Latest
బాసర గోదావరిలో ముగ్గురు అన్నదమ్ముల గల్లంతు
TG: నిర్మల్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర గోదావరిలో ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. హైదరాబాద్ నగరం కాచిగూడకు చెందిన చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ కుమార్ నదిలో స్నానం చేస్తూ, ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. పోలీసులు వారిని గాలిస్తున్నారు.

రెండు లారీలు ఢీ.. ఒకరు సజీవదహనం
AP: అనంతపురం జిల్లాలో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో ఒకరు సజీవ దహనమయ్యారు. డి.హీరేహల్ మండలం జాజరకల్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు లారీల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు.

నెగటివ్ రివ్యూకి లైక్ కొట్టి ..ఆపై తీసేసిన జాన్వీ !
రామ్ చరణ్ ‘పెద్ది’లో జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ పాత్రపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. “హీరోయిన్‌కు అవమానం” అంటూ వచ్చిన నెగెటివ్ రివ్యూ పోస్ట్‌ను జాన్వీ ఇన్‌స్టాలో లైక్ కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది. దర్శకుడు బుచ్చిబాబు సీన్లను గ్లామర్‌కే పరిమితం చేశారన్న ఆరోపణలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్టు టాక్. తర్వాత జాన్వీ ఆ లైక్‌ను తొలగించింది.

తీవ్ర విషాదం: తాటిచెట్టుపై హార్ట్ ఎటాక్
TG: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన చామకూరి వెంకన్న కల్లు గీసేందుకు రోజూలాగే మంగళవారం తాటిచెట్టు ఎక్కాడు. తాటికల్లు గీస్తుండగా ఒక్కసారిగా వెంకన్నకు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే చెట్టుపైనే మృతి చెందాడు. తాటివనంలో పనికి వెళ్లిన స్థానిక రైతులు వెంకన్న తాటిచెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే జేసీబీ, క్రేన్ సాయంతో తాడు బిగించి డెడ్‌బాడీని చెట్టుపై నుంచి కిందికి దించారు.

గచ్చిబౌలి చోరీ కేసులో నిందితులు అరెస్ట్
TG: గచ్చిబౌలి పరిధిలో ఉన్న హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటోన్న ఓ వ్యాపారి ఇంట్లో బంగారు నగలు, వజ్రాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. యూపీ పోలీసుల సహకారంతో తీవ్రంగా గాలించి నిందితులను పట్టుకున్నారు. కిలో బంగారు నగలు, వజ్రాలను ఎత్తుకెళ్లిన నేపాలీ దంపతులను అరెస్ట్ చేశారు. వీరిని వ్యాపారి నెలరోజుల క్రితమే పనిలో పెట్టుకోగా.. ఇటీవలే వ్యాపారి కుటుంబం ఓ పనినిమిత్తం ముంబాయికి వెళ్లింది. వారు తిరిగివచ్చే సరికి ఇంట్లోని నగలు, వజ్రాలు కనిపించకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు.

పెద్దిలో జాన్వీ రోల్ పిక్చరైజేషన్ పై జయా బచ్చన్ ఫైర్ !
పెద్దిలో జాన్వీ రోల్ చిత్రీకరణపై బాలీవుడ్ నుంచి కూడా విమర్శలు పెరుగుతున్నాయి. మహిళలను సెక్స్ సింబల్స్ గా, ఒక ఆబ్జెక్ట్ గా చూపించడం పట్ల అటు ప్రేక్షకుల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు రేగుతున్నాయి. బాలీవుడ్ నటి జయాబచ్చన్ స్పందిస్తూ, సినిమాల్లో మహిళలను కేవలం ఒక ‘వస్తువు’గా చూపడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తన విషయంలో ఎవరూ ఆ గీత దాటలేకపోయారని చెప్తూ, చిత్ర పరిశ్రమలో మహిళల చిత్రణపై ఆమె ఘాటుగా స్పందించారు.

బరువు తగ్గాలనుకునే వారికి గ్లోబల్ మార్కెట్ లో హెల్తీ డైట్!
బరువు తగ్గించే ‘ఓజెంపిక్’ (Ozempic) వంటి GLP-1 ఇంజెక్షన్ల వాడకం పెరగడంతో, ఫుడ్ ఇండస్ట్రీ రూట్ మారుస్తోంది. ఈ మందులు వాడేవారికి ఆకలి తక్కువగా ఉంటుంది కాబట్టి, కంపెనీలు తక్కువ క్వాంటిటీతో పాటు ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ప్రత్యేక ఆహార పదార్థాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. 'GLP-1 ఫ్రెండ్లీ' లేబుళ్లతో వస్తున్న ఈ హెల్తీ డైట్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో సూపర్ క్రేజ్ సంపాదిస్తోంది!

బిర్యానీ కోసం గొడవ పడి దంపతుల ఆత్మహత్య!
బిర్యానీ విషయంలో ఫోన్లో జరిగిన వాగ్వాదం చివరకు దంపతుల ప్రాణాలు బలితీసుకుంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం(33), ప్రియాంక(27) విశాఖ శ్రీనగర్‌లో నివసిస్తున్నారు. ఆదివారం మద్యం తాగడానికి బయటకు వెళ్లిన భర్త బలరాం, భార్యకు ఫోన్ చేసి బిర్యానీ తెచ్చి ఉంచాలని కోరాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రియాంక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన బలరాం ఆమె డెడ్ బాడీని చూసి భయంతో తన నాలుగేళ్ల కుమారుడి కళ్లెదుటే అదే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ*త్య చేసుకున్నాడు.

కొత్త ఫోన్ కొనివ్వలేదని బావిలోకి దూకిన యువతి!
మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామంలో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. బిందు (22) అనే యువతి తన దగ్గరున్న మొబైల్ సరిగ్గా పని చేయడం లేదని, కొత్త ఫోన్ కొనివ్వాలని తండ్రిని అడిగింది. అయితే, ప్రస్తుతానికి డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ బాధతో మనోవేదనకు గురైన బిందు, బావిలోకి దూకి సూసైడ్ చేసుకుంది. కొత్త ఫోన్ కోసం యువతి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు !
హైదరాబాద్‌లోని 'అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా' (ASCI) డైరెక్టర్ జనరల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై లైంగిక, వృత్తిపరమైన వేధింపులకు పాల్పడ్డారని ఒక మహిళా ప్రొఫెసర్ జాతీయ మహిళా కమిషన్ (NCW) కు ఫిర్యాదు చేశారు. అయితే, రమేష్ కుమార్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణ అనంతరం NCW ఈ కేసును ముగించగా, బాధితురాలు కోర్టు కు వెళ్లనున్నట్లు చెప్పింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన లోకేష్..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కార్మికులని మినిస్టర్ నారా లోకేష్ విజిట్ చేశారు. బాధితులను, వాళ్ల ఫ్యామిలీస్ ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు బెస్ట్ మెడికల్ కేర్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి యాక్సిడెంట్స్ ఫ్యూచర్లో మళ్లీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.
‘మీ కాళ్లు మొక్కుతా..,భూముల జోలికి రాకండి’
TG: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చింతలమానేపల్లి మండలం దిందాలో రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములను చదును చేసేందుకు అటవీ శాఖ అధికారులు వచ్చారు. తమ భూమి లాక్కోవద్దని, సాగు నాశనం చేయొద్దని రైతులు అధికారులను అడ్డుకున్నారు. రైతులను అదుపులోకి తీసుకుని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు.

బండి సంజయ్ ఎమోషనల్ పోస్ట్!
కేంద్ర మంత్రి బండి సంజయ్ తన మదర్ గురించి 'X' లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రీసెంట్గా వాళ్ల అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తను లోపల ఎంతగా కృంగిపోయారో షేర్ చేసుకున్నారు. పొలిటికల్ ప్రెజర్స్, ఫైట్స్ ఎన్ని ఉన్నా. అమ్మ హెల్దీగా పక్కన ఉంటే చాలని రియలైజ్ అయ్యానన్నారు. PM మోదీ పిలుపు మేరకు 'ఏక్ పేడ్ మా కే నామ్' (Ek Ped Maa Ke Naam) కింద ఇంట్లో ఒక మొక్క నాటారు. అమ్మ లవ్ అండ్ సాక్రిఫైస్కి గుర్తుగా ఈ ప్లాంట్ నాటానని ఎమోషనల్ అయ్యారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ షాకింగ్ విజువల్స్.. మంటల్లో ప్లాంట్!
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకొచ్చాయి. స్టీల్ లిక్విడ్ లీక్ అవ్వడంతో ప్లాంట్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు భయానకంగా వ్యాపించిన దృశ్యాలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఈ లీకేజ్ వల్లే అక్కడ పెద్ద ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భయంకరమైన యాక్సిడెంట్ వీడియోలు ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!
మినిస్టర్ నారా లోకేష్ ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాకు దిగారు. ప్రమాదానికి రెస్పాన్సిబిలిటీగా స్టీల్ ప్లాంట్ CMDని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, చనిపోయిన కార్మికుల ఫ్యామిలీస్‌కి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలంటూ లోకేష్‌ను నిలదీశారు. కార్మిక సంఘాల నినాదాలతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి.. TRS నాయకుల అరెస్ట్
TG: ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకులు మంగళవారం హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌ను ముట్టడించారు. ఒక్కసారిగా పెద్దఎత్తున అక్కడికి వచ్చిన TRS నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. ఆందోళన చేస్తున్న తెలంగాణ రక్షణ సేన నాయకులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు పవన్ కళ్యాణ్ బిగ్ అనౌన్స్మెంట్!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ భారీ సాయం ప్రకటించారు. చనిపోయిన వారి ఫ్యామిలీస్‌కి రూ.25 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పారు. అంతేకాదు, చనిపోయిన వారి ఫ్యామిలీలో ఒకరికి జాబ్ ఇస్తామని.. రిటైర్మెంట్ అయ్యే వరకు వాళ్లు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లోనే ఉండొచ్చని పవన్ హామీ ఇచ్చారు.
బాబోయ్.. వాటర్ ట్యాంకులో పాముల కుప్ప
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని ఓ ఇంట్లో వాటర్ ట్యాంక్‌లోకి నీళ్లు వెళ్లడం లేదు. యజమానులు అండర్‌గ్రౌండ్‌లోని ట్యాంక్ మూత తీసి చూశారు. షాక్..! ఏకంగా 27 పాములు ఒకదానిపై ఒకటి మెలికలు తిరుగుతూ కనిపించాయి. భయంతో వణికిపోయిన ఆ కుటుంబం అటవీ శాఖ సిబ్బందిని పిలిచింది. వాళ్లు వచ్చి ట్యాంకులోని పాములన్నింటినీ బయటకు తీసి అడవిలో వదిలేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో సీరియస్‌గా గాయపడిన బాధితులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ కిమ్స్ హాస్పిటల్లో విజిట్ చేశారు. బాధితులను, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌ని కలిసి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. వాళ్ల హెల్త్ కండిషన్ మరియు హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ డీటెయిల్స్‌పై డాక్టర్లతో మాట్లాడారు. మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చంతా గవర్నమెంటే చూసుకుంటుందని, అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ఈ విజిట్‌లో మినిస్టర్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా పవన్ వెంటే ఉన్నారు.

రూ.110 కోసం దారుణ హత్య
TG: హైదరాబాద్ లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జైప్రకాష్ దేశ్‌ముఖ్ హైదరాబాద్‌లో మేస్త్రీ పనులు చేస్తాడు. మోండామార్కెట్ ప్రాంతంలో జైప్రకాశ్ దేశ్‌ముఖ్‌కు తుకారాంగేట్‌కు చెందిన దాబీ వినోద్, అడ్డగుట్టకు చెందిన మక్కల మోహన్ పరిచయమయ్యారు. జైప్రకాష్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. డబ్బు, ఫోన్ దోచుకునే ప్రయత్నంలో జైప్రకాష్ ప్రతిఘటించడంతో రాళ్లతో దాడిచేసి హత్య చేశారు. అనంతరం రూ.110 నగదు, ఫోన్ దోచుకుని పరారయ్యారు.
"చేతిపై పవనిజం పేరు కాలిపోయింది.." వైజాగ్ బాధితులు ఫైర్!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల ఫ్యామిలీస్ డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యారు. "ఎలక్షన్స్ ముందు వచ్చి 'నేనున్నా' అంటూ భరోసా ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు ప్రమాదం జరిగితే ఎక్కడికి పోయారు?" అంటూ కన్నీళ్లతో నిలదీస్తున్నారు. "చేతిపై 'పవనిజం' అని రాసుకున్న పేరు కూడా కాలిపోయింది కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కింద పబ్లిక్ కూడా పవన్‌ను క్వశ్చన్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.