‘ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రి కావడం కన్నడిగులకు సిగ్గుచేటు’

కర్ణాటకకు చెందిన ఎంపీ కేంద్రం విద్యాశాఖ మంత్రిగా నియమించినందుకు గర్వపడాలి కానీ, ప్రహ్లాద్ జోషి అనే ఎంపీని విద్యామంత్రిగా నియమించడంతో కన్నడిగులు సిగ్గుపడుతున్నారని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. మహిళలపై అత్యాచారం చేసినవారిని సమర్థించిన వ్యక్తిని కేంద్ర మంత్రిని చేయడం సిగ్గుచేటన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆయన ఏమాత్రం భిన్నమైన వ్యక్తి కాదని తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇద్దరూ సంఘ్ పరివార్‌లోని ABVP నుంచి పార్టీలోకి వచ్చారని, సిద్ధాంతపరంగా కవలల్లాంటివారని పేర్కొన్నారు.


