← Back to news

చెక్కుచెదరని స్నేహం.. మిత్రురాలికి రూ.56వేల చేయూత

By Md Jabeer· 25 Aug 2026
చెక్కుచెదరని స్నేహం.. మిత్రురాలికి రూ.56వేల చేయూత

TG: నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ 2004-05 SSC బ్యాచ్‌ మిత్రులు తమ స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అనుకోని ప్రమాదంతో గంగసాగర చేతి వేలుకు ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు దానిని తొలగించారు. ఇద్దరు పిల్లలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న మిత్రులు స్పందించారు. మిత్రులు రూ.40 వేలు, మిత్రురాళ్లు రూ.16 వేలు కలిపి మొత్తం రూ.56 వేల ఆర్థిక సహాయాన్ని సేకరించి గంగసాగర కుటుంబానికి అందజేశారు.

More in Local