కామ్రేడ్ కనకాచారి 21వ సంస్మరణ సభకు ఆహ్వానం
నరసరావుపేట మార్కెట్ యార్డ్ వద్ద శుక్రవారం కామ్రేడ్ కనకాచారి 21వ సంస్మరణ సభ కరపత్రాన్ని సిపిఎం నాయకులు ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 23న వినుకొండలోని సీపీఎం కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించనుండగా, ప్రజా కళామండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.



