Latest

ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండాలి: రేవంత్ రెడ్డి
TG: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్(CURE) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదలకు ఊరికి దూరంగా కాకుండా అన్ని సదుపాయాలు ఉండేలా ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ORR లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను తక్షణమే గుర్తించాలని అధికారులకు సూచించారు. ఆ స్థలాలను పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

వృద్ధాప్యానికి చెక్ పెట్టాలన్న బిలియనీర్
అమెరికన్ టెక్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తాను ల్యాబ్‌లో తన సొంత 'బేబీ క్లోన్'ను సృష్టించినట్లు ప్రకటించారు. తన శరీర కణాలను పిండ దశకు మార్చి, భవిష్యత్తులో కొత్త అవయవాల తయారీ, ఔషధాల పరీక్షలు, యవ్వన కణాల చికిత్స కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ ప్రయోగం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మానవ క్లోనింగ్ విజయవంతమైందని శాస్త్రీయ ఆధారాలు లేవు. దీంతో బ్రయాన్ చేసిన ఈ ప్రకటనపై శాస్త్రవేత్తలు, నెటిజన్లలో తీవ్ర చర్చ సాగుతోంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపే నిర్ణయం!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తమ డిమాండ్‌పై ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, దీనిపై రేపు మధ్యాహ్నం వరకు ప్రభుత్వం సమయం అడిగిందని CJP స్పోక్స్ పర్సన్ అశుతోష్ రంకా తెలిపారు. విద్యాశాఖ మంత్రిని త్వరలోనే తొలగిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే నీట్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం అందించడం, విద్యార్థులపై నమోదైన FIRలు, కేసులను ఉపసంహరించుకోవడం అనే రెండు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ వద్ద పోలీస్ రాజీనామా!
స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌కు మద్దతుగా ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ స్టేజ్ పై యూనిఫామ్‌లోనే ప్రసంగిస్తూ, ఎగ్జామ్ పేపర్ లీకేజీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల కోసం పోరాడటం తిరుగుబాటు అయితే, తాను తిరుగుబాటుదారుడినేనని ప్రకటిస్తూ.. తన రాజీనామా లేఖను CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేకు నేరుగా అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

స్ట్రెస్ కంట్రోల్‌కు కొత్త మార్గం ‘ఫ్రిజ్ సిగరెట్’
ఒత్తిడి తగ్గించుకోవడానికి నేటితరం GEN-Z కొత్త అలవాటును ఎంచుకుంటోంది. సిగరెట్‌కు బదులుగా చల్లటి కూల్‌డ్రింక్స్ తాగి రిలీఫ్ పొందే ఈ పద్ధతిని 'ఫ్రిజ్ సిగరెట్' అంటున్నారు. మానసిక అలసట నుంచి బయటపడేందుకు మెదడు ఎంచుకునే మార్గం ఇదని నిపుణులు చెప్తున్నారు. అయితే తరచూ తాగుతుంటే శరీరంలో షుగర్, కెమికల్స్ ఎక్కువై ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికి బదులుగా కొబ్బరినీళ్లు, హెర్బల్ టీ తాగడం లేదా కొద్దిసేపు నడవడం, స్నేహితులతో మాట్లాడటం ఇంకా మంచి మార్గాలు.

మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో చంద్రబాబు
AP: పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ హైస్కూల్లో ఈరోజు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు తరగతి గదిలో విద్యార్ధులు, వారి తల్లితండ్రులు, టీచర్లతో మాట్లాడారు. విద్యార్థుల చదువు పురోగతి, ప్రోగ్రెస్ రిపోర్టు కార్డును స్వయంగా పరిశీలించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఫొటోఫ్రేమ్ వద్ద విద్యార్థులు, వారి తల్లితండ్రులతో ఫోటోలు దిగారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
అనవసరంగా GenZ తరంతో పెట్టుకున్నావు మోడీ- KTR
విద్యా విధానంలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్‌చుక్ చేసిన దీక్షను ED, CBI భయాలతో ప్రధాన మీడియా కవర్ చేయలేదని BRS లీడర్ KTR ఆరోపించారు. అయితే, యువత సోషల్ మీడియా వేదికగా నిరసన స్వరాన్ని దేశవ్యాప్తంగా వినిపించిందని ఆయన ప్రశంసించారు. నేపాల్, శ్రీలంకల్లో యువత తిరుగుబాటుతో ప్రభుత్వాలే పడిపోయిన చరిత్రను గుర్తుచేస్తూ, Gen Z తరంతో పెట్టుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హెచ్చరించాడు

23 మంది విద్యార్థినులకు అస్వస్థత
TG: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులంలో 23 మంది ఇంటర్, 10వ తరగతి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి బగారా రైస్, ఆలు కూర, సొరకాయ కూర తిన్న తర్వాత 15 మంది కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డారు. వార్డెన్ వారిని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 11 మంది కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. ఉదయం మరో 8 మందికి విరోచనాలు, వాంతులు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని, నరేందర్ రాఠోడ్ (DMHO) తెలిపారు.

సన్‌స్క్రీన్ స్ప్రే వాడుతున్నారా?
ప్రస్తుతం చర్మాన్ని ట్యాన్, పిగ్మెంటేషన్ నుంచి కాపాడుకునేందుకు సన్‌స్క్రీన్ స్ప్రేలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. క్రీమ్‌లతో పోలిస్తే ఇవి పల్చగా ఉంటాయి. అయితే స్ప్రే చేసుకుంటే సరిపోదని, చర్మంపై తేలికపాటి పొరలా మెరిసేంత వరకు స్ప్రే చేసి మర్దనా చేయాలని నిపుణులు అంటున్నారు. ముఖంపై నేరుగా స్ప్రే చేయకుండా అరచేతిలో వేసుకుని రాసుకోవడం వల్ల కళ్లు, ముక్కులోకి వెళ్లకుండా ఉంటుందంటున్నారు.

బలప్రయోగం చేసిన పోలీసులను గుర్తించేందుకు వెబ్ సైట్: సీజేపీ
'పార్లమెంట్ మార్చ్' సందర్భంగా బలప్రయోగానికి పాల్పడిన పోలీసు సిబ్బందిని గుర్తించేందుకు వెబ్ సైట్‌ను ప్రారంభించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. తమ ఉద్యమానికి విదేశీ నిధులు అందుతున్నాయన్న ఆరోపణలను ఖండించారు. ఆ ఆరోపణలు నిజమైతే ప్రభుత్వం సోనమ్ వాంగ్‌చుక్‌తోపాటు తమతో ఎందుకు చర్చలు జరుపుతోందని ప్రశ్నించారు.

కరెంట్ కోతలపై హరీష్‌రావు ఫైర్
TG: యాదాద్రిభువనగిరి జిల్లా సోలిపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్‌రావు, రైతులకు కరెంట్ కోతలు విధిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి 10–12 గంటలకే పరిమితమవుతోందని ఆరోపించారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ అందించాలంటే ఉత్పత్తిని పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రొటెస్టర్స్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఇదే!
జులై 20న ప్రొటెస్టర్స్ పై జరిగిన దాడిని అస్సలు ఊరుకునేది లేదని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పోక్స్ పర్సన్ హెచ్చరించారు. ప్రొటెస్టర్స్ పై ఎటాక్ చేసి, మహిళలను వేధించిన ప్రతి పోలీస్ ఆఫీసర్‌ని బాధ్యులను చేస్తూ ఐడెంటిఫై చేస్తామన్నారు. దీనికోసం త్వరలోనే ఒక వెబ్‌సైట్ లాంచ్ చేస్తున్నామని, అందులో దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయవచ్చని చెప్పారు. లీగల్‌గా ప్రొసీడ్ అయ్యి ఆఫీసర్లపై FIR ఫైల్ చేస్తామని, అవసరమైతే కోర్టుకి వెళ్లైనా సరే బాధ్యులను జైలుకి పంపుతామని క్లియర్‌గా చెప్పారు.
జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్.. నెక్స్ట్ ఏంటి?
ధర్మేంద్ర ప్రధాన్ ఇమీడియట్‌గా రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. యువత హక్కుల కోసం 26 రోజులకు పైగా హంగర్ స్ట్రైక్ చేసిన సోనమ్ సర్ ఫైనల్‌గా దీక్ష విరమించడం పట్ల ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రెజెంట్ ఈ ప్రొటెస్ట్ నెక్స్ట్ లెవల్‌కి రీచ్ అయ్యిందని, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు జంతర్ మంతర్ దగ్గర తమ పోరాటం అసలు ఆపేదే లేదని అభిజిత్ స్పష్టం చేశారు.

జనగాం జిల్లాలో ఘోర ప్రమాదం
TG: జనగాం జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నర్సింగపురం తండాకు చెందిన కేతావత్ నరేందర్, బాదావత్ తిరుపతి స్పాట్‌లోనే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నీట్ లీక్‌పై మోదీ క్షమాపణ చెప్పాలి
TG: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భువనగిరిలో మాట్లాడిన ఆయన, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆరోపించారు. గత 12ఏళ్లలో 152సార్లు పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఇది BJP ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

💸 కరెన్సీలో భారీ మార్పు
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పేపర్ నోట్ల స్థానంలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టేందుకు RBI కసరత్తు ప్రారంభించింది. తొలుత రూ.10, రూ.20 నోట్లను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకురానుండగా, విజయవంతమైతే ఇతర నోట్లకూ విస్తరించనుంది. ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఒక్కో నోటు తయారీకి రూ.2 నుంచి రూ.6 వరకు ఖర్చవుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

CJP నిరసనలపై సుప్రీంకోర్టు ట్విస్ట్
CJP విద్యార్థుల నిరసనలపై దిల్లీలో జరిగిన పోలీసు చర్యల విషయంలో సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించిందన్న వార్తలపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదని, అయినా కోర్టు విచారణకు నిరాకరించినట్లు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. రిజిస్ట్రీని పరిశీలించగా ఈ కేసుకు సంబంధించి ఒక్క పేజీ కూడా దాఖలు కాలేదని స్పష్టం చేశారు.

పోటాపోటీగా నినాదాలు.. నర్సంపేటలో ఉద్రిక్తత
TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్, BJP శ్రేణులు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ, రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు కాకతీయ తోరణం వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడికి చేరుకున్న BJP నాయకులు ప్రతినిరసన చేపట్టడంతో ఇరువర్గాల నాయకులు పోటాపోటీగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ వాగ్వాదం తోపులాటకు దారితీసింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గుజరాత్‌లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు
గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వల్సాద్ జిల్లా ఉంబెర్‌గావ్ తాలూకాలో 16 గంటల్లోనే 1,100 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 600 మి.మీకి పైగా వర్షం కురవగా సూరత్, నవ్‌సారీ, డాంగ్స్, తాపి, వల్సాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ప్రైసెస్ ఇలా ఉన్నాయి!
భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం యూటర్న్ తీసుకుని భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,850 తగ్గి రూ.1,44,330కి, 22 క్యారెట్ల రేటు రూ.1,700 తగ్గి రూ.1,32,300కి చేరింది. అలాగే వెండి కిలోకు రూ.5,000 తగ్గి రూ.2,40,000గా ఉంది. మార్కెట్ ట్రెండ్‌ను బట్టి రేట్స్ చేంజ్ అయ్యే చాన్స్ ఉన్నందున కొనేముందు లైవ్ ప్రైస్ చెక్ చేయడం బెటర్.

మెటర్నిటీ సెలవులపై కోర్టు నిర్ణయం
తక్కువ సమయంలోనే రెండోసారి ప్రసవం జరిగిన మహిళలకు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. రెండు కాన్పుల మధ్య ఇన్ని రోజులు గ్యాప్ ఉండాలన్న రూల్ ఏదీ చట్టంలో లేదని చెప్పింది. ఏడాదిన్నరలోనే రెండోసారి సెలవు అడిగిన ఒక నర్సుకు పర్మిషన్ ఇవ్వకపోవడం తప్పని తెలిపింది. ఆమెను మళ్లీ సెలవులకు అప్లికేషన్ పెట్టుకొమని చెప్పి, దానికి అధికారులను అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.