← Back to news

అలాంటి పోస్టులు పెడితే సహించం

By DK· 11 Jul 2026· అమరావతి
అలాంటి పోస్టులు పెడితే సహించం

AP: సోషల్ మీడియాలో కొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని, అలాంటి విపరీత పోకడలను నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్యాబినెట్‌ సమావేశంలో CM మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తే సహించొద్దన్నారు. ఇతర రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాలు దీనిపై అమలుచేస్తున్న చట్టాలు, విధానాలు, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని ఆయన సూచించారు. స్వేచ్ఛాయుత భావ వ్యక్తీకరణను ప్రభుత్వం గౌరవిస్తుందని, కానీ స్వేచ్ఛ పేరుతో అసత్యప్రచారం చేస్తే సహించమన్నారు.

More in AP