Health

 ముంబై వాటర్ మిలన్ డెత్స్ కి రీజన్ ఇదేనా?
Health· 27 Apr 2026

ముంబై వాటర్ మిలన్ డెత్స్ కి రీజన్ ఇదేనా?

వాటర్ మిలన్ కలుషిత నీటితో పండితే.. పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడితే, లేదా హానికారక బాక్టీరియా అందులో ఉంటే అది ఫుడ్ పాయిజన్ కింద మారుతుందంటున్నారు డాక్టర్లు. ఒక్కొసారి కొన్నింటిలో ప్రమాదకరమైన ఈ కొలీ, సాల్మనెల్లా, లిస్టిరియోసిస్ లాంటి బాక్టీరియా ఉండొచ్చు. వ్యాపారులు పుచ్చకాయలకు ఎక్కువ స్వీట్ నెస్ కోసం గ్లూకోజ్ , కలర్ ని ఇంజెక్ట్ చేసి అమ్ముతుంటారు. అలాగే నీరు ఎక్కువగా ఉందనిపించడానికి నీటిని కూడా సిరెంజిలతో లోడ్ చేసి అమ్ముతుంటారు. ఇవన్నీ కూడా అనారోగ్యానికి కారణాలే. పైగా పుచ్చకాయను రాత్రిపూట తినక పోవడమే మంచిది.ముంబై డెత్స్ కి వీటిలో ఏదైనా కారణం కావచ్చు.

TB వ్యాధిని గుర్తించే AI ..!
Health· 22 Apr 2026

TB వ్యాధిని గుర్తించే AI ..!

క్షయ (TB) వ్యాధిగ్రస్తుల్ని ముందస్తుగా గుర్తించడానికి ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. సాల్సిట్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన శ్వాస అనే ఏఐ సాఫ్ట్ వేర్ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే సులభంగా TB పేషెంట్లను గుర్తించవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ ఉన్న ఫోన్ ను దగ్గరగా పెట్టుకొని దగ్గితే ఆ వ్యక్తిలో టీబీ లక్షణాలున్నాయో లేదో అది చెప్పేస్తుంది. ఏపీలో ఆంధ్రా మెడికల్ కళాశాలలో క్లినికల్ ట్రయల్స్ ఉన్న శ్వాస అందుబాటులోకి వస్తే టీబీని కట్టడి చేయవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. మన దేశంలో సకాలంలో గుర్తించకపోవడం వల్ల ప్రపంచంలో టీబీ కేసుల్లో 28శాతం నమోదవుతున్నాయి.