Latest

పార్కింగ్ పరేషాన్!
TG : వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌లో ట్రాఫిక్ కష్టాలు రోజూ ఎక్కువైపోతున్నాయి. అమరవీరుల స్తూపం, అంగడీ సెంటర్, అంబేడ్కర్ జంక్షన్, పాకాల సెంటర్‌తో పాటు మల్లంపల్లి, నెక్కొండ రోడ్లలో వాహనాలను ఎక్కడికక్కడ రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో మెయిన్ రోడ్లలో రాకపోకలు ఆగిపోయి పబ్లిక్, డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసర్లు స్పందించి రోడ్డుపై పార్కింగ్‌ను ఆపి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

27న కోర్టులకు Special Holiday
TG: రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు ఈ నెల 27న Special Holiday ప్రకటించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టుతోపాటు జిల్లా కోర్టులు, ఇతర న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, లేబర్ కోర్టులకు సెలవు వర్తించనుంది. దీంతో 26, 27, 28వ తేదీల్లో వరుసగా మూడు రోజులు న్యాయస్థానాలకు సెలవులు వచ్చాయి. శనివారం మాత్రం హైకోర్టు పని చేయనుంది.

కుమారుడిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తల్లి
TG: భూములు సాగు చేసుకుంటున్నా.. తన బాగోగులు పట్టించుకోవడం లేదంటూ ఓ వృద్ధురాలు కలెక్టర్‌ను ఆశ్రయించింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన రాజమ్మ తన పెద్ద కుమారుడు బాబుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చిన్న కుమారుడితో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. తనకు 3.15 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 36 గుంటల భూమి ఉందని, వాటిని పెద్ద కుమారుడు సాగు చేసుకుంటున్నాడని తెలిపారు. తనను పట్టించుకోవడం లేదని, కుమారుడు, కోడలు తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.

‘CM అయితే మాకేంటి?’..పాట్నాలో స్టూడెంట్స్ ఉద్యమం
బిహార్‌లో ఉద్యోగావకాశాలు, పరీక్షల్లో అవకతవకలపై వేలాది విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. ఇవాళ పాట్నాలో భారీ మార్చ్ నిర్వహించారు. 15 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గాంధీ మైదానం నుంచి సీఎం సమ్రాట్ చౌదరి అధికార నివాసం వైపు మార్చ్ చేశారు. వీళ్లను అడ్డుకోవడానికి 1,200 మందికి పైగా పోలీసులు వాటర్ కానన్లు, బాంబూ లాఠీలు వాడారు. అడ్డంగా బారికేడ్లు పెట్టారు. అయినా సరే వాటిని దాటుకొని స్టూడెంట్స్ సీఎం ఇంటి వద్దే నిరసన తెలిపారు.

చలాన్ కట్టినా సర్వే కాలేదు.. రైతుల తీవ్ర ఇబ్బందులు
TG: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలానికి వెంటనే సర్వేయర్‌ను నియమించాలని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి ప్రజావాణిలో అధికారులను కోరారు. తన వ్యవసాయ భూమి సర్వే కోసం మీ సేవ ద్వారా ఎఫ్‌లైన్ పిటిషన్ దాఖలు చేసి చలాన్ చెల్లించినా 14 నెలలుగా సర్వే జరగలేదని తెలిపారు. మండలంలోని అనేక మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎఫ్‌లైన్ పిటిషన్ల ద్వారా చలాన్ చెల్లించిన రైతుల భూములకు కొలతలు నిర్వహించి, చట్టబద్ధంగా హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో ఎం.సుమంత్‌ను కోరారు.

రైల్వేలో ఉద్యోగాలు.. 1,599 అప్రెంటిస్ పోస్టులు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1,599 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 15, 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు చేసుకోవచ్చు. 10th క్లాస్‌లో 50 శాతం మార్కులతోపాటు ITIలో Fitter, Welder, Turner, Electrician, Carpenter వంటి ట్రేడ్స్ పూర్తి చేసి ఉండాలి. సెప్టెంబర్ 15 నాటికి ఏజ్ 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. General, OBC, EWS మేల్ క్యాండిడేట్స్‌కు రూ.100 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. SC, ST, PwBD, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://www.rrcbbs.org.in/">Click</a> చేయండి.
UPI ట్రాన్సాక్షన్స్ పై మోదీ స్పెషల్ ట్వీట్!
భారత్‌లో UPI సేవలు ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా <a href="https://x.com/narendramodi/status/2092092111059660832?s=20">PM మోదీ</a> 'X' లో స్పెషల్ పోస్ట్ చేశారు. ఈ డిజిటల్ సక్సెస్‌పై ప్రతీ ఇండియన్ ప్రౌడ్‌గా ఫీలవ్వాలని అన్నారు. 2016-17లో కేవలం 1.78 కోట్లుగా ఉన్న UPI ట్రాన్సాక్షన్లు, 2025-26 నాటికి 24,162 కోట్లకు రీచ్ అయ్యాయని తెలిపారు. వరల్డ్‌లో జరిగే మొత్తం రియల్-టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్లలో 50% ఒక్క ఇండియాలోనే జరుగుతున్నాయని, ప్రస్తుతం UPI 11 దేశాల్లో అందుబాటులో ఉందని మోదీ చెప్పారు. అలాగే మీ లైఫ్‌లో UPI తెచ్చిన ఛేంజ్ ఏంటో షేర్ చేయాలని మోదీ కోరారు.

ఐదు కుటుంబాల కుల బహిష్కరణ
TG: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండాలో భూవివాదం నేపథ్యంలో ఐదు కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమతో ఎవరైనా మాట్లాడితే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారని, తిరిగి కులంలో చేర్చుకునేందుకు ఒక్కో కుటుంబం రూ. 1 లక్ష చొప్పున మొత్తం రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారన్నారు. పండుగల సందర్భంగా ఆలయానికి కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Special TET నోటిఫికేషన్ విడుదల..నేటి నుంచి Applications
ఆంధ్రప్రదేశ్‌లో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం Special Teachers Eligibility Test(Special TET) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం..2011కి ముందు అపాయింట్ అయిన సర్వీసు టీచర్లు టెట్ అర్హత సాధించేందుకు ఈ ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ తీసుకుంటారు. ఈ <a href="https://tet2dsc.apcfss.in/">వెబ్‌సైట్</a>లో అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు రెండు విడతల్లో కంప్యూటర్ మీద పరీక్షలు నిర్వహిస్తారు.

రహదారిపై చేరిన వరద.. నిలిచిన రాకపోకలు
AP: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం జిల్లాలో గోదావరి, శబరి నదుల్లో ప్రవాహం పెరిగింది. దీంతో వాగులు పొంగి వరదనీరు రహదారులపై ప్రవహిస్తున్నాయి. పోలవరం జిల్లా చింతూరు మండలం సోకిలేరు వాగు పొంగి వరదనీరు రహదారిపై చేరడంతో చింతూరు, వర రామచంద్రపురం మండలాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు చింతూరు మండలంలోని 11 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోవడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొనసాగుతున్న సాగర్ మాల ప్రాజెక్టు పనులు
సాగర్‌మాల ప్రాజెక్టులో భాగంగా కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం దేవస్థాన నమూనా ఆలయం నుంచి కాకినాడ లైట్‌హౌస్ వరకు 42 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. గతంలో అన్నవరం ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం పరిశీలించిన భూముల్లోనే ఈ రహదారి పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఎయిర్‌పోర్ట్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించడంతో విమానాశ్రయ ప్రతిపాదనలకు చెక్ పడింది.

బంగారం కోసం దారుణ హత్య.. ఇద్దరికీ జీవిత ఖైదు
AP: కాకినాడ జిల్లాలో 2023లో జరిగిన పప్పు సత్యవతి హత్య కేసులో పిఠాపురం జిల్లా సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎర్రకోనేరులో సత్యవతిని కత్తులతో దాడిచేసి హత్య చేసిన అనంతరం ఆమె మెడలోని బంగారు ఆభరణాలను నిందితులు దోచుకెళ్లారు. కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సునీల్ సాహు, ఒడిశాకు చెందిన రాజ్ బిందాసింగ్‌పై నేరం రుజువైంది. ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులపై అభియోగాలు నమోదు చేసి, ఆధారాలతో నేరం నిరూపించినట్లు తుని రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు తెలిపారు.

రూ.30 లక్షల డ్రగ్స్.. మాజీ Air Hostess అరెస్ట్
గుజరాత్ వడోదర నుంచి ముంబైకి డ్రగ్స్ సప్లై చేస్తున్న మాజీ Air Hostessను పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్ దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కారును చెక్ చేయగా 977 గ్రా. మెఫెడ్రోన్ దొరికింది. దీని Value రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మాజీ క్యాబిన్ క్రూ మాన్సీ సయీద్, సోహైల్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో డ్రగ్స్‌ను చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నట్లు Inquiryలో తెలిసింది. మాన్సీకి 2015 నుంచే డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు.

రైతుల పొలాల గట్లపై 50 వేల టేకు స్టంపుల పంపిణీ
TG: కామారెడ్డి జిల్లాలోని మండలాలకు మొత్తం 50,000 టేకు స్టంపులను పంపిణీ చేశారు. రైతుల పొలాల గట్లు, ఇతర అనువైన ప్రాంతాల్లో వీటిని నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26 టేకు స్టంపుల నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు DAO మోహన్ రెడ్డి తెలిపారు. రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ పొలాల గట్లపై టేకు మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో అదనపు ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మమితా బైజు - నివిన్ పౌలీ కాంబోలో కొత్త లవ్ స్టోరీ!
‘ప్రేమలు’ హిట్ తర్వాత మమితా బైజు, నివిన్ పౌలీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త లవ్ స్టోరీ ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’. గిరీష్ ఏడీ డైరెక్షన్‌లో భావనా స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాను సెప్టెంబర్ 4న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘ప్రేమలు’ లాగే ఈ మూవీని కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తూ <a href="https://x.com/NivinOfficial/status/2091904918949122315?s=20">హీరో నివిన్</a> పౌలీ 'X'లో షేర్ చేశారు.

గ్రానైట్ క్వారీలపై గ్రామస్తుల పోరుబాట
AP: గ్రానైట్ క్వారీలతో పర్యావరణం దెబ్బతింటోందని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం ఉర్లావ రెవెన్యూ పరిధిలో అమర్ గ్రానైట్ క్వారీలకు సంబంధించి నిర్వహించనున్న ప్రజా అభిప్రాయ సేకరణను రద్దు చేయాలని గ్రామస్తులు కోరారు. క్వారీల నిర్వహణతో కొండగట్లు ధ్వంసమవుతున్నాయని, చెరువులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీల నుంచి వెలువడుతున్న దుమ్ము గిరిజనుల పంట పొలాలపై పేరుకుపోయి పంటలకు నష్టం కలిగిస్తోందన్నారు.

అమరావతి అగ్ని ప్రమాదం..తండ్రికి తీరని వేదన
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రి NICUలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు నవజాత శిశువులు మరణించారు. వీరిలో పుల్‌గావ్‌కు చెందిన స్వప్నిల్ బోర్గే కుమారుడు కూడా ఉన్నాడు. తనకు మగబిడ్డ పుట్టాడని స్వప్నిల్ ఆనందంతో స్వీట్లు పంచాడు. కొడుకు ముఖం చూడకుండానే వెంటిలేటర్ షార్ట్ సర్క్యూట్‌తో బిడ్డ మరణించాడు. “ఇంకా ముఖం కూడా చూడలేదు. ఈ విషయం నా భార్యకు ఎలా చెప్పాలో తెలియడం లేదు” అని అతను దీనంగా ఆసుపత్రి బయట కూర్చొన్న ఫొటో కంటతడి పెట్టిస్తోంది.
కోటిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ మంత్రి
AP: పల్నాడు జిల్లా,చిలకలూరిపేట: అక్రమ కేసులో అరెస్టయిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీ దంపతులను మాజీ మంత్రి విడుదల రజిని పరామర్శించారు. మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని ధైర్యం చెబుతూ, న్యాయపరంగా పోరాటం చేసి అసలు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చిన రజిని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

పొట్లూరులో కార్డెన్ సెర్చ్.. 54 వాహనాలు సీజ్
AP: గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాల మేరకు నరసరావుపేట సబ్‌డివిజన్ పరిధిలోని శావల్యాపురం మండలం పొట్లూరులో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు సరైన ధ్రువపత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య, నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

చెక్కుచెదరని స్నేహం.. మిత్రురాలికి రూ.56వేల చేయూత
TG: నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ 2004-05 SSC బ్యాచ్ మిత్రులు తమ స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అనుకోని ప్రమాదంతో గంగసాగర చేతి వేలుకు ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు దానిని తొలగించారు. ఇద్దరు పిల్లలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న మిత్రులు స్పందించారు. మిత్రులు రూ.40 వేలు, మిత్రురాళ్లు రూ.16 వేలు కలిపి మొత్తం రూ.56 వేల ఆర్థిక సహాయాన్ని సేకరించి గంగసాగర కుటుంబానికి అందజేశారు.

దాములూరులో పోలీసుల పల్లె నిద్ర.. ప్రజలకు కీలక అలర్ట్
AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో పోలీసులు నిర్వహించిన ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సీఐ ఎ.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎవరితోనూ ఓటీపీలు పంచుకోవద్దని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. యువత **‘ఈగల్ ఛాలెంజ్’**లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.