Education

చదువు కోసం ప్రాణాలు రిస్క్ లో పెడుతున్న స్కూల్ స్టూడెంట్స్!
Education· 17 Jul 2026

చదువు కోసం ప్రాణాలు రిస్క్ లో పెడుతున్న స్కూల్ స్టూడెంట్స్!

ఎడ్యుకేషన్ కోసం పిల్లలు ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్న హార్ట్ బ్రేకింగ్ వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ హర్దా జిల్లా రామ్‌పుర గ్రామంలో బ్రిడ్జ్ లేకపోవడంతో, స్టూడెంట్స్ ప్రతిరోజూ టైర్ ట్యూబ్‌ల సహాయంతో నది దాటాల్సి వస్తోంది. తాడు పట్టుకుని, ట్యూబ్‌లపై కూర్చుని చాలా డేంజరస్‌గా నది క్రాస్ చేస్తున్నారు. దేశంలో డెవలప్‌మెంట్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా, రియాలిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉండటం బాధాకరం. పిల్లల సేఫ్టీ, చదువు గవర్నమెంట్స్ కనీస బాధ్యత అని, ఈ వీడియో చూసైనా అధికారులు మారాలని నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు.

మూసీ నుంచి చికాగో దాకా.. హిస్టరీ ఛేదిస్తున్న మిలింద్
Education· 17 Jul 2026

మూసీ నుంచి చికాగో దాకా.. హిస్టరీ ఛేదిస్తున్న మిలింద్

24 ఏళ్ల హైదరాబాదీ కెమెరాతో చరిత్రకు జీవం పోస్తున్నాడు. అమెరికాలో MA హిస్టరీ చేస్తున్న రాహుల్ మిలింద్.. తనే స్టోరీ, కెమెరా, మ్యూజిక్, డైరెక్షన్ చేస్తూ 3 డాక్యుమెంటరీస్ తీశాడు. మూసీ చరిత్ర, 1984 సిక్కుల ఊచకోత డాక్యుమెంటరీస్ జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ గెలిచాయ్. దక్షిణాసియా నుంచి చికాగోకు వలస వెళ్లిన వారి అనుభవాలతో తీసిన "The Shape of Belonging" జులై 18న చికాగో సౌత్ ఏషియా ఇన్ స్టిట్యూట్లో ప్రదర్శిస్తున్నారు. రామచంద్ర గుహ శిష్యుడైన రాహుల్ మిలింద్ తెలంగాణ ఉద్యమకారుడు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ VC ఘంటా చక్రపాణి కుమారుడు.

హాస్టల్‌లో ఉండలేక బయటకు వచ్చిన విద్యార్థులు
Education· 15 Jul 2026

హాస్టల్‌లో ఉండలేక బయటకు వచ్చిన విద్యార్థులు

మంచిర్యాల జిల్లా చెన్నూరు మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో వసతుల సమస్యలతో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు హాస్టల్ విడిచి బయటకు వచ్చారు. మంగళవారం రాత్రి 17మంది స్టూడెంట్స్ ఎమ్మెల్యే సతీమణి సురేఖను కలిసి సమస్యలను వివరించారు. సమస్యలను విన్న సురేఖ, వారిని జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీధర్‌కు అప్పగించి, సురక్షితంగా చెన్నూరుకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. గురుకులంలో వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల, గురుకులాల్లో వసతులు లేకపోవడం, ఫుడ్‌పాయిజన్ ఘటనలతో స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు.

తల్లికి వందనం తొలి విడతకు గ్రీన్ సిగ్నల్
Education· 15 Jul 2026

తల్లికి వందనం తొలి విడతకు గ్రీన్ సిగ్నల్

AP: స్కూల్‌కు వెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులకు ‘తల్లికి వందనం’ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 24న మెగా పేరెంట్‌, టీచర్స్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలి విడతలో రూ.10,049 కోట్లకు అనుమతులు ఇవ్వనున్నారు. దీంతో సుమారు 66.9లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాలో జమచేయనున్నారు. అడ్మిషన్లకు ఇంకా సమయం ఉన్నందున కొత్తగా చేరేవారికి రెండో విడతలో నిధులు విడుదల చేయనున్నారు. ఈ నెల 24న రంపచోడవరంలో మెగా పేరేంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.