← Back to news

డంపు యార్డ్ జీవో రద్దు కోసం పోరాటం

By Adithya D· 21 Aug 2026
డంపు యార్డ్ జీవో రద్దు కోసం పోరాటం

TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన డంపియార్డు జీవో రద్దు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతానని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్‌లో ఆయనను కలిసిన సిద్దాపూర్ డంపు యార్డ్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు రాంబల్ నాయక్, పినపాక ప్రభాకర్, తిరుమలయ్య తదితరులు డంపు యార్డ్ పై చేస్తున్న పోరాటంలో తమకు సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. 10 గ్రామాలను నష్టం చేసే ఈ డంపు యార్డ్ ప్రతిపాదనను బీఆర్ఎస్ తరఫున అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.

More in Local