Viral

ప్రశ్న రావణ్ పై UAPA చట్టం వర్తించదు: ABV
Viral· 7 Jul 2026

ప్రశ్న రావణ్ పై UAPA చట్టం వర్తించదు: ABV

ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్టుపై Ex IPS ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రిమాండ్ రిపోర్టుతో పాటు రావణ్ అరెస్టుకు కారణమైన వీడియో క్లిప్స్ అన్నీ చూశానని చెప్పారు. రాధామనోహర్ దాస్ అనే వ్యక్తి వేరే మతంపై చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గానే రావణ్ మాట్లాడారని, అంతేకానీ ఎవరినీ కించపరచలేదని స్పష్టం చేశారు. రావణ్ కొన్ని బూతులు మాట్లాడిన మాట నిజమే అయినా.. అవి కేవలం ఆ వ్యక్తిని ఉద్దేశించి అన్నవే తప్ప, వాటికి ఎలాంటి ఉగ్రవాద వ్యతిరేక చట్టం (UAPA) వర్తించదని, అసలు ఈ కేసులకు ఆ చట్టానికి సంబంధమే లేదని ఆయన పేర్కొన్నారు.

మెట్రోలో సెన్సేషనల్ అవుతున్న  మీమ్ వార్ !
Viral· 4 Jul 2026

మెట్రోలో సెన్సేషనల్ అవుతున్న మీమ్ వార్ !

మెట్రో రైళ్లలో ఇప్పుడు సరికొత్త బుక్ వార్ నడుస్తోంది. మొన్న ఒక యువతి How to Kill Men and Get Away With It అనే బుక్ ను చదవడం సోషల్ మీడియాలో వైరల్ కాగానే మరో యువకుడు భార్యను బొంద పెట్టడం ఎలా ? - RGV బుక్ ను చదువుతు న్నట్లుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లు అలాంటి బుక్కే లేదు. ఫేక్ కవర్తో కూడిన బుక్ తో ఆ యువకుడు మెట్రో రైల్లో కనిపించడం వైరల్ అవుతోంది. భార్యా, భర్తల మధ్య హత్యలు ఎక్కువవుతున్న ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టేలా ఈ వీడియోలు ఉన్నా...ఇది భార్యా భర్తల రిలేషన్స్ లో దిగజారుతున్న విలువలకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.