Local· 21 Aug 2026
తెలకపల్లి మండలంలో 7566 మంది ఓటర్లకు నోటీసులు
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన తెలకపల్లి మండలంలో 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత జాబితా మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలో 582 మంది మ్యాపింగ్ కాని ఓటర్లు, 6,974 మంది అనామలీస్ ఓటర్లను గుర్తించి మొత్తం 7,566 నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.