పాకిస్థాన్ నుంచి విముక్తికి పోరాటం..30 మంది బలి
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. "మాకు పాకిస్థాన్ నుంచి విముక్తి కావాలి" అంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. నిరసనకారులను అణచివేసేందుకు పాక్ భద్రతా దళాలు జరిపిన కాల్పులు, ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.



