Latest

లడఖ్ “Gen-Z” వీడియోలో కొత్త ట్విస్ట్
ఐదు గంటలు వెయిట్ చేయడంతో లడఖ్‌లో భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మహిళా టూరిస్ట్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. “We are Gen Z” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే మహిళ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీస్, లడఖ్ పోలీసులకు క్షమాపణ చెప్పింది. రోడ్ ఎందుకు మూసేశారో తనకు తెలియదని, గంటల తరబడి వేచి ఉండటంతో కోపంలో అలా మాట్లాడానని ఆమె చెప్పింది. వైరల్ అయిన కొన్ని సెకన్ల వీడియో వెనుక పూర్తి కథ ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి చూపించింది.

తాళం వేసిన మూడు ఇళ్లలో చోరీ!
TG: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని వైఎన్ కాలనీలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చోరీలు జరిగాయి. అర్ధరాత్రి ముసుగులు ధరించిన ముగ్గురు అనుమానితులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మూడు ఇళ్లలో కలిపి సుమారు 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భూ రీసర్వే, గృహ నిర్మాణంపై మంత్రి సమీక్ష
TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో చేపడుతున్న భూ రీసర్వే, గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల పనితీరును సమీక్షిస్తూ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ పేరుపై ఉన్న SIMలపై కొత్త రూల్!
మీరు SIM మార్చుకునే ముందు ఒకసారి ఇది తెలుసుకోవాలి. ఆగస్టు 24 నుంచి మీ పేరుపై ఇప్పటికే 9 మొబైల్ కనెక్షన్లు ఉంటే కొత్త SIM తీసుకోవడంపై పరిమితి ఉండనుంది. కొత్త కనెక్షన్ ఇచ్చే ముందు మీ పేరుపై ఉన్న నంబర్లను టెలికాం కంపెనీలు చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్ ప్రధానంగా ఇతరుల పేర్లపై SIMలు తీసుకుని జరిగే మోసాలను తగ్గించడానికే. సాధారణంగా ఒకటి, రెండు SIMలు వాడేవారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ మీ పేరుపై తెలియకుండా ఏదైనా నంబర్ ఉంటే? అదే ఇప్పుడు చెక్ చేసుకోవాల్సిన అసలు విషయం.

బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు
మంచిర్యాల్ జిల్లాలోని BC వర్గాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు 100% రాయితీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్నట్లు జిల్లా BC అభివృద్ధి అధికారిణి నీరటి రాజేశ్వరి తెలిపారు. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 13లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను గ్రామీణులు MPDO, పట్టణవాసులు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

MRO కార్యాలయం కోసం నడిరోడ్డుపై వంటావార్పు
ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ కార్యాలయాలుండాలి కానీ, ఎక్కడో ఊరి చివరన నిర్మిస్తామంటే ఎట్ల అని ప్రజలు అడుగుతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మండల కార్యాలయాలు మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలనే డిమాండు ఊపందుకుంటున్నది. తాజాగా మంచిర్యాల జిల్ల కన్నెపల్లి మండల కేంద్రంలోనే MRO కార్యాలయం నిర్మించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రజలు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు రోడ్డెక్కారు. శుక్రవారం ఆటో స్టాండ్ వద్ద నడిరోడ్డుపై వంటావార్పు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

స్కూళ్లలో Fire Safety ఉండాల్సిందే..
TG : నిర్మల్ జిల్లాలోని స్కూల్, కాలేజీల్లో ఫైర్ సేఫ్టీ నియమాలు సరిగ్గా అమలు చేయాలని AIPSU జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ దారులు లేని విద్యాసంస్థలపై విద్యా, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే వెళ్లి తనిఖీలు చేయాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యం చేసి స్పందించకపోతే విద్యార్థుల రక్షణ కోసం పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు.

STPCలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
TG: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ల పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో జీఎం నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్. విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షులు తాటిపర్తి సాయికృష్ణ మాట్లాడుతూ పవర్ మెక్ కంపెనీ కార్మికులకు రావాల్సిన ఇంక్రిమెంట్లను చెల్లించాలని కోరారు.
నూకపల్లిలో అంగన్‌వాడీ కేంద్రం పరిశీలన
TG: జగిత్యాల జిల్లా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. కేంద్రంలో చిన్నారుల సంఖ్య, వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు.

‘కలశ్ వందన్ అభియాన్’ పోస్టర్ ఆవిష్కరణ
TG: జగిత్యాల జిల్లా ధర్మపురి బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ‘కలశ్ వందన్ అభియాన్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర నాయకుడు దామెర రామ్ సుధాకర్‌రావు మాట్లాడుతూ సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈనెల 23న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణలోని 33 జిల్లాలకు పవిత్ర కలశాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

డంపు యార్డ్ జీవో రద్దు కోసం పోరాటం
TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన డంపియార్డు జీవో రద్దు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతానని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్‌లో ఆయనను కలిసిన సిద్దాపూర్ డంపు యార్డ్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు రాంబల్ నాయక్, పినపాక ప్రభాకర్, తిరుమలయ్య తదితరులు డంపు యార్డ్ పై చేస్తున్న పోరాటంలో తమకు సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. 10 గ్రామాలను నష్టం చేసే ఈ డంపు యార్డ్ ప్రతిపాదనను బీఆర్ఎస్ తరఫున అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
TG: జోన్-III ఇన్‌చార్జ్ డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులతో చర్చించారు. పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, గంజాయి సరఫరా మూలాలను ఛేదించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సీసీ కెమెరాల ఏర్పాటును పెంచాలని ఆదేశించారు.

ఆగస్టు 30, 31 తేదీల్లో KVPS జిల్లా శిక్షణా తరగతులు
కుల వివక్ష లేని సమాజం, సామాజిక న్యాయం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఆగస్టు 30, 31 తేదీలలో 'జిల్లా సామాజిక శిక్షణా తరగతులు' నిర్వహించనున్నారు. ఈ తరగతులను జయప్రదం చేయాలని KVPS ప్రతినిధులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ హాజరుకానున్నారు. KVPS వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్లయ్య, జిల్లా అధ్యక్షులు రాయల్స్ నవీన్ కుమార్ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.

స్కూల్ కి కలెక్టర్ విజిట్.. 100 బెంచీలు మంజూరు
TG : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ ZPHS ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ కుమార్ దీపక్ విజిట్ చేశారు. క్లాస్ రూమ్‌లను చూసి, పిల్లల చదువులు, ఉపాధ్యాయులు చెప్పే విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు 100 డ్యూయల్ డెస్క్ బెంచీలను మంజూరు చేశారు. Govt స్కూళ్లను బాగు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో MPDOతో పాటు స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు..

తెలంగాణాకు CJP ’స్కూల్ ఠీక్ కరో’ సెగ?
CJP నడుపుతున్న స్కూల్ ఠీక్ కరో ఉద్యమ సెగ తెలంగాణా సర్కారును తాకినట్లుంది. ఎక్కువ జిల్లాల్లో కలెక్టర్లు బడిబాట పడుతున్నారు. ఇందులో భాగంగానే జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల విద్యార్థుల స్థితిగతులు బోధనా పద్ధతులు, తరగతి గదులపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలకు 100 డ్యూయల్ డేస్కు బెంచీలను మంజూరు చేయించారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

పంచదార(చక్కెర) నిల్వలపై కేంద్రం కొత్త రూల్స్
కొద్ది రోజులుగా పంచదార(చక్కెర) ధరలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో సప్లై తగ్గినట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఈ టైంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార నిల్వలపై ఆంక్షలు విధించింది. నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పంచదారను ముడిసరుకుగా వాడే ఏ బల్క్ వినియోగదారుడైనా 15 రోజులకు మించి నిల్వలు ఉంచుకోకూడదని ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఈ రూల్స్ అమల్లోకి ఉంటాయని చెప్పింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది.

ఈ నెల 24న ఆటోల బంద్
ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వాలని, అలాగే ఆర్టిసికి విద్యుత్ ఆటోలు ఇవ్వాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే మూడు ప్రధాన డిమాండ్లతో ఈనెల 24న తెలంగాణాలో ఆటో డ్రయివర్లు బంద్ పాటించనున్నారు. ఈ మేరకు బంజర ఆటో డ్రైవర్ సంఘం, జేఏసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ పాల్గొని బందుకు సంబంధించిన పోస్టరును విడుదల చేశారరు. ఈ కార్యక్రమం జే.పుల్లారావు అధ్యక్షతన జరిగింది.

నిధుల దుర్వినియోగంపై సర్పంచ్‌కు షోకాజ్ నోటీస్
TG: కామారెడ్డి జిల్లా ఫరీద్‌పేట్ గ్రామపంచాయతీలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ చేపట్టారు. కలెక్టరేట్ జారీ చేసిన షోకాజ్ నోటీసులో శానిటేషన్ పనులకు సంబంధం లేని ‘ఓం సాయి ఎలక్ట్రికల్స్’ సంస్థకు రూ.48,670 చెల్లించినట్లు అధికారులు జరిపిన విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసి అధికారులు వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.
రాజంపేటలో దారుణ హత్య
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని శుద్ధగుంతల ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. చిలకాల పెంచలయ్య అనే వ్యక్తిని సాధుశెట్టి కత్తితో దాడి చేసి పొడిచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. కత్తిపోట్లకు గురైన పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫీజు బకాయిలపై బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా
TG: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ‘ఫీజు బకాయి..బీజేపీ లడాయి’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో BJYM కార్యకర్తలు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మాదిగ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం మంత్రికి వినతి
TG: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కప్పరావుపేటలో మాదిగ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సర్పంచ్ మేకల పోచయ్య ఆధ్వర్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మాదిగ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.