Latest
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న CM విజయ్!
తమిళనాడు CM విజయ్ 'సింగప్పెణ్ స్పెషల్ కమాండో ఫోర్స్' గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ ఉమెన్ కమాండో ఫోర్స్ అనేది ఓన్లీ ఎలక్షన్స్ కోసం అనౌన్స్ చేసిన స్కీమ్ కాదని. ఇది తన గుండెల్లోంచి వచ్చిన ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. ఎలక్షన్ టైమ్‌లో తాము ఇచ్చిన ప్రతి ప్రామిస్‌ని కచ్చితంగా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తామని CM విజయ్ ప్రామిస్ చేశారు. మహిళల రక్షణ కోసం ఆయన చూపించిన ఈ డెడికేషన్‌పై నెటిజన్లు ఫుల్ పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.

ఏడు లక్షల మంది అపరిచితులు కాపాడిన ఒక ప్రాణం!
సౌదీలో 20 ఏళ్లుగా ఉరి భయం ఎదుర్కొంటున్న కేరళ వాసి అబ్దుల్ రహీమ్‌కు లైఫ్ లైన్ దొరికింది. 7 లక్షల మంది కేరళీయులు పిగ్గీ బ్యాంకుల నుంచి బంగారు గొలుసుల వరకు విరాళాలుగా సేకరించి ₹47 కోట్ల బ్లడ్ మనీని పోగేశారు. యజమాని కుటుంబం క్షమించడంతో ఆగస్టు 7న రహీమ్ స్వదేశం చేరాడు. మానవత్వం గెలిచింది! ఇంతకీ రహీమ్ చేసిన నేరం ఏంటంటే దివ్యాంగుడైన యజమాని కొడుకు కి కేర్ టేకర్ గా ఉండగా ఆ పిల్లాడు అల్లరి చేస్తూ కారు స్టీరింగ్ తాకడంతో యాక్సిడెంట్ అయి ఆ బాలుడు చనిపోయాడు. సౌదీ కోర్టులు దీన్ని యాక్సిడెంట్‌గా గుర్తించినా, హత్య కింద 2012లో మరణశిక్ష విధించాయి.

CM విజయ్ను కలిసిన హీరోయిన్ స్నేహ..
కోలీవుడ్ స్టార్ కపుల్ యాక్ట్రెస్ స్నేహ, యాక్టర్ ప్రసన్న తమ ఫ్యామిలీతో కలిసి తమిళనాడు CM విజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. CM ఆఫీస్‌లో జరిగిన ఈ మీటింగ్‌లో వాళ్లు విజయ్‌కి బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. చాలా రోజుల తర్వాత వీళ్లంతా ఇలా కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇటు ఫ్యాన్స్, అటు నెటిజన్లు ఈ పిక్స్ చూసి లైకులు కొడుతున్నారు.

ఎండిపోయిన చెరువులో 5K RUN
TG: చెరువుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపుపై అవేర్నేస్ కల్పించేందుకు ధాత్రి NGO సంస్థ వినూత్న కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో ఎండిపోయిన పెద్దచెరువు అడుగున 5K Run Below The Lake పేరుతో రన్ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. చెరువు మధ్యలో నీటి బిందువు ఆకారంలో నిల్చొని "చెరువులను కాపాడుకుందాం-భూగర్భ జలాలను పెంచుకుందాం" అనే సందేశంతో అవగాహన కల్పించారు. ధాత్రి NGO వ్యవస్థాపకులు వెంకట్ మాట్లాడుతూ.. చెరువులు ఎండిపోతే బోర్లు ఎండిపోతాయని, బోర్లు ఎండిపోతే భవిష్యత్ తరాలకే కాదు ప్రస్తుత తరానికే ముప్పు తప్పదన్నారు.
తమిళనాడులో CM విజయ్ సరికొత్త ప్లాన్..
తమిళనాడులో CM విజయ్ ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఉమెన్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన 'సింగప్పణ్ స్పెషల్ కమాండో ఫోర్స్' విజన్‌ను ఆయన ఒక ఈవెంట్లో అఫీషియల్‌గా లాంచ్ చేశారు. ఉమెన్ సేఫ్టీ కోసం ఈ కమాండో ఫోర్స్ చాలా యాక్టివ్‌గా అండ్ సీరియస్‌గా వర్క్ చేయబోతోంది. CM విజయ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థి సూసైడ్
TG: పాలమూరు యూనివర్సిటీలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం వెల్జర్ల విలేజ్‌కు చెందిన కార్తీక్ (23) పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలు సోమవారం ప్రారంభం కాగా.. రాత్రి 9.30 గంటలకు హాస్టల్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన ఫ్రెండ్స్ కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.
వేల పోస్టులకు లక్షల్లో క్యాండిడేట్స్,.. యూపీలో మతిపోయే సీన్
రైలు కిటికీల్లోంచి లోపలకి దూరిపోతున్న వీళ్లంతా ఎవరా అని సర్ ప్రైజ్ అవుతున్నారా? వారంతా యూపీలో కానిస్టేబుల్ పోస్టులకు అప్లయ్ చేసుకున్ననిరుద్యోగులు. రాత పరీక్ష ఉందని అనౌన్స్ మెంట్ రావడంతో అందరూ దానికోసం ప్రయాణమవుతున్నారు. మీరు చూస్తున్నది లక్నో లోని చార్ బాగ్ రైల్వే స్టేషన్. మొత్తం 32,679 పోస్టుల కోసం ఏకంగా 28 లక్షల 90వేల మంది పోటీ పడుతున్నారు. దాంతో స్టేషన్ లో రద్దీ పెరిగి , స్థలం లేకపోవడంతో ఎమర్జెన్సీ విండోస్ నుంచి కూడా లోపలికి దూరిపోతున్నారు. యూత్ లో ఉద్యోగాల కోసం ఇంత క్రేజ్ ఉందా?
The Clear Cut News Headlines- ముఖ్యాంశాలు
* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. కంట్రోల్‌రూమ్ ఏర్పాటు * మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం * గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ * వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై లోకేష్ ఫైర్! * వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్! * స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి.. TRS నాయకుల అరెస్ట్

న్యూ ఏజ్ కోర్సులపై యువత క్రేజ్ !
కొత్త కోర్సుల వైపు విద్యార్థుల మొగ్గు ప్రస్తుత 'మిషన్ అడ్మిషన్' సీజన్లో విద్యార్థులు తమ కెరీర్ ప్లాన్స్‌ను మార్చుకుంటున్నారు. టైమ్స్ సిటీ (Times City) కథనం ప్రకారం.. సాంప్రదాయ కోర్సుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కొత్త తరం న్యూ-ఏజ్ కోర్సుల వైపే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, గ్లోబల్ డిమాండ్ ఎక్కువగా ఉండే వోకేషనల్, అలైడ్ సైన్సెస్, మేనేజ్మెంట్ కోర్సులను ఎంచుకుంటూ విద్యార్థులు తమ కెరీర్ రూట్‌ను మార్చుకుంటున్నారు.
పాకిస్థాన్ నుంచి విముక్తికి పోరాటం..30 మంది బలి
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. "మాకు పాకిస్థాన్ నుంచి విముక్తి కావాలి" అంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. నిరసనకారులను అణచివేసేందుకు పాక్ భద్రతా దళాలు జరిపిన కాల్పులు, ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

కుక్క కోసం ఏడుస్తూ వీడియో పెట్టిన నటి మంజరి!
'జానే తూ యా యానే నా' సినిమా యాక్ట్రెస్ మంజరి ఫడ్నిస్ సోషల్ మీడియాలో ఏడుస్తూ పెట్టిన ఒక వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. తమ అపార్ట్మెంట్ సొసైటీలో 2019 నుండి ఉంటున్న 'మైకీ' అనే డాగ్‌ను కొందరు దారుణంగా కొట్టి చంపేశారని ఆమె ఏడుస్తోంది. ఆ డాగ్‌ను మెట్ల దగ్గరికి లాక్కెళ్లి, నోటి నుండి బ్లడ్ వచ్చేలా దారుణంగా కొట్టారని. కొన్ని రోజులుగా మైకీ కనిపించకపోవడంతో అందరూ వెతికారు, కానీ లాస్ట్‌కి అది మర్డర్ అయిందని తెలిసి షాక్ అయ్యారు. జంతువులను ఇలా టార్చర్ పెట్టే వాళ్లకు భయం ఉండేలా serious acts తీసుకురావాలని, మైకీకి జస్టిస్ జరగాలని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది.

10 ఏళ్లుగా పెండింగ్ లో తెలంగాణ లిఫ్ట్స్ యాక్ట్ బిల్లు
తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ప్రతిపాదిత 'లిఫ్ట్స్ యాక్ట్' బిల్లు ఇంకా చట్టరూపం దాల్చలేదు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, మరణాలు ఈ చట్టం యొక్క అత్యవసర ప్రాధాన్యతను గుర్తు చేస్తు న్నాయి. ప్రస్తుతం ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో భద్రతా ప్రమాణాలు లోపించాయి. అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగులలోని లిఫ్టులకు తప్పనిసరి తనిఖీలు, కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది.

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
TG: హైదరాబాద్ నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మెహిదీపట్నం, మాదాపూర్, గచ్చిబౌలి, గోల్కొండ, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇన్నాళ్లూ ఎండ వేడితో అల్లాడిన నగరవాసులు ఈ వర్షంతో సేదతీరుతున్నారు.

చరణ్ ఇరగ దీశావ్ అంటున్న అల్లు అర్జున్ !
రాం చరణ్ నటించిన పెద్ది సినిమాపై హీరో అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.చరణ్ ఇరగదీశావ్ అంటూ అర్జున్ ట్వీట్ చేశాడు. ఓవరాల్ గా పెద్ది మూవీపై మిక్స్ డ్ టాక్ నడుస్తున్నా.. రామ్ చరణ్ యాక్షన్ కు మాత్రం క్రేజ్ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో 315 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించామని మూవీ యూనిట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
సూదిని కనిపెట్టింది మనుషులు కాదా? మరి ఎవరు?
మనుషులు 'సూది'ని కనిపెట్టక ముందే. ప్రకృతిలో ఒక గ్రేట్ టైలర్ ఉందన్న విషయం మీకు తెలుసా? అదే 'కామన్ టేలర్బర్డ్'. ఈ పిట్ట తన ముక్కునే సూదిలా వాడుతూ, చెట్ల ఆకులను దారాలతో కుట్టి రౌండ్‌గా గూడు తయారు చేసుకుంటుంది. ఇది చేసే టైలరింగ్ వర్క్ చూస్తే. అసలు ఫస్ట్ టైమ్ మనిషి సూదిని కనిపెట్టింది, కచ్చితంగా ఈ పిట్టను చూసే కాపీ కొట్టాడేమో అనిపించక మానదు. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
ఒక్క వీణతో 64 సాంగ్స్ వాయించి వరల్డ్ రికార్డ్!
చూడటానికి రెండు కళ్లు లేకపోయినా.. తన టాలెంట్‌తో హిస్టరీ క్రియేట్ చేసింది విజయలక్ష్మి. వాళ్ల నాన్నగారు తయారు చేసిన, కేవలం ఒకే ఒక్క తీగ (One String) ఉండే 'గాయత్రి వీణ'ను వాయించి ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. రీసెంట్గా ఎలాంటి బ్రేక్ లేకుండా కంటిన్యూస్‌గా 24 గంటల పాటు ఈ గాయత్రి వీణను ప్లే చేసి అందరినీ షాక్ చేసింది. అంతేకాదు, ఒకే టైమ్‌లో ఏకంగా 64 సాంగ్స్ వాయించి రేర్ రికార్డ్ సెట్ చేసింది. చూపు లేకపోయినా ఆమె చూపించిన ఈ పట్టుదల ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఇన్స్పైర్ చేస్తోంది.
రేపు విశాఖకు జగన్
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు పవన్ కళ్యాణ్..
డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాక్సిడెంట్ జరిగిన స్పాట్‌కి స్వయంగా వెళ్లారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో అక్కడ ఉన్న అధికారులు, వర్కర్స్‌ని అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నారు. అయితే మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇంకా హ్యూమన్ ఎర్రర్స్ వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందంటూ కార్మికులు పవన్ ముందు ఆవేదన చెందారు.
నాంపల్లిలో చేప ప్రసాదం క్రేజ్!
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. నిన్న నైట్ నుంచి ఇప్పటివరకు దాదాపు 50 వేల మందికి పైగా జనాలు ఈ చేప ప్రసాదాన్ని తీసుకున్నారు. వచ్చిన వాళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా విఐపీలు (VIPs), దివ్యాంగులు, ఇంకా ముసలివాళ్ల కోసం అధికారులు స్పెషల్ కౌంటర్స్ పెట్టారు. ఈ చేప ప్రసాదం పంపిణీ ఈరోజు రాత్రి 9PM వరకు ఉంటుంది.
వేస్ట్ వాటర్ బాటిల్స్ శాలువాతో రేవంత్ రెడ్డికి సన్మానం!
తెలంగాణ CM రేవంత్ రెడ్డికి ఒక డిఫరెంట్ అండ్ స్పెషల్ సన్మానం జరిగింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో జనాలు తాగి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను రీసైకిల్ చేసి తయారు చేసిన ఒక స్పెషల్ శాలువాతో CM రేవంత్ రెడ్డిని సన్మానించారు. పర్యావరణాన్ని కాపాడాలనే ఒక మంచి మెసేజ్‌తో చేసిన ఈ సన్మానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.
వామ్మో..కుక్క కరిస్తే ఇలా అవుతారా?
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ మెడికల్ సెంటర్లో ఓ వ్యక్తి రేబిస్‌తో బాధపడుతున్న వీడియో వైరల్ అవుతోంది. కొన్ని వారాల క్రితం అతణ్ని కుక్క కరిచింది. అతను పట్టించుకోకపోవడంతో రేబిస్ సోకింది. జ్వరంతోపాటు హైడ్రోఫోబియాతో నీటిని చూస్తేనే భయపడిపోతున్నాడు. కుక్క కరిచిన 24 గంటల్లోపే ట్రీట్మెంట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.