అమరావతి అగ్ని ప్రమాదం..తండ్రికి తీరని వేదన

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రి NICUలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు నవజాత శిశువులు మరణించారు. వీరిలో పుల్‌గావ్‌కు చెందిన స్వప్నిల్ బోర్గే కుమారుడు కూడా ఉన్నాడు. తనకు మగబిడ్డ పుట్టాడని స్వప్నిల్ ఆనందంతో స్వీట్లు పంచాడు. కొడుకు ముఖం చూడకుండానే వెంటిలేటర్ షార్ట్ సర్క్యూట్‌తో బిడ్డ మరణించాడు. “ఇంకా ముఖం కూడా చూడలేదు. ఈ విషయం నా భార్యకు ఎలా చెప్పాలో తెలియడం లేదు” అని అతను దీనంగా ఆసుపత్రి బయట కూర్చొన్న ఫొటో కంటతడి పెట్టిస్తోంది.


