హైదరాబాద్ నగరంలో భారీ వర్షం

TG: హైదరాబాద్ నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మెహిదీపట్నం, మాదాపూర్, గచ్చిబౌలి, గోల్కొండ, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇన్నాళ్లూ ఎండ వేడితో అల్లాడిన నగరవాసులు ఈ వర్షంతో సేదతీరుతున్నారు.


