Viral· 20 Jun 2026
ఈ దేశంలో ఇలా పాట పాడితే 74 కొరడా దెబ్బలు?
ఇరాన్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. పరాస్తో అహ్మదీ అనే మహిళ హిజాబ్ (బురఖా) లేకుండా, స్లీవ్‌లెస్ బట్టలు వేసుకుని యూట్యూబ్ లైవ్‌లో సాంగ్స్ పాడింది. దీంతో అక్కడి కోర్టు ఆమెకు ఏకంగా 74 కొరడా దెబ్బల శిక్ష వేసింది. అంతేకాదు రెండేళ్ల పాటు దేశం దాటి వెళ్లకూడదని, ఎలాంటి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేయకూడదని రూల్ పెట్టింది. 2025లో ఇరాన్ తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం 12 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా హిజాబ్ వేసుకోవాలి, లేదంటే జైలు శిక్ష పక్కా. ఈ వింత రూల్స్, కఠిన శిక్షలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.