AP

ఆటో కోసం వేచి ఉన్న బీటెక్ విద్యార్థిపై దాడి
AP· 23 Jul 2026

ఆటో కోసం వేచి ఉన్న బీటెక్ విద్యార్థిపై దాడి

AP: తిరుపతి జిల్లా రేణిగుంటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో బీటెక్ విద్యార్థి రాకేశ్‌పై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితుడి ఫిర్యాదు మేరకు విజయ్, సుజన్, శ్రీను అనే ముగ్గురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాల ముగిసిన తర్వాత జిరాక్స్ షాప్ వద్ద ఆటో కోసం వేచి ఉన్న సమయంలో గొడవ జరిగిందని, విజయ్ కూల్‌డ్రింక్ బాటిల్‌తో తలపై కొట్టడంతో గాయం అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురూ కలిసి చేతులతో, కాళ్లతో దాడి చేయడంతో రాకేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులకు మోసం
AP· 23 Jul 2026

సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులకు మోసం

AP: రాయలసీమలో సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులను ప్రైవేట్ కంపెనీలు మోసం చేస్తున్నాయని CPM రాష్ట్ర కార్యదర్శి V. శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంపెనీల అగ్రిమెంట్లలో అనేక లొసుగులు ఉన్నాయని, ప్రభుత్వం రైతులకు ఎలాంటి కౌంటర్ గ్యారెంటీ ఇవ్వడం లేదన్నారు. రైతుల భూములను తాకట్టు పెట్టి కంపెనీలు వందల కోట్ల రుణాలు ఎలా పొందుతున్నాయని ప్రశ్నించారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వని వ్యవస్థ, పారిశ్రామికవేత్తలకు మాత్రం అవకాశం కల్పించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం థర్డ్ పార్టీగా జోక్యం చేసుకుని రైతులకు భద్రత కల్పించి, న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

'మన ఇల్లు–మన లోకేష్'తో 3 వేల మందికి భూమి హక్కు పత్రాలు
AP· 22 Jul 2026

'మన ఇల్లు–మన లోకేష్'తో 3 వేల మందికి భూమి హక్కు పత్రాలు

AP: మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన మూడువేల మంది పేద లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ శాశ్వత భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. 'మన ఇల్లు–మన లోకేష్' కార్యక్రమ సభలో ఆయన మాట్లాడుతూ అర్హులైన కుటుంబాలకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చామని తెలిపారు. భూమి హక్కు పత్రాలతో లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు భూగర్భ మురుగునీటి పారుదల, 24 గంటల తాగునీటి సరఫరా, పార్కులు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

కరోనా కలకలం.. సీలేరు పర్యాటకుల ప్రవేశం నిలిపివేత
AP· 22 Jul 2026

కరోనా కలకలం.. సీలేరు పర్యాటకుల ప్రవేశం నిలిపివేత

APలో కరోనా కేసులు పెరుగుతుండటంతో విశాఖపట్నం జిల్లా సీలేరు ప్రాంతంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. సీలేరు పవర్ కాంప్లెక్స్ పరిధిలోకి పర్యాటకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలు, రిజర్వాయర్లకు బయటి వ్యక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి కోవిడ్ నిబంధనలు తప్పనిసరి చేశారు. ప్రజలు కూడా మాస్క్‌లు ధరించి జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచించారు.

APలో UAE ఫుడ్ క్లస్టర్‌కు శ్రీకారం
AP· 22 Jul 2026

APలో UAE ఫుడ్ క్లస్టర్‌కు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో UAE ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదిరిన ఒప్పందం మేరకు యూఏఈ ప్రభుత్వం APలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. అమరావతిలోని సచివాలయంలో CM చంద్రబాబు, UAE మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో APEDB అవగాహన ఒప్పందం కుదిరింది. మామిడి, అరటి, కోకో వంటి ఉద్యాన పంటలకు వ్యాల్యూ యాడెడ్ చైన్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో రూ.100 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది.

కొత్త తరహా నేరాలకు చెక్
AP· 22 Jul 2026

కొత్త తరహా నేరాలకు చెక్

AP: రాష్ట్రంలో కొత్త తరహా నేరాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు. మారిపోతున్న నేరాల స్వభావం, ఎదుర్కోవడంలో తలెత్తుతున్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తేవాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో 3 రోజులపాటు జరిగే ఈ సదస్సును ఆమె ప్రారంభించారు. సైబర్ నేరాలు, రౌడీయిజం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసింగ్‌ను సాంకేతికంగా బలోపేతం చేస్తామని తెలిపారు. నేరాల నియంత్రణలో 3P విధానం ప్రెడిక్షన్, ప్రికాషన్, ప్రివెన్షన్ అమలు చేయాలని సూచించారు.