Latest

ఫారెక్స్ రిజర్వులు పెరిగితే మనకు ఏంటి లాభం?
భారత్ దగ్గరున్న విదేశీ కరెన్సీ నిల్వలు ఇప్పుడు $716.9 బిలియన్కి చేరాయి. ఒక్క వారంలోనే దాదాపు $10 బిలియన్లు పెరిగాయి. ముఖ్యంగా విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారం విలువ పెరగడం దీనికి కారణం. గత ఏడు వారాల్లో మొత్తం దాదాపు $50 బిలియన్లు చేరాయి. ఇంత పెద్ద నిల్వలు ఉంటే డాలర్ కొరత లేదా అంతర్జాతీయ మార్కెట్లలో షాక్స్ వచ్చినప్పుడు దేశానికి ఒక బలమైన ఆర్థిక బఫర్‌గా పనిచేస్తాయి. రిజర్వులు పెరగడం వల్ల రూపాయి మీద ఒత్తిడిని ఎదుర్కోవడంలో RBIకి కూడా కొంత వెసులుబాటు ఉంటుంది.

బంగ్లాదేశ్ ప్రధాని భారత్‌కు వస్తారా?
బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ ఆగస్టు 23–25 మధ్య ఢిల్లీకి వస్తారనే వార్తలు వచ్చినా… టూర్ ఇంకా ఫైనల్ కాలేదు. ఢిల్లీ నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వం భారత్ నుంచి కొన్ని విషయాల్లో స్పందన కోసం ఎదురుచూస్తోందని రెహ్మాన్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. ముఖ్యంగా మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత అంశం రెండు దేశాల మధ్య ఇంకా సెన్సిటివ్‌గా ఉంది. ఇదే సమయంలో రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనను విడుదల చేసి గంటలోపే వెనక్కి తీసుకోవడంతో మరింత గందరగోళం ఏర్పడింది.

మెసేజ్ చదివి… రిప్లై కూడా పంపేస్తుందా?
ఇక ChatGPT కేవలం మనతో చాట్ చేసే టూల్‌గా ఉండకపోవచ్చు. కొత్త Apple Messages ప్లగిన్‌తో Macలో ఉన్న iMessage, SMS, RCS మెసేజ్‌లను వెతకడం, చదవడం, సారాంశం చెప్పడం, రిప్లై రాయడం మాత్రమే కాదు… మన అనుమతితో ఆ మెసేజ్‌ను పంపడం కూడా చేయొచ్చు. అంటే “ఏం రిప్లై ఇవ్వాలి?” అని ఆలోచించే పని కూడా ChatGPTకి అప్పగించొచ్చు. అయితే ఈ ఫీచర్‌కి మెసేజ్‌లు, కాంటాక్ట్స్‌కి ప్రత్యేక అనుమతులు ఇవ్వాలి. పంపే ముందు మెసేజ్, ఎవరికి పంపాలో యూజర్‌కి చూపించి అనుమతి తీసుకోవడం డిఫాల్ట్‌గా ఉంటుంది.

AI మన శరీరంలో ఏం జరగబోతోందో ముందే చెప్పగలదా?
ఒక కొత్త మందు నిజంగా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఇప్పటివరకు ల్యాబ్‌లో ఎన్నో పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు AI మాత్రం ఆ ప్రక్రియలో కొన్ని విషయాలను ముందే అంచనా వేస్తోంది. ప్రోటీన్లు ఎలా మారతాయి, కణాల్లో ఎలాంటి మార్పులు రావొచ్చు, ఒక మందు వాటిపై ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి AI మోడళ్లను వాడుతున్నారు. ఈ రంగంలోకి వస్తున్న స్టార్టప్‌లు భారీ జీవసంబంధ డేటాను విశ్లేషించి, పరిశోధకులకు ఉపయోగపడే క్లూస్‌ను వేగంగా గుర్తిస్తున్నాయి. కొత్త మందుల కోసం వెతికే సమయాన్ని తగ్గించడంలో AI కీలకంగా మారొచ్చు.

ఆడపిల్లల వెంటపడితే కటకటాల వెనక్కే
AP: మైనర్ బాలికను ఏడాదిగా వేధించిన ఆనందబాబు(24)ను కృష్ణా జిల్లా మైలవరం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. BNS, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు. నిందితుడి వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, కత్తి, నేరానికి వాడిన బైక్‌ను సీజ్ చేశారు. నిందితుడి ప్రవర్తనను బట్టి అతనిపై రౌడీషీట్ తెరవడానికి ప్రతిపాదన పంపే అంశాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

బావిలో పడ్డ ట్రాక్టర్.. డ్రైవర్ స్పాట్ డెడ్
TG : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బావపూర్ గ్రామంలో తీవ్ర విచారం జరిగింది. పొలం దున్నుతున్న టైమ్‌లో ట్రాక్టర్‌ను రివర్స్ తీస్తుంటే అన్‌ఫార్చునేట్‌గా కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో డ్రైవర్ గంగాధర్ ట్రాక్టర్‌తో సహా బురదలో ఇరుక్కుపోయి స్పాట్‌లోనే చనిపోయాడు. పోలీసులు, గ్రామస్తులు అక్కడికి వచ్చి సహాయక పనులు చేశారు. గంగాధర్ చనిపోవడంతో ఊళ్లో అందరూ తీవ్రంగా బాధపడుతున్నారు.

బావిలో పడిన ట్రాక్టర్
TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బావపూర్లో విషాదం నెలకొంది. పొలం దున్నుతున్న సమయంలో ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడిపోయింది. ప్రమాదంలో డ్రైవర్ గంగాధర్ ట్రాక్టర్‌తోపాటు బావిలోని బురదలో చిక్కుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఓటరు నమోదుకు మంచి అవకాశం
AP : గుంటూరు జిల్లాలో ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారు. ఓటర్లు తమ వివరాలు చూసుకొని, కొత్తగా పేరు నమోదుకు, మార్పులు చేర్పులకు 6, 7, 8 ఫారాలు ఇచ్చి సరిచేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.

కనీస రోడ్లు,సదుపాయాలు లేక స్థానిక ప్రజలు నరకయాతన
AP: తిరుపతి జిల్లా సత్యవేడు మండలం వెంకటరాజులకండ్రిగలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిమెంట్ రోడ్లు లేక వర్షాలకు రహదారులు బురదమయమవుతున్నాయని, రోడ్లు ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అటవీ ప్రాంతం కావడంతో పాములు సంచరిస్తున్నా వీధి దీపాలు సక్ర మంగా వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
AP: తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిని అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ పోలీసులు సకాలంలో గుర్తించారు. అర్బన్ సీఐ వెంకట చలపతి ఆదేశాలతో ఎస్‌ఐ చండ్రాయుడు సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి బాలుడు జగనన్న కాలనీలో ఉన్నట్లు గుర్తించారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

వెలుగొండ ప్రాజెక్ట్ టైల్ రన్ వాయిదా
AP: మార్కాపురం జిల్లా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఈనెల 22న నిర్వహించాల్సిన ట్రయల్ రన్ వాయిదా పడింది. రెండో సొరంగంలో పనులు చేస్తుండగా ఇటీవల ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మృతి చెందడంతో రెండు, మూడు రోజులపాటు పనులను నిలిపివేశారు. కొన్ని పనులు పెండింగ్ ఉండటంతో రేపు జరగాల్సిన ట్రయల్ రన్ను అధికారులు వాయిదా వేశారు. పెండింగ్ పనులు పూర్తయిన తర్వాత కొత్త తేదీని ఖరారు చేయనున్నట్లు అధికారులు చెప్పారు

త్వరలో మనం కూడా స్పేస్‌కి వెళ్లొచ్చా?
ఇప్పటివరకు స్పేస్‌కి వెళ్లడం అంటే ఆస్ట్రోనాట్స్‌కి మాత్రమే. కానీ చైనా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. అక్కడి ప్రైవేట్ కంపెనీలు సాధారణ వ్యక్తులను కొన్ని నిమిషాల పాటు అంతరిక్ష అంచుల వరకు తీసుకెళ్లే ప్రయాణాలపై పని చేస్తున్నాయి. ఒక కంపెనీ 2028 నాటికి తొలి ప్రయాణాలను ప్లాన్ చేస్తూ, ఇప్పటికే టికెట్ల బుకింగ్ కూడా మొదలుపెట్టింది. మరోవైపు రాకెట్‌లను తిరిగి ల్యాండ్ చేసి మళ్లీ వాడే టెక్నాలజీ కూడా వేగంగా అభివృద్ధి చేస్తోంది. దీంతో ప్రయోగాల ఖర్చు తగ్గితే స్పేస్ టూరిజం మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై నిఘా పెంచాలి
మంచిర్యాల జిల్లా ఆన్‌లైన్ ద్వారా ఇసుక సరఫరాను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. జైపూర్ వేలాల ఇసుక రీచ్‌ను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి సకాలంలో ఇసుక అందించాలని సూచించారు. అక్రమ రవాణా, నిల్వలపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు

దాతల సహకారంతో అదనపు తరగతిగదులు ప్రారంభం
AP: గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రారంభించారు. నిర్మాణానికి కృషి చేసిన గ్రామ సీనియర్ నాయకుడు వాసిరెడ్డి జయరామయ్యను అభినందించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు.

30 వేల మంది ఓటర్లకు రెండో దశ SIR నోటీసులు
మంచిర్యాల్ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 30 వేల మంది ఓటర్లకు రెండో దశ SIRలో నోటీసులు అందనున్నాయని BJP జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. కిష్టంపేటలోని BMR గార్డెన్లో జరిగిన SIR వర్క్‌షాప్‌లో రాష్ట్ర SIR కన్వీనర్ ఆంథోనీ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. నోటీసులు అందినవారికి కార్యకర్తలు అండగా ఉండి సరైన సమాధానాలు సమర్పించేలా చూడాలన్నారు.

ఢిల్లీలో H1N1... ఒక్కరోజులో 114 కేసులు!
ఢిల్లీలో ఫ్లూ కేసులు ఒక్కసారిగా పెరగడంతో ఇప్పుడు ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. ఆగస్టు 20న ఒక్కరోజే 159 ఇన్‌ఫ్లుయెంజా కేసులు నమోదైతే, అందులో 114 H1N1 కేసులే ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఢిల్లీలో H1N1 కేసుల సంఖ్య 1,777కి చేరింది. వర్షాలు, ఉక్కపోత, మారుతున్న వాతావరణం, ఎక్కువగా ఇండోర్‌లో గడపడం వల్ల ఫ్లూ వ్యాప్తి పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లాంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు… కానీ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.

రైలులో సీటు కింద సూట్‌కేసుల్లో గంజాయి పట్టివేత
TG: సాయి షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంతో RPF పోలీసులు, నిజామాబాద్ ఎక్సైజ్ SHO ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు సీటు కింద రెండు సూట్‌కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తుండగా పట్టుకుని సోదా చేశారు. 24.3 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన గణేష్ పోలి(20), దీపక్ సాహు(21)లను అరెస్ట్ చేశారు.

ఆసిఫాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
TG : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ బజార్‌వాడి కాలనీలో రేషన్ షాపులో లబ్ధిదారులకు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ MD అహ్మద్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సేవలు తేలిగ్గా అందించేందుకే ఈ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తున్నామని, ఇంకా తీసుకోని వారు వెంటనే తమ రేషన్ డీలర్‌ను కలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, BRS నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

రహదారి సమస్య కోసం వినతి ఇచ్చిన గిరిజనులు
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి(మం) వలస గురువు రహదారి సమస్యను పరిష్కరించి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిసిసి, చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తాము నిత్యం వినియోగించే రహదారి చాలా కాలంగా సమస్యాత్మకంగా ఉందని తెలిపారు. రహదారి సక్రమంగా లేకపోవడంతో గ్రామస్తులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పేదింటి యువతి వివాహానికి అండగా ఆలయ ఫౌండేషన్
TG: పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన సోదరి కల్లెడ దివ్య వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆలయ ఫౌండేషన్‌కు తెలియజేయడంతో మాజీ కార్పొరేటర్ పుష శివ కుమార్ దాతల సహకారంతో రూ.35,000 ఆర్థిక సాయం అందించారు. భోజన ఏర్పాట్లు కూడా చేశారు. రాజ్యలక్ష్మి కాలనీవాసులు, స్వచ్ఛంద సంఘాల సభ్యులు గొలివాడ చంద్రకళ ఇతర సభ్యులు కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై దుష్ప్రచారం మానుకోవాలి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ ‘కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం ప్రచురించేందుకు ప్రయత్నిస్తున్న హమారా ప్రసాద్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి అంబేద్కర్ వాదిపై ఉందన్నారు. తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలతో పాటు చట్టపర చర్యలు తీసుకుంటామన్నారు.