← Back to news

చాక్లెట్ల ఆశచూపి బాలికపై అత్యాచారం

By DK· 15 Jul 2026
చాక్లెట్ల ఆశచూపి బాలికపై అత్యాచారం

TG: హైదరాబాద్‌లోని KPHB పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలిక ఇంటి ముందు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహాన్‌ అనే వ్యక్తి పండ్లు అమ్ముకుంటూ ఉండేవాడు. మే నెలలో బాలికతో పరిచయం పెంచుకున్న రెహాన్ తన ఇంట్లో చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో ఆమె విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది. రెహాన్ మరోసారి ఆమెను వేధించడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 18h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.