Technology

భూ కంపాలను  ప్రిడిక్ట్ చేయడంలో AI  ఫెయిల్?
Technology· 9 Jul 2026

భూ కంపాలను ప్రిడిక్ట్ చేయడంలో AI ఫెయిల్?

క్యాన్సర్ గుర్తించడం నుంచి సైక్లోన్ అంచనాల వరకూ AI అదరగొడుతోంది. కానీ భూకంపాల విషయంలో మాత్రం ఇంకా ఫెయిల్ అవుతోంది. కారణం? రికార్డులు కేవలం 150 ఏళ్లవే, పెద్ద భూకంపాలు వందల నుంచి వేల ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. ఒకే ఫాల్ట్‌పై డేటా చాలా తక్కువగా ఉండటంతో AIకి ప్యాటర్న్స్ అర్థం కావడం లేదు. అందుకే ఇప్పటికీ ఖచ్చితమైన భూకంప అంచనా అసాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, భూకంప నిరోధక భవనాలు, కఠిన బిల్డింగ్ కోడ్స్, ప్రజల అవగాహన, వేగవంతమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్‌నే ప్రాణాలను కాపాడే బెస్ట్ డిఫెన్స్‌గా నిపుణులు చెబుతున్నారు.

ఆండ్రాయిడ్ ఫోన్లలో భూ కంపాలపై ముందే అలర్ట్ లు !
Technology· 25 Jun 2026

ఆండ్రాయిడ్ ఫోన్లలో భూ కంపాలపై ముందే అలర్ట్ లు !

ఒక్క మోడ్రన్ సెల్ ఫోన్ ఉంటే చాలు భూ కంపం గురించి ముందే ఎలర్ట్ పొందచ్చు.. వెనిజులాలో జరిగిందిదే.. భూకంపంరాడానికి కొన్ని సెకన్ల ముందు అక్కడి స్మార్ట్ ఆండ్రాయిడ్ మోడ్రన్ ఫోన్స్ అన్నింటికీ గూగుల్ అలర్ట్ ఇచ్చింది.స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ‘యాక్సిల రోమీటర్’ సెన్సార్ల ద్వారా భూకంప ప్రాథమిక తరంగాలను ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ పసిగట్టింది. ప్రకంపనలు తీవ్రంగా మారకముందే గూగుల్ అక్కడి ప్రజలకు ఫోన్ల ద్వారా ముందస్తు హెచ్చరికలు పంపింది. టెక్నాలజీతో విపత్తులను ముందే ఊహించి ప్రాణాలు కాపాడు కోవచ్చు. మరి మీ ఫోన్ లో ఈ టెక్నాలజీ ఉందా? జస్ట్ చెక్ ఇట్ .

డిజిటల్ పరికరాలతో చిన్నారులలో  బిహేవియర్ డిజార్డర్స్ !
Technology· 22 Jun 2026

డిజిటల్ పరికరాలతో చిన్నారులలో బిహేవియర్ డిజార్డర్స్ !

స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు చిన్నారుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. డిజిటల్ పరికరాల మితిమీరిన వాడకం వల్ల చిన్న పిల్లల్లో వ్యసనం (అడిక్షన్), నిద్రలేమి సమస్యలు మరియు 'టెక్ ట్యాంట్రమ్స్' (చిరాకు, మొండితనం) వంటి ప్రవర్తనా లోపాలు పెరుగుతున్నాయని ఒక సరికొత్త పుస్తకం విశ్లేషించింది. మైండ్ ఫుల్ పేరెంటింగ్ హ్యాబిట్స్ అనే ఆ పుస్తకంలో గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉంచితే పిల్లలు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారని ఈ పుస్తకం హెచ్చరించింది. స్క్రీన్ టైమ్‌ను నియంత్రించకపోతే వారి మానసిక, శారీరక ఎదుగుదల దెబ్బతింటుందని, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రచయితలు సూచించారు.