Latest
నాగేశ్వరరావు ముందు పవన్ కళ్యాణ్ ఒక లిల్లీపుట్!
సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఫుల్ ఫైర్ అయ్యారు. ఒకప్పుడు చేగువేరా బొమ్మ పెట్టుకున్న పవన్, ఇప్పుడు చంద్రబాబు వెనకాల తిరుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ముందు పవన్ జస్ట్ ఒక లిల్లీపుట్ లాంటివాడని, ఆయన చేసిన కామెంట్స్‌కే అరెస్ట్ చేస్తారా అని క్వశ్చన్ చేశారు. అసలు పవన్‌ను డిప్యూటీ సీఎం చేయడమే పెద్ద తప్పు అంటూ యాదగిరి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆరుగాలం కష్టం.. తడిసి ముద్ధైన ధాన్యం
TG: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కురిసిన వర్షం అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచింది. మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీలు, హమాలీలు, గన్ని బ్యాగుల కొరత వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరారు.
ఏకగ్రీవం అయితే ఊరుకోను.. YSRCP లీడర్స్‌కు జగన్ బిగ్ వార్నింగ్!
YSRCP లీడర్స్‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ serious instructions ఇచ్చారు. త్వరలో జరగబోయే లోకల్ ఎలక్షన్స్ లో ఏ సిట్యుయేషన్ లోనైనా అన్ని చోట్లా YSRCP జెండా ఖచ్చితంగా ఎగరాలని ఆయన టార్గెట్ పెట్టారు. ముఖ్యంగా ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే మాత్రం తాను చాలా సీరియస్‌గా తీసుకుంటానని లీడర్స్‌ను గట్టిగా హెచ్చరించారు. ఈ లోకల్ పోల్స్ లో ప్రతి ఒక్కరూ ఫుల్ యాక్టివ్‌గా ఉండి పని చేయాలని జగన్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.

పొలాల్లో గడ్డి కాల్చడంతో పర్యావరణానికి నష్టం
మెదక్ జిల్లా: పంట కోత అనంతరం పొలాల్లో మిగిలిన వరి, మొక్కజొన్న గడ్డిని కాల్చడం వల్ల నేల సారవంతం తగ్గడంతోపాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని మాసాయిపేట మండల వ్యవసాయ అధికారిణి కవిత తెలిపారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థం, ప్రయోజనకర సూక్ష్మజీవులు నశించి పోషకాల లోపం ఏర్పడుతుందని చెప్పారు. పంట గడ్డిని కాల్చడం వల్ల వాయు కాలుష్యం, గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారం పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.

కేసీఆర్ ఒక్కరోజైనా ఆ పనిచేశారా: జూపల్లి
TG: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంపూర్తి పనులతో పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆక్షేపేంచారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద పూర్తిస్థాయిలో మోటర్లు కూడా ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తిచేస్తానన్న కేసీఆర్ కనీసం ఒక్కరోజైనా ఆ పనిచేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన పాలమూరు జిల్లాను గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు.

నెహ్రూ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం: భట్టి
TG: భారత తొలి ప్రధానమంత్రి, నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ప్రగతికి, ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

బైజూస్ ఫౌండర్ కు సింగపూర్ కోర్టులో 6 నెలల జైలు శిక్ష
ఎడ్టెక్ దిగ్గజం Byju's వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తన ఆస్తుల వెల్లడి, యాజమాన్య పత్రాల సమర్పణకు సంబంధించి 2024 ఏప్రిల్ నుండి కోర్టు ఇచ్చిన పలు ఆదేశాలను ధిక్కరించినందుకు Contempt of court కింద ఈ శిక్ష పడింది. జైలు శిక్షతో పాటు దాదాపు 70,500 డాలర్లు లీగల్ ఖర్చులు చెల్లించాలని, తక్షణమే అధికారులకు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

అఫైర్ కోసం పిల్లలను చంపేసింది.. సీన్ కట్ చేస్తే కోర్టు సంచలన తీర్పు!
చిత్తూరు జిల్లా కవ్వంపల్లిలో ఒక తల్లి తన ఇల్లీగల్ అఫైర్‌కి అడ్డంగా ఉన్నారని 6, 3 ఏళ్ల సొంత కొడుకులను దారుణంగా చంపేసింది. 2017లో జరిగిన ఈ హారిబుల్ ఇన్సిడెంట్‌పై చిత్తూరు కోర్టు రీసెంట్గా కీలకమైన తీర్పు ఇచ్చింది. ట్రాక్టర్ డ్రైవర్‌తో అఫైర్ కోసం పిల్లలను నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరితీసి చంపినట్టు ప్రూవ్ అవ్వడంతో, జడ్జ్ ఆమెకు జీవిత ఖైదు శిక్ష వేశారు. తీర్పు వచ్చిన వెంటనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు షిఫ్ట్ చేశారు.
బండి భగీరథ్ పాక్సో కేసు అప్డేట్!
పాక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్‌ను పోలీసులు చర్లపల్లి జైలు నుండి త్రీ డేస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరిన్ని డిటెయిల్స్ తెలుసుకోవడానికి కోర్టు పోలీసులకు పర్మిషన్ ఇచ్చింది. ఈ మూడు రోజుల పోలీస్ కస్టడీలో నిందితుడిని ఎంక్వైరీ చేసి, మెయిన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.

SIR సరైనదే : సుప్రీం కోర్టు కీలక తీర్పు
బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితాల Special Intensive Revision (SIR) నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం అవసరమేనని తెలిపింది. అయితే ఇదే సమయంలో ఓటర్ల జాబితా నుండి పేర్లు డిలీట్ అయిన వారి విషయంలో కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పొరపాటున ఓట్లు పోయిన జెన్యూన్ ఓటర్లను గుర్తించి, వారు మళ్లీ ఓటు హక్కు పొందేలా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

'నా భర్తను ఇండియాకు రప్పించండి'
TG: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన తోకల శ్రీకాంత్ రూ.70 వేలు లక్ష్మణచందా గ్రామానికి చెందిన రమేష్ అనే ఏజెంట్‌కు చెల్లించి ఈ నెల 15న ఇంటి నుంచి బయలుదేరి 9 మందితో కలిసి దుబాయ్‌కి వెళ్లాడు. శ్రీకాంత్‌తో కలిసి వెళ్లిన మిగతా తొమ్మిది మంది పనికి వెళ్తున్నారని ఏజెంట్ రమేష్ తెలిపారు. 9మందితో కలిసి పనికి వెళ్లకుండా గత 13రోజుల నుంచి నా భర్త శ్రీకాంత్ ఫోన్ కంటాక్ట్, ఆచూకీ లేకుండా పోయిందని, నా భర్త ఎక్కడున్నా ఆచూకీ కనుక్కొని ఇండియాకు రప్పించాలని భార్య అలేఖ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసింది.

రేపే సిద్దరామయ్య రిజైన్ … కాంగ్రెస్ ఆయనను ఎలా ఒప్పించిందంటే ..?
కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు ఖరారైంది. సీఎం సిద్దరామయ్య రేపు రిజైన్ చేసే ఛాన్స్ ఉంది. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్ సీఎం అవుతారు. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఈ మార్పు చేస్తోంది. రాజ్యసభ ఎంపీని చేసి సిద్దరామయ్యని నేషనల్ లెవల్ లో ఒక OBC ఫేస్ గా ప్రొజెక్ట్ చేయాలని భావిస్తోంది. రాహుల్ గాంధీ సోషల్ జస్టిస్ లైన్ లో సిద్దరామయ్యకు జాతీయ రాజకీయాల్లో ప్రయార్టీ ఇస్తామని చెప్పి ఆయనను సీఎం పదవి నుంచి వైదొలగడానికి ఒప్పించినట్టు తెలుస్తోంది.

బెంగళూరులో ఎబోలా టెన్షన్: ఐసలేషన్ లో ఉగాండా మహిళ
భారత్ లోనూ ఎబోలా వైరస్ ఎంటర్ అయిందా ? ఇప్పుడిదే ఆందోళన మొదలైంది. ఉగాండా నుంచి అహ్మదాబాద్ మీదుగా బెంగళూరు వచ్చిన మహిళకు ఎబోలా ఉందన్న అనుమానాలు వచ్చాయి. 28 ఏళ్ల వయసున్న ఆమెకి ఒళ్లు నొప్పులు, అలసట వంటి ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను ఇందిరానగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్‌కు తరలించారు. నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. దేశంలో ఎక్కడా ఎబోలా కేసు నమోదు కాలేదని ఆందోళన చెందాల్సిన పనే లేదని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది.

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ రైడ్స్
మనీ లాండరింగ్ కేసులో కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ED షాకిచ్చింది. తిరువనంతపురంలోని ఆయన ఇల్లు సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. విజయన్ కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీ నుంచి CMRL అనే సంస్థ ఎలాంటి సేవలు పొందకుండా ₹1.72 కోట్లు అక్రమంగా చెల్లించిందనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఈడీ దర్యాప్తుని అడ్డుకోవాలంటూ CMRL వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ రైడ్స్ మొదలయ్యాయి.

'అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలి'
TG: బక్రీద్ పండుగ నేపథ్యంలో మెదక్ టౌన్ పరిధిలోని బోధన్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టును మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. తనిఖీ చేసిన వాహనాల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

కర్నాటకలో డి.కె. శివకుమార్ కు పగ్గాలు- సిద్దరామయ్యకి రాజ్యసభ
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో రెండు, మూడు రోజుల్లో రాజీనామా చేయనున్నారు. కొత్త సీఎం రేసులో ఉన్న డి.కె. శివకుమార్‌కు కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇక సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిచి, రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ చేశారు. 2023లో జరిగిన ఒప్పందం ప్రకారమే ఈ లీడర్షిప్ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
విశాఖలో మారిన వెదర్.. బీచ్ రోడ్ లో అరుదైన దృశ్యం
ఎండలతో మండిపోతున్న విశాఖ పరిసర ప్రాంతాలు ఇవాళ అనూహ్యమైన వాతావరణాన్ని ఫేస్ చేశాయి. సాయంత్రం నాలుగింటి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారు మబ్బులు కమ్మేసి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. చీకటిగా మారిపోయింది. మండే ఎండలతో అల్లాడిపోయిన విశాఖ వాసులు కాస్త సేద తీరారు. పెద్దగా వర్షం పడనప్పటికీ ఈదురు గాలులతో , ఆహ్లాద కరంగా మారిపోయింది. సముద్రం ఆకాశం కలిసినట్టు కనిపించే అరుదైన దృశ్యం బీచ్ లో చోటు చేసుకుంది.

తమ ధాన్యానికి తొందరగా తూకం వేయండి సారూ
TG: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారంలో నెలరోజులు దాటినా ధాన్యాన్ని తూకం వేయడంలేదని, లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తన హెల్త్ బాగలేక హాస్పిటల్‌కు వెళ్లి వచ్చానని, 45రోజులు దాటినా ఇప్పటికీ ధాన్యం తూకం వేయలేదని రైతు నాగులు తన బాధను తెలిపాడు. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లోడ్ చేసి రైస్‌మిల్‌కు పంపి ఐదురోజులు గడుస్తుందని, లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నలుగురు ఐదుగురు రైతులతో కలిసి లారీలను తీసుకొచ్చి ధాన్యాన్ని తరలిస్తున్నామని నిర్వాహకురాలు ఊర్మిళ తెలిపారు. అందుకే వరుసక్రమంలో లారీలను పెట్టలేకపోతున్నామని ఆమె చెప్పారు.

డీజే టిల్లు డైరెక్టర్ తో కార్తీ నెక్స్ట్ మూవీ!
ఇది అఫీషియల్! కోలీవుడ్ స్టార్ కార్తీ తన 30వ సినిమా కోసం 'మ్యాడ్' ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్‌తో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. స్టూడియో గ్రీన్ బ్యానర్లో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ మూవీ ఫుల్ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీతో రాబోతుంది. 'మ్యాడ్' మూవీతో యూత్‌ని షేక్ చేసిన కళ్యాణ్, ఇప్పుడు కార్తీ కోసం ఒక నెక్స్ట్ లెవల్ ఫన్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ క్రేజీ కాంబో కోసం ఫ్యాన్స్ ఆల్రెడీ ఫుల్ హైప్లో ఉన్నారు. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది!

పెండింగ్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ
TG: ప్రజలకు పోలీసులు మెరుగైన సేవలు అందించాలని, పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని మెదక్ ఎస్పీ డీవీ.శ్రీనివాస్ రావు సూచించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించిన ఎస్పీ.. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రాణం తీసిన ఈత సరదా
TG: సరదాగా ఈతకని వెళ్లి చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం మణికొండకు చెందిన కమల్ అనే యువకుడు మంగళవారం తన స్నేహితులతో కలిసి నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు కమల్ డెడ్‌బాడీని బయటకు తీసి నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.