← Back to news

ఎన్నికలపై రేవంత్ రెడ్డి బిగ్ అప్డేట్

By DK· 11 Jul 2026· ఖమ్మం జిల్లా
ఎన్నికలపై రేవంత్ రెడ్డి బిగ్ అప్డేట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగవని, 2029 మే, జూన్‌ నెలల్లో జరుగుతాయని CM రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాబోతోందన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. పునర్విభజన తర్వాత లోక్‌సభ సీట్లు 17నుంచి 26కు, అసెంబ్లీ సీట్లు 119నుంచి 182కు పెరుగుతాయని చెప్పారు. కాంగ్రెస్‌ 117 సీట్లలో గెలిచి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అన్నారు. దీన్ని సాధించడం కోసం రోజుకు 18గంటలు పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

More in Politics