రాయన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో షాకింగ్ ఘటన !

గ్రీస్ నుండి జర్మనీ వెళ్తున్న రాయన్‌ఎయిర్ విమానంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. విమానంలో ఒక్కసారిగా కిటికీ ఊడిపోవడంతో, ఒక ప్రయాణికుడు దాదాపు బయటకు కొట్టుకుపోయేంత ప్రమాదం జరిగింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్ పార్ట్ ఒకటి వచ్చి కిటికీకి తగలడంతో అది ఊడిపోయింది. దాంతో క్యాబిన్‌లో ప్రెజర్ తగ్గి, సెర్బియా ప్యాసింజర్ తల, భుజాలు కిటికీ నుంచి బయటకు లాగబడ్డాయి. సీట్‌బెల్ట్ పెట్టుకుని ఉండటం, పక్కనే ఉన్న తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి అతడిని లోపలికి లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానాన్ని అత్యవసరంగా గ్రీస్‌కు మళ్లించారు.

