పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థి సూసైడ్

TG: పాలమూరు యూనివర్సిటీలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం వెల్జర్ల విలేజ్‌కు చెందిన కార్తీక్ (23) పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలు సోమవారం ప్రారంభం కాగా.. రాత్రి 9.30 గంటలకు హాస్టల్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన ఫ్రెండ్స్ కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.



