Latest

వింత ఆచారం.. వర్షాల కోసం ఏం చేశారంటే..?
AP· 11 Jul 2026

వింత ఆచారం.. వర్షాల కోసం ఏం చేశారంటే..?

AP: అనంతపురం జిల్లా ఉరవకొండలో వర్షాలు కురవాలని పెళ్లి కాని యువకులు 108 బిందెల నీటితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుగురు పెళ్లి కాని యువకులు 108 బిందెలతో నీటిని మోసుకొచ్చి శమీ వృక్షం, నాగుల కట్టకు జలాభిషేకం చేశారు. 108 కొబ్బరికాయలు కొట్టి, 108 నిమ్మకాయలతో పూజలు చేశారు. కొత్త కుండను జొన్నలపై ఉంచి నీటితో నింపి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించారు. జమ్మి అంకాలమ్మ అనుగ్రహంతో వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలని కోరారు.

ఫేస్ బుక్, ఇన్ స్టా ఫీచర్లపై ఈయూ కమిషన్ ఫైర్ !
News· 11 Jul 2026

ఫేస్ బుక్, ఇన్ స్టా ఫీచర్లపై ఈయూ కమిషన్ ఫైర్ !

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లైన ఫేస్ బుక్ ఇన్ స్టా గ్రామ్ లు యూజర్ల మైండ్ ను ఆటో పైలెట్ మోడ్ లోకి నెడుతున్నాయని యూరోపియన్ కమిషన్ ఆరోపించింది. ఈరెండు ప్లాట్ ఫామ్ లలో ఉన్న ఫీచర్లలో మార్పులు చేయాలని లేకుంటే భారీగా పెనాల్టీ పడుతుందని మెటా సంస్థను వార్న్ చేసింది. ఈ రెంటిలోనూ ఉన్న ఇన్ ఫినిట్ స్క్రోలింగ్,ఆటో ప్లే ఫీచర్లు టీనేజ్ యూజర్ల మైండ్ ను అడిక్ట్ అయ్యేలా ప్రేరేపిస్తున్నాయని ఆరోపించింది. అయితే మెటా సంస్థ దీనికి తాము తగిన ఫీచర్లు ఇచ్చామని టీనేజీ యూజర్ల విపరీత వాడకాన్ని పేరెంట్స్ కంట్రోల్ చేసే ఆప్షన్స్ కొన్ని ఉన్నాయని బదులిచ్చింది.

రెండు చోట్ల ఓటు ఉంటే జైలే
TG· 11 Jul 2026

రెండు చోట్ల ఓటు ఉంటే జైలే

TG: ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక్కచోటే ఓటు ఉండాలని, అలాకాకుండా రెండు, అంతకన్నా ఎక్కువ చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష, జరిమానా పడుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సీ.సుదర్శన్‌ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే గుర్తిస్తామని, ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ‘డెమోగ్రాఫికల్లీ సిమిలర్‌ ఎంట్రీస్‌’ (DCE) అనే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చిందని చెప్పారు.

ఎన్నికలపై రేవంత్ రెడ్డి బిగ్ అప్డేట్
Politics· 11 Jul 2026

ఎన్నికలపై రేవంత్ రెడ్డి బిగ్ అప్డేట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగవని, 2029 మే, జూన్‌ నెలల్లో జరుగుతాయని CM రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాబోతోందన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. పునర్విభజన తర్వాత లోక్‌సభ సీట్లు 17నుంచి 26కు, అసెంబ్లీ సీట్లు 119నుంచి 182కు పెరుగుతాయని చెప్పారు. కాంగ్రెస్‌ 117 సీట్లలో గెలిచి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అన్నారు. దీన్ని సాధించడం కోసం రోజుకు 18గంటలు పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అలాంటి పోస్టులు పెడితే సహించం
AP· 11 Jul 2026

అలాంటి పోస్టులు పెడితే సహించం

AP: సోషల్ మీడియాలో కొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని, అలాంటి విపరీత పోకడలను నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్యాబినెట్‌ సమావేశంలో CM మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తే సహించొద్దన్నారు. ఇతర రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాలు దీనిపై అమలుచేస్తున్న చట్టాలు, విధానాలు, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని ఆయన సూచించారు. స్వేచ్ఛాయుత భావ వ్యక్తీకరణను ప్రభుత్వం గౌరవిస్తుందని, కానీ స్వేచ్ఛ పేరుతో అసత్యప్రచారం చేస్తే సహించమన్నారు.

ఒక బిడ్డతోనే  సరా?- ఎందుకలా?
Health· 10 Jul 2026

ఒక బిడ్డతోనే సరా?- ఎందుకలా?

భారత్‌లో సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ కేసులు పెరుగుతున్నాయి. అంటే ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నా, రెండోసారి గర్భం దాల్చడం కష్టమవడం. 1990లలో 19.5% ఉన్న ఈ సమస్య 2015-16 నాటికి 28.6%కి చేరింది. ఆలస్యంగా ఫ్యామిలీ ప్లానింగ్, వయసు పెరగడం, అండాల నాణ్యత తగ్గడం, PCOS, థైరాయిడ్, బరువు పెరగడం, పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ తగ్గడం ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

స్పెయిన్ లో భారీ కార్చిచ్చు: 11 మంది మృతి, 19 మంది గల్లంతు
World· 10 Jul 2026

స్పెయిన్ లో భారీ కార్చిచ్చు: 11 మంది మృతి, 19 మంది గల్లంతు

దక్షిణ స్పెయిన్ లోని అండలూసియా రీజియన్ ను భారీ కార్చిచ్చు కాల్చి బూడిద చేస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది చనిపోగా, మరో 19 మంది గల్లంతయ్యారు. మంటలు ఉధృతంగా వ్యాపించడంతో సుమారు 600 మంది నివాసితులు నిరాశ్రయుల య్యారు. దాదాపు 3,150 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ కాలిపోయింది. అల్మేరియా ప్రావిన్స్ లోని లాస్ గల్లార్డోస్, బెడార్, అంటాస్ మునిసిపాలిటీలు దెబ్బతిన్నాయి. వెదర్ అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

రాయన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో షాకింగ్ ఘటన !
World· 10 Jul 2026

రాయన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో షాకింగ్ ఘటన !

గ్రీస్ నుండి జర్మనీ వెళ్తున్న రాయన్‌ఎయిర్ విమానంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. విమానంలో ఒక్కసారిగా కిటికీ ఊడిపోవడంతో, ఒక ప్రయాణికుడు దాదాపు బయటకు కొట్టుకుపోయేంత ప్రమాదం జరిగింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్ పార్ట్ ఒకటి వచ్చి కిటికీకి తగలడంతో అది ఊడిపోయింది. దాంతో క్యాబిన్‌లో ప్రెజర్ తగ్గి, సెర్బియా ప్యాసింజర్ తల, భుజాలు కిటికీ నుంచి బయటకు లాగబడ్డాయి. సీట్‌బెల్ట్ పెట్టుకుని ఉండటం, పక్కనే ఉన్న తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి అతడిని లోపలికి లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానాన్ని అత్యవసరంగా గ్రీస్‌కు మళ్లించారు.

ఇరాన్ తో చర్చలపై ట్రంప్ మిక్స్ డ్ రియాక్షన్ !
World· 10 Jul 2026

ఇరాన్ తో చర్చలపై ట్రంప్ మిక్స్ డ్ రియాక్షన్ !

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో మరోసారి తన మార్క్ 'మిక్స్‌డ్ సిగ్నల్స్' ఇచ్చారు. ఇరాన్ అభ్యర్థన మేరకు చర్చలు కొనసాగించడానికి తాము అంగీకరించామని చెప్తూనే.. ప్రస్తుతానికి 'సీజ్‌ఫైర్' (కాల్పుల విరమణ) మాత్రం ముగిసిపోయిందని స్పష్టం చేశారు. ఒకవైపు రాయబారానికి సై అంటూనే, మరోవైపు యుద్ధ వాతావరణాన్ని హీటెక్కించేలా ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

సుప్రీం కోర్టులో షాకింగ్ ఘటనః  సీజే పై మాటల దాడి !
India· 10 Jul 2026

సుప్రీం కోర్టులో షాకింగ్ ఘటనః సీజే పై మాటల దాడి !

సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక కేసు విచారణ కలకలం రేపింది.. ప్రబల్ ప్రతాప్ అనే పిటిషనర్ బెంచ్ ముందు తనను తాను 'సార్వభౌముడు'గా ప్రకటించుకుం టూ,జడ్జిలను 'జుడీషియల్ సర్వెంట్స్' అని అడ్రస్ చేశాడు. లక్నో ఏఎస్పీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆర్డర్ వేశాడు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను దుర్భాషలాడుతూ కోర్టులో పేపర్లు గాల్లోకి విసిరేశాడు. సెక్యూరిటీ అతడిని బయటకు లాక్కెళ్లారు. అయితే, ఆ వ్యక్తి తీవ్ర మానసిక ఆందోళన, నిరాశలో ఉన్నాడని గ్రహించిన బెంచ్.. అతడిపై ఎలాంటి కోర్టు ధిక్కార (Contempt) చర్యలు తీసుకోరాదని డిసైడ్ అయింది.

BJP పార్టీ లైన్ పై ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్!▶
Politics· 10 Jul 2026

BJP పార్టీ లైన్ పై ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్!

TG: "BJP వాళ్లు దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్ అంటారు. కానీ నాకు మాత్రం నా తెలంగాణే ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్" అంటూ BJP MP ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇలా రివర్స్‌లో సొంత పార్టీ లైన్‌కు భిన్నంగా ఈటల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

నా లైఫ్‌లోనే మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్: CM విజయ్▶
Politics· 10 Jul 2026

నా లైఫ్‌లోనే మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్: CM విజయ్

కరూర్ తొక్కిసలాటలో 41 మంది చనిపోవడం నా లైఫ్‌లోనే మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అంటూ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఎమోషనల్ అయ్యారు. క్రౌడ్ కంట్రోల్ తప్పిందని పోలీసులు ముందే చెప్తే ఈవెంట్ క్యాన్సిల్ చేసుకునేవాళ్లమని, ఈ విషయంలో DMK గవర్నమెంట్‌పై, పోలీసులపై ఆయన ఫైర్ అయ్యారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన 32 మంది ఫ్యామిలీ మెంబర్స్‌కు విజయ్ గవర్నమెంట్ జాబ్ లెటర్స్ అందజేశారు.

భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే? నో గవర్నమెంట్ జాబ్!
Politics· 10 Jul 2026

భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే? నో గవర్నమెంట్ జాబ్!

ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే వాళ్లకు అస్సాం గవర్నమెంట్ గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై అలా పెళ్లిళ్లు చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చే ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బెనిఫిట్స్ రావని బడ్జెట్‌లో అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నా సరే తీసేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ భార్య బతికుండగా విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే ఏకంగా 7 ఏళ్లు జైలు శిక్ష పడేలా కొత్త రూల్స్ తెచ్చారు.

అఖిల్ ‘లెనిన్’ బ్లాక్‌బస్టర్.. నాగచైతన్య రియాక్షన్!
Cinema· 10 Jul 2026

అఖిల్ ‘లెనిన్’ బ్లాక్‌బస్టర్.. నాగచైతన్య రియాక్షన్!

అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌తో నడుస్తుంది. ఈ మూవీపై వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ అండ్ Word of mouth చూసి అన్నయ్య నాగచైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "నీ హార్డ్ వర్క్‌కి తగిన రిజల్ట్ వచ్చింది నాన్న.. ముఖ్యంగా నీ Standout performance చూసి చాలా హ్యాపీగా ఉంది" అంటూ అఖిల్‌ను మెచ్చుకున్నారు. అలాగే ఎంటైర్ టీమ్‌కి నాగచైతన్య కంగ్రాట్స్ చెప్పారు.

కన్నీళ్లు పెట్టుకున్న CM విజయ్!▶
News· 10 Jul 2026

కన్నీళ్లు పెట్టుకున్న CM విజయ్!

కరూర్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గవర్నమెంట్ జాబ్ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందజేశారు. అయితే, బాధితులకు స్వయంగా ఈ ఉద్యోగ పత్రాలు అందిస్తున్న సమయంలోనే CM విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ లీడర్ అంతలా ఎమోషనల్ అవ్వడం చూసి విజయ్ అభిమానులు కూడా కంటతడి పెడుతున్నారు.

నాగార్జునను హగ్ చేసుకుని ఏడ్చేసిన అఖిల్!▶
Cinema· 10 Jul 2026

నాగార్జునను హగ్ చేసుకుని ఏడ్చేసిన అఖిల్!

అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించింది. ఎన్నాళ్లో ఎదురుచూస్తున్న ఈ భారీ విజయం దక్కడంతో అఖిల్ ఎమోషనల్ అయ్యారు. ఆనందభాష్పాలతో తన తండ్రి, కింగ్ నాగార్జునను గట్టిగా కౌగిలించుకున్నారు. కొడుకు సాధించిన ఈ సక్సెస్ చూసి నాగార్జున కూడా ఎంతో గర్వపడ్డారు. తండ్రీకొడుకుల మధ్య జరిగిన ఈ ఎమోషనల్ మూమెంట్‌కు సంబంధించిన పిక్స్, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

గ్రామాల్లోకి 900 పాములు
World· 10 Jul 2026

గ్రామాల్లోకి 900 పాములు

మనకు కోళ్ల ఫారాలు ఉన్నట్లు చైనాలో స్నేక్ ఫామ్స్ ఉంటాయ్. చైనా గ్వాంగ్జీ ఏరియాలో భారీ వరదల వల్ల స్నేక్ ఫామ్స్ నుంచి 900 విష సర్పాలు తప్పించుకున్నాయి. దగ్గర్లోని పొలాలు, గ్రామాల్లోకి వెళ్లిపోయాయి. పాము కాటుతో ఒక మహిళ చనిపోయారు. ఈ పాముల్ని పట్టుకోవడానికి అధికారులు స్పెషల్ టీమ్స్ వేశాయి. ఎవరు పాముకాటుకు గురైనా తక్షణ వైద్యం అందించేందుకు ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

వైభవ్ పైన ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
Sports· 10 Jul 2026

వైభవ్ పైన ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

వరుస ఫెయిల్యూర్స్ తో ఒత్తిడిలో ఉన్న వైభవ్ సూర్యవంశీకి ధోనీ తాజా కామెంట్స్ గొప్ప భరోసా ఇస్తాయ్. స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైభవ్, నేను ఒకసారి అనుకోకుండా ఒకరినొకరు దాటుకుంటూ వెళ్లాం. మాట్లాడుకునే అవకాశం కూడా రాలేదు. వైభవ్ సూర్యవంశీకి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ప్రపంచమంతా అతని ఆటను గమనిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించగల అద్భుతమైన నైపుణ్యం ఆ కుర్రాడిలో ఉంది అని ధోనీ పొగిడారు.

తల్లిదండ్రుల బాగోగులు చూడకపోతే ఆస్తులు కట్!
Legal· 10 Jul 2026

తల్లిదండ్రుల బాగోగులు చూడకపోతే ఆస్తులు కట్!

ముసలితనంలో తమను బాగా చూసుకుంటారనే నమ్మకంతో ఆస్తిని పిల్లల పేరిట రాసే పేరెంట్స్‌కు బాంబే హైకోర్టు బిగ్ సపోర్ట్ ఇచ్చింది. ఒకవేళ ఆస్తి తీసుకున్నాక పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోకపోతే, ఆ ఆస్తిని మళ్లీ వెనక్కి తీసుకునే రైట్ పేరెంట్స్‌కు ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది. తల్లిదండ్రులు రిచ్ అయినప్పటికీ ఈ రూల్ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం ఈ బదిలీని రద్దు చేసే పవర్ ట్రిబ్యునల్‌కు ఉంటుందని స్పష్టం చేసింది.

రాముడి సాక్షిగా.. CM రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!▶
Politics· 10 Jul 2026

రాముడి సాక్షిగా.. CM రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై CM రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 2029 మే నెలలో జరగబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లు గెలుస్తుందని భద్రాద్రి రాముడిపై ప్రమాణం చేసి చెప్పారు. డెలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత తెలంగాణలో పార్లమెంట్ సీట్లు 17 నుండి 26 కి, అలాగే అసెంబ్లీ సీట్లు 119 నుండి 182 కి పెరుగుతాయని, అందులో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ దక్కించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

CM విజయ్ పైకి దూసుకొచ్చాడు▶
Viral· 10 Jul 2026

CM విజయ్ పైకి దూసుకొచ్చాడు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కరూర్ పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. ఆయన కాన్వాయ్ పైకి ఓ వ్యక్తి అకస్మాత్తుగా దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం కాసేపు ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. ప్రజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.