Viral

కుక్క కోసం ఏడుస్తూ వీడియో పెట్టిన నటి మంజరి!
Viral· 9 Jun 2026

కుక్క కోసం ఏడుస్తూ వీడియో పెట్టిన నటి మంజరి!

'జానే తూ యా యానే నా' సినిమా యాక్ట్రెస్ మంజరి ఫడ్నిస్ సోషల్ మీడియాలో ఏడుస్తూ పెట్టిన ఒక వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. తమ అపార్ట్‌మెంట్ సొసైటీలో 2019 నుండి ఉంటున్న 'మైకీ' అనే డాగ్‌ను కొందరు దారుణంగా కొట్టి చంపేశారని ఆమె ఏడుస్తోంది. ఆ డాగ్‌ను మెట్ల దగ్గరికి లాక్కెళ్లి, నోటి నుండి బ్లడ్ వచ్చేలా దారుణంగా కొట్టారని. కొన్ని రోజులుగా మైకీ కనిపించకపోవడంతో అందరూ వెతికారు, కానీ లాస్ట్‌కి అది మర్డర్ అయిందని తెలిసి షాక్ అయ్యారు. జంతువులను ఇలా టార్చర్ పెట్టే వాళ్లకు భయం ఉండేలా serious acts తీసుకురావాలని, మైకీకి జస్టిస్ జరగాలని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది.

తరతరాలకు స్ఫూర్తి  వియత్నాం  హ్యూమన్  బ్రిడ్జ్... ఎందుకో తెలుసా?
Viral· 4 Jun 2026

తరతరాలకు స్ఫూర్తి వియత్నాం హ్యూమన్ బ్రిడ్జ్... ఎందుకో తెలుసా?

వియత్నాం యుద్ధ కాలం నాటి ఓ గగుర్పాటు కలిగించే చారిత్రక సత్యం ఇది. అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించి అక్కడి వంతెనలన్నింటినీ కూల్చేసింది. సైన్యం ముందుకు వెళ్లే దారి మూసుకుపోయింది. కానీ అక్కడి మహిళలంతా కలిసి స్వయంగా ఒక "హ్యూమన్ బ్రిడ్జ్"లా మారారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, వియత్నామీస్ సైనికులు నది దాటడానికి దారినిచ్చారు. చరిత్ర పుటల్లో ఇదొక చెరిగిపోని దృశ్యం! తుపాకులు, బాంబులు తాత్కాలిక భయాన్ని సృష్టించగలవేమో గానీ... ఒక జాతి సంకల్పాన్ని మాత్రం ఏ శక్తీ లొంగదీసుకోలేదు అనడానికి వియత్నాం మహిళల త్యాగమే అతిపెద్ద నిదర్శనం! సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.