Education

కాలేజీల బంద్.. విద్యార్థులకు కీలక అలర్ట్
Education· 14 Jul 2026

కాలేజీల బంద్.. విద్యార్థులకు కీలక అలర్ట్

TG: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రియంబర్స్‌మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని ABVP బంద్‌కు పిలుపునివ్వడంతో ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు మూతపడనున్నాయి. పెండింగ్‌లో ఉన్న రూ.12,000 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. సుమారు 20 లక్షల మంది SC, ST, BC, మైనారిటీ విద్యార్థులపై ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభావం పడుతోందని, ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూనియర్ కాలేజీల నుంచి యూనివర్సిటీల వరకు బంద్ పాటించాలని ABVP పిలుపునిచ్చింది.

16వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష!
Education· 13 Jul 2026

16వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష!

ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. దీనిపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. ప్రభుత్వం దీన్ని 'ఈగో' సమస్యగా మార్చవద్దని, ఇక్కడ హ్యూమన్ లైవ్స్ ముఖ్యం అని ట్వీట్ చేశారు. తప్పును ఒప్పుకోవడం బలహీనత కాదు, అకౌంటబిలిటీకి నిదర్శనమని పేర్కొన్నారు. స్టూడెంట్స్ ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. మరోవైపు, రోజురోజుకూ క్షీణిస్తున్న వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్‌పై ఇప్పుడు అందరిలో తీవ్ర ఆందోళన మొదలైంది.

కళాశాలకు తాళం వేసి ధర్నా
Education· 9 Jul 2026

కళాశాలకు తాళం వేసి ధర్నా

TG: నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని PG కాలేజ్ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కళాశాలకు తాళం వేసి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. TC కోసం కాలేజ్‌కు వచ్చిన విద్యార్థిపై ప్రిన్సిపల్ అనుచితంగా ప్రవర్తించడంతో ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

AIతో ఔషధ పరిశోధనలకు కొత్త ఊపు
Education· 9 Jul 2026

AIతో ఔషధ పరిశోధనలకు కొత్త ఊపు

TG: భారతదేశ ప్రాచీన సాంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని, కృత్రిమ మేధస్సుతో అనుసంధానించడం ద్వారా మానవాళికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధాలను కనుగొనవచ్చని శాతవాహన యూనివర్సిటీ VC ఉమేష్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని SU పరిధిలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో "సహజ సిద్ధ ఔషధాల ఆవిష్కరణలో AI పాత్ర" అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పరిశోధనల్లో ఇలాంటి నూతన సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సహజ సిద్ధమైన మూలికా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలంటే శాస్త్రీయమైన డేటా, పరిశోధనలు ఎంతో అవసరమన్నారు.

ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన స్టూడెంట్‌!
Education· 8 Jul 2026

ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన స్టూడెంట్‌!

నిర్మల్ జిల్లా భైంసాలోని గోపాలరావు పాటిల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కాలేజీలో సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా, ఒక స్టూడెంట్ ఓపెన్‌గా చీటింగ్ చేస్తూ దొరికిపోయాడు. అది గమనించిన కాలేజీ ప్రిన్సిపాల్ వెంటనే అక్కడికి వచ్చి, ఆ స్టూడెంట్‌ని పట్టుకుని ఎగ్జామ్ రాయకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర కోపానికి గురైన ఆ స్టూడెంట్ అందరి ముందే ప్రిన్సిపాల్‌పై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఇన్సిడెంట్‌పై ప్రిన్సిపాల్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఆ స్టూడెంట్‌పై కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.

రెండేళ్ల నుంచి అక్కడ ఆఫీసే స్కూల్‌
Education· 8 Jul 2026

రెండేళ్ల నుంచి అక్కడ ఆఫీసే స్కూల్‌

TG: నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని కన్నడ మీడియం ప్రాథమిక పాఠశాల భవనం రెండేళ్ల క్రితం పూర్తిగా కూలిపోయింది. దీంతో పాఠశాలను ఎత్తేయకుండా తాత్కాలికంగా స్థానిక MPDO ఆఫీసులోకి మార్చారు. కార్యాలయంలో ఉన్న నాలుగు గదుల్లో చెరి రెండు గదులను కేటాయించి 45మంది విద్యార్థులతో తరగతులు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి రూ.60 లక్షల నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా, అధికారుల నిర్లక్ష్యంతో నేటికీ కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించలేదు. నిధులు ఉండి కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు ప్రారంభం కావడంలేదని స్థానికులు ఫైరవుతున్నారు.

అక్కడ అన్నం తినాలంటే కిలోమీటర్ నడవాల్సిందే
Education· 8 Jul 2026

అక్కడ అన్నం తినాలంటే కిలోమీటర్ నడవాల్సిందే

TG: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ఒకే ప్రాంగణంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉండేవి. రెండు స్కూళ్లకు చెందిన విద్యార్థులకు అక్కడే మధ్యాహ్న భోజనం వండి పెట్టేవారు. ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో 2018లో బీర్కూర్ మండలం వీరాపూర్‌‌లో కొత్త భవనాన్ని నిర్మించి బడిని అక్కడికి మార్చారు. కానీ 8ఏళ్లు దాటినా వంటగది నిర్మించలేదు. దీంతో డైలీ 100మందికి పైగా విద్యార్థులు భోజనం కోసం మధ్యాహ్నం దాదాపు 1 KM దూరంలో ఉన్న పాత స్కూల్‌కు ప్లేట్స్ పట్టుకుని వెళ్తున్నారు. అక్కడ తినేందుకు ప్లేస్ కూడా లేకపోవడంతో భోజనం తీసుకుని తిరిగి కొత్త బడికి వచ్చి తింటున్నారు.