయంలో జంతర్ మంతర్ నిరసనలపై చర్చ జరపాలని ప్రతిపక్షం డిమాండ్ చేయడంతో.. లోక్‌సభ, రాజ్యసభ రెండింటినీ కొద్దిసేపు వాయిదా వేశారు.

‘ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రి కావడం కన్నడిగులకు సిగ్గుచేటు’
India· 29 Jul 2026

‘ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రి కావడం కన్నడిగులకు సిగ్గుచేటు’

కర్ణాటకకు చెందిన ఎంపీ కేంద్రం విద్యాశాఖ మంత్రిగా నియమించినందుకు గర్వపడాలి కానీ, ప్రహ్లాద్ జోషి అనే ఎంపీని విద్యామంత్రిగా నియమించడంతో కన్నడిగులు సిగ్గుపడుతున్నారని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. మహిళలపై అత్యాచారం చేసినవారిని సమర్థించిన వ్యక్తిని కేంద్ర మంత్రిని చేయడం సిగ్గుచేటన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆయన ఏమాత్రం భిన్నమైన వ్యక్తి కాదని తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇద్దరూ సంఘ్ పరివార్‌లోని ABVP నుంచి పార్టీలోకి వచ్చారని, సిద్ధాంతపరంగా కవలల్లాంటివారని పేర్కొన్నారు.

ప్రాణహిత, గోదావరి నదుల ఉగ్రరూపం.. హైఅలర్ట్
TG· 29 Jul 2026

ప్రాణహిత, గోదావరి నదుల ఉగ్రరూపం.. హైఅలర్ట్

TG: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రాణహిత, గోదావరి నదుల వరద పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు <a href="https://www.theclearcutnews.com/n/ru3a7Gr">అప్రమత్తం</a>గా ఉండాలని ఆదేశించారు. మట్టి, పెంకుటిళ్లు, రేకుల ఇళ్లలో నివసించే ప్రజలు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని, చేపల వేట, ఈత, స్నానాలు పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రానికే గర్వకారణంగా IIM.. ప్రారంభానికి సిద్ధం
Education· 29 Jul 2026

రాష్ట్రానికే గర్వకారణంగా IIM.. ప్రారంభానికి సిద్ధం

AP: విశాఖపట్నంలోని IIM శాశ్వత క్యాంపస్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. రూ.450 కోట్ల వ్యయంతో 241.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాంగణం పనులు 95 శాతం పూర్తయ్యాయి. అకాడమిక్ బ్లాకులు, హాస్టళ్లు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, ఫ్యాకల్టీ క్వార్టర్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సోలార్ పవర్ సిస్టమ్‌తో క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 2015 నుంచి తాత్కాలిక ప్రాంగణంలో కొనసాగుతున్న విశాఖపట్నం IIM, త్వరలో శాశ్వత క్యాంపస్‌లోకి మారనుండటం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగానికి రాష్ట్రప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు.

అల్లు అర్జున్ ముందే బ్యాక్‌ఫ్లిప్!
Cinema· 29 Jul 2026

అల్లు అర్జున్ ముందే బ్యాక్‌ఫ్లిప్!

బన్నీ రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ మీట్‌లో ఒక <a href="https://x.com/allubabloo/status/2082406917599867238?s=20">ఫ్యాన్</a> బన్నీ ముందే క్రేజీగా బ్యాక్‌ఫ్లిప్ వేసి, పుష్పా సిగ్నేచర్ స్టెప్‌తో అలరించాడు. అతడి పర్‌ఫార్మెన్స్‌కు అల్లు అర్జున్ షాక్ అయి ఫుల్ ఇంప్రెస్ అయ్యారు. ఆ ఫ్యాన్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని విష్ చేయడమే కాకుండా.. ఐఫోన్ బ్యాక్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చి స్పెషల్ పిక్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

మహిళను వేధించిన జూబ్లీహిల్స్ SHO సస్పెండ్
TG· 29 Jul 2026

మహిళను వేధించిన జూబ్లీహిల్స్ SHO సస్పెండ్

TG: ఒక మహిళను వేధించి, బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలపై జూబ్లీహిల్స్ SHO యు. శ్రీనివాసులు రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. ఓ కేసు కోసం వచ్చిన తనను లోబరుచుకుని, లైంగికంగా వేధించి, అబార్షన్ చేయించాడని బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. ప్రైవేట్ వీడియోలతో బెదిరించి రూ. 2 కోట్లు అడిగాడని చెప్పింది. జూబ్లీహిల్స్ పోస్టింగ్ కోసం ఆయన రూ. 25 లక్షలు లంచం ఇచ్చాడని కూడా ఆరోపించింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

కాంగ్రెస్ గవర్నమెంట్‌కు థాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్!
AP· 29 Jul 2026

కాంగ్రెస్ గవర్నమెంట్‌కు థాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్!

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు. APలో హ్యూమన్-ఎలిఫెంట్ ప్రాబ్లమ్‌ను కంట్రోల్ చేయడానికి, ఫారెస్ట్ సెక్యూరిటీ పెంచడానికి కుంకీ ఏనుగులను సరైన టైమ్‌లో పంపినందుకు థాంక్స్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కొత్తగా స్టార్ట్ చేసిన గుచిమి కుంకీ ఎలిఫెంట్ క్యాంప్‌ను ఆయన ఆన్‌లైన్‌లో ఓపెన్ చేశారు. పాలిటిక్స్ పక్కనపెట్టి ప్రజల కోసం స్టేట్స్ ఇలా కలిసి పనిచేయడం మంచి విషయమని పవన్ అన్నారు.

'ది ప్యారడైజ్'లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్?
Entertainment· 29 Jul 2026

'ది ప్యారడైజ్'లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్?

'ది ప్యారడైజ్' నుంచి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే, నాని కెరీర్‌లో తొలిసారి ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచగా.. ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ వార్త మరింత ఆసక్తి పెంచుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

మహిళని చంపి ఆ డెడ్‌బాడీతో 350 కి.మీ. ప్రయాణం
Crime· 29 Jul 2026

మహిళని చంపి ఆ డెడ్‌బాడీతో 350 కి.మీ. ప్రయాణం

మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. మరొకరితో సంబంధముందన్న అనుమానంతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళను గొంతు నులిమి చంపాడు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కొల్హాపూర్ జిల్లాలోని షిర్గావ్ గ్రామానికి చెందిన ప్రకాష్ ఆనంద్ పాటిల్ (40) ఆదివారం తన పొలంలో సురేఖ శివాజీనే ఆరే (40)ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తరువాత మృతదేహాన్ని కారులో 350 కి.మీ. దూరంలోని థానే జిల్లా భివండీలోని కషెలికి తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అవినీతిని అంతం చేయనున్న 'AI' పరిపాలన: RGV
General· 29 Jul 2026

అవినీతిని అంతం చేయనున్న 'AI' పరిపాలన: RGV

ప్రస్తుతం ఉన్న సిస్టమ్‌లో అధికారులు, లీడర్లు లంచాలకు ఆశపడి తప్పులు చేస్తున్నారు. వీరి స్థానంలో 'AI' ని పెడితే అద్భుతాలు జరుగుతాయి. అని RGV 'X' లో పోస్ట్ చేశారు. 'AI' కి ఫామిలీ, భయం ఉండదు కాబట్టి దానికి ఎవరూ లంచం ఇవ్వలేరు. దుబాయ్‌లో ఇప్పటికే AI పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయి. లీడర్లు సొంత లాభాల కోసం తప్పుడు లెక్కలు చెప్తారు. అదే AI అయితే అన్ని వివరాలు కరెక్ట్ గ చెప్తుంది. AI వస్తే తమ పవర్ పోతుందని పోలిటీషన్స్ భయపడతున్నారు అని వర్మ అన్నారు.

“మా అమ్మకు స్లిప్పర్లు ఇవ్వండి”..అస్సాం బాలుడి ఆవేదన
India· 29 Jul 2026

“మా అమ్మకు స్లిప్పర్లు ఇవ్వండి”..అస్సాం బాలుడి ఆవేదన

అస్సాం రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల్లో ఇళ్లు, వస్తువులు, ధాన్యం కోల్పోయిన వేలాది కుటుంబాల పునరావాసం కోసం ఎదురుచూస్తున్నాయి. దాతలు వస్తువులు పంపిణీ చేస్తున్న టైంలో ఆ పిల్లవాడు “మా అమ్మకు స్లిప్పర్లు ఇవ్వండి” అని వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వరదల్లో ఇప్పటికే 75 మంది దాకా ప్రాణాలు కోల్పోగా, ఊళ్లకు ఊళ్లు నీళ్లతో నిండిపోయాయి. వందల ఇళ్లు కొట్టుకుపోయాయి.

నన్ను క్లాస్‌రూమ్‌లోనే అరెస్ట్ చేశారు- జేపీ నడ్డా
Politics· 29 Jul 2026

నన్ను క్లాస్‌రూమ్‌లోనే అరెస్ట్ చేశారు- జేపీ నడ్డా

నిరసన తెలిపిన స్టూడెంట్స్‌పై పోలీసుల లాఠీచార్జ్‌ను రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తప్పుపట్టారు. దీనిపై యూనియన్ మినిస్టర్ జేపీ నడ్డా కౌంటర్ ఇస్తూ.. తాను స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైమ్‌లో పోలీస్ లు క్లాస్‌రూమ్‌లోనే తనను అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు పోలీసులు రూల్స్ ప్రకారమే యాక్షన్ తీసుకున్నారని చెప్పారు. ఇంకోవైపు, యాంటీ-పేపర్ లీక్ బిల్‌పై డిస్కషన్ జరగకుండా అపోజిషన్ లీడర్స్ కావాలనే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని మినిస్టర్ కిరణ్ రిజిజు సీరియస్ అయ్యారు.

ఆమె చేసిన పనికి ప్రభుత్వం పరువు పోయింది!
Motivational· 29 Jul 2026

ఆమె చేసిన పనికి ప్రభుత్వం పరువు పోయింది!

'ఎవరైనా వచ్చి చేస్తారు' అనుకోలేదు, 'నేనే చేస్తా' అనుకుంది. బెంగళూరులో భారీ వర్షాలతో రోడ్లు గుంతలతో నిండిపోయాయి. దీంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఓ పెద్ద గుంతను చూసిన మహిళ, సంచుల్లో నిర్మాణ సామగ్రి తీసుకొచ్చి, గుంతలో రాళ్లు పోసి దాన్ని సమం చేసే ప్రయత్నం చేసింది. ఒకవైపు ఆమె చొరవను నెటిజన్లు మెచ్చుకుంటుంటే, మరోవైపు 'ప్రజలే రోడ్లు బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది'? అంటూ కామెంట్లు చేస్తున్నారు. గుంతను మాత్రం నింపింది, కానీ లేవనెత్తిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది!

బాలుణ్ని కాపాడినందుకు..ట్రంప్ అత్యున్నత పౌర పురస్కారం
World· 29 Jul 2026

బాలుణ్ని కాపాడినందుకు..ట్రంప్ అత్యున్నత పౌర పురస్కారం

అమెరికాలోని కాలిఫోర్నియాలో సాంటా క్రూజ్ బీచ్‌లో అలల్లో చిక్కుకున్న 10 ఏళ్ల బాలుణ్ని కాపాడిన లైఫ్‌గార్డ్‌ అత్యున్నత పౌర పురస్కారం అందుకోనున్నారు. ఆ యువకుడిని, అతని కుటుంబాన్ని, రక్షించిన బాలుడితో కలిసి వైట్‌హౌస్‌కు పిలిచి అవార్డు అందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఘటనలో మరో లైఫ్‌గార్డ్, బీచ్‌లో ఉన్నవారు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.