Technology

షెన్‌జెన్‌లో రోబోల బాక్సింగ్ ఫైట్ నైట్
Technology· 17 Jul 2026

షెన్‌జెన్‌లో రోబోల బాక్సింగ్ ఫైట్ నైట్

చైనాలోని షెన్‌జెన్ నగరం సరికొత్త రికార్డుకు వేదికైంది. 'ఇంజన్ ఏఐ' (EngineAI) సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోల బాక్సింగ్ టోర్నమెంట్ (URKL) ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 32 అంతర్జాతీయ జట్లు తమ T800 రోబోలతో రింగులో తలపడ్డాయి. ఈ పోటీల్లో రోబోలు బ్రూస్ లీ శైలిలో పర్ఫెక్ట్ లో-కిక్స్, పంచ్‌లతో అలరించాయి. కేవలం వినోదం కోసమే కాకుండా, విపత్కర పరిస్థితుల్లో రోబోల సమతుల్యత, కదలిక,నియంత్రణ సామర్ధ్యాలను టెస్ట్ చేసి , వాటి టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి ఈ రౌండ్-ది-క్లాక్ ఫైట్ నైట్‌ను పరిశోధకులు నిర్వహిస్తున్నారు.

మీ పర్సనల్ డేటాపై కన్నేసిన AI కంపెనీలు!
Technology· 15 Jul 2026

మీ పర్సనల్ డేటాపై కన్నేసిన AI కంపెనీలు!

ఇకపై AI టూల్స్ గూగుల్, మెటా వంటి టెక్ జెయింట్స్ మీ సెర్చ్ హిస్టరీ మాత్రమే కాదు.. మీ చాట్స్, ఫొటోస్, వాయిస్ రికార్డింగ్స్‌ను కూడా ట్రాక్ చేయనున్నాయి. తమ AI మోడల్స్ ట్రైనింగ్ కోసం ఈ డేటాను వాడుకోనున్నట్లు ప్రకటించాయి. గూగుల్ జూలై 2026 నుండి కొత్త సెర్చ్ హిస్టరీ సెట్టింగ్స్ తెచ్చింది. ఒకవేళ మీ డేటా AI ట్రైనింగ్‌కు వెళ్లకూడదనుకుంటే, సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'Opt-out' (ఆఫ్) చేసుకోవచ్చు. అయితే మెటా, చాట్‌జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ప్రైవసీ కంట్రోల్స్ వేర్వేరుగా ఉన్నాయి. యూజర్స్ అలర్ట్‌గా ఉండాలని ఎక్స్పర్ట్ చెప్తున్నారు.