← Back to news

వేస్ట్ వాటర్ బాటిల్స్ శాలువాతో రేవంత్ రెడ్డికి సన్మానం!

By sahani· 9 Jun 2026· X· Telangana

తెలంగాణ CM రేవంత్ రెడ్డికి ఒక డిఫరెంట్ అండ్ స్పెషల్ సన్మానం జరిగింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో జనాలు తాగి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను రీసైకిల్ చేసి తయారు చేసిన ఒక స్పెషల్ శాలువాతో CM రేవంత్ రెడ్డిని సన్మానించారు. పర్యావరణాన్ని కాపాడాలనే ఒక మంచి మెసేజ్‌తో చేసిన ఈ సన్మానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

More in Technology