← Back to news

కరెంట్ కోతలపై హరీష్‌రావు ఫైర్

By DK· 24 Jul 2026· యాదాద్రిభువనగిరి జిల్లా
కరెంట్ కోతలపై హరీష్‌రావు ఫైర్

TG: యాదాద్రిభువనగిరి జిల్లా సోలిపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్‌రావు, రైతులకు కరెంట్ కోతలు విధిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి 10–12 గంటలకే పరిమితమవుతోందని ఆరోపించారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ అందించాలంటే ఉత్పత్తిని పెంచాలని డిమాండ్ చేశారు.

More in TG