Latest

మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. విజయ్ మరో కీలక నిర్ణయం!
National· 19 Aug 2026

మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. విజయ్ మరో కీలక నిర్ణయం!

మహిళా ప్రభుత్వ ఉద్యోగుల కోసం తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డకు కూడా 365 రోజుల పెయిడ్ మ్యాటర్నిటీ లీవ్స్ కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి డి. సరత్‌కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటివరకు మూడో బిడ్డకు 12 వారాల సెలవు మాత్రమే ఉండేది. మొదటి ఇద్దరు పిల్లలకు వర్తించే 365 రోజుల సెలవులను మూడో బిడ్డకూ కూడా ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులు డెలివరీ తర్వాత శిశు సంరక్షణకు ఈ నిర్ణయం మరింత తోడ్పడనుంది.

తులం బంగారం హామీ ఏమైంది? : సండ్ర
TG· 19 Aug 2026

తులం బంగారం హామీ ఏమైంది? : సండ్ర

TG: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన భారీ నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా కేసీఆర్‌ ఈ పథకాలను ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణలక్ష్మి కింద సాయం, తులం బంగారం అందించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సండ్ర డిమాండ్ చేశారు.

AI మనల్ని Smart చేస్తుందా… లేక Lazyగానా?
Technology· 19 Aug 2026

AI మనల్ని Smart చేస్తుందా… లేక Lazyగానా?

AIకి మన పనులన్నీ అప్పగించేస్తే.. మెదడుకి పని తగ్గిపోతుందా? ఒక మెయిల్ రాయడం నుంచి ఐడియా చెప్పడం వరకు AI పనులను సెకన్లలో చేసి పెడుతోంది. దీంతో టైమ్ సేవ్ అవుతుంది. కానీ ప్రతి సందేహానికి AIనే అడిగి, ఆలోచించే పనినీ దానికి అప్పగిస్తే.. మనమే ఆలోచించి సమస్యను పరిష్కరించే అలవాటు తగ్గొచ్చు. 2025లో 319 మంది జ్ఞాన ఆధారిత ఉద్యోగులపై అధ్యయనంలో, AIపై ఎక్కువ నమ్మకం ఉన్నవాళ్లు క్రిటికల్ థింకింగ్‌కు తక్కువ శ్రమ పెట్టినట్లు కనిపించింది. అంటే AI మంచిదా చెడ్డదా అనేది కాదు.. దాన్ని ఎలా వాడుతున్నామన్నదే అసలు విషయం.

SC వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఆగదు: రత్నాకర్
AP· 19 Aug 2026

SC వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఆగదు: రత్నాకర్

AP: SC వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే రాజకీయ కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా. RS.రత్నాకర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. SC వర్గీకరణతో మాల సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ప్రయోజనాలను మరింత విభజించడం వల్ల దళితుల మధ్య ఐక్యత దెబ్బతింటుందని అన్నారు. దేశ సంపద, అధికార వ్యవస్థల్లోనూ సామాజిక న్యాయం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పంటలసాగులో మార్పులు తప్పవు: గరిమా అగర్వాల్
TG· 19 Aug 2026

పంటలసాగులో మార్పులు తప్పవు: గరిమా అగర్వాల్

TG: ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే పరిస్థితులపై ప్రజలు, రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి, వైద్య ఆరోగ్య అంశాలపై రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను అధికారులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ప్రతి గ్రామానికి అవగాహన సామగ్రి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆయిల్‌పామ్‌, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.

సామాజిక న్యాయమే మా ఆశయం: రేవంత్‌రెడ్డి
TG· 19 Aug 2026

సామాజిక న్యాయమే మా ఆశయం: రేవంత్‌రెడ్డి

TG: బహుజనులు, కల్లుగీత కార్మికులు, గౌడన్నల అండదండలతో వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలిచి కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని CM రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం, బహుజనులకు అధికారం తమ ప్రజా ప్రభుత్వ ఆశయమని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్‌ పోరాట స్ఫూర్తిని ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ట్యాంక్‌బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు.

విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాకు పిలుపు
TG· 19 Aug 2026

విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాకు పిలుపు

TG: రాష్ట్రంలోనే అతిపెద్ద విద్యుత్ కేంద్రం యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్(YTPS) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు సమరశంఖం పూరించారు. PRCతోపాటు మొత్తం 14డిమాండ్ల సాధన కోసం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ‘చలో హైదరాబాద్’ పేరుతో విద్యుత్తుసౌధలో మహాధర్నా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యుత్తు సంస్థలకు చెందిన ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆర్టిజన్లు పెద్దసంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని JAC చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు.

యువతకు భారత్‌లో అపార అవకాశాలు: నితిన్ నబీన్
AP· 19 Aug 2026

యువతకు భారత్‌లో అపార అవకాశాలు: నితిన్ నబీన్

AP: యువశక్తితోనే నవభారత నిర్మాణం సాధ్యమని BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. విశాఖ బీచ్ రోడ్డులోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించిన ‘యువ సంవాద్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత తమ శక్తి, ప్రతిభను సృజనాత్మక దిశలో వినియోగించాలని సూచించారు. వ్యవస్థను విమర్శించడం కంటే పరిష్కారాలను చూపాలని, నిరాశకు బదులు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్టార్టప్‌లు, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, రక్షణ రంగాల్లో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

రూల్స్ కమిటీ తొలి సమావేశం
TG· 19 Aug 2026

రూల్స్ కమిటీ తొలి సమావేశం

TG: శాసనమండలి సమావేశాలు మరింత సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సభా నియమాల్లో అవసరమైన మార్పులు చేపట్టాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. శాసనమండలిలో నిర్వహించిన రూల్స్ కమిటీ తొలి సమావేశంలో మాట్లాడారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసమస్యలను సభ్యులు సమర్థంగా ప్రస్తావించేలా అనువైన వాతావరణం ఉండేలా నిబంధనలు రూపొందించాలన్నారు. చట్టసభలను క్రమబద్ధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్వహించడంలో రూల్స్ కమిటీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.

22ఏ భూముల రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం: రేవంత్
TG· 19 Aug 2026

22ఏ భూముల రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం: రేవంత్

TG: 22ఏ భూముల విషయంలో CM రేవంత్ రెడ్డి కీలక భరోసా ఇచ్చారు. ప్రైవేట్ భూముల యజమానులు రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. 22ఏ నిషేధిత భూముల రెజిస్ట్రేషన్లపై హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తి నిషేధిత జాబితాలో ఉంటే అధికారులు రెండురోజుల్లో పరిశీలించాలన్నారు. 22ఏ జాబితాలను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి, తప్పులు లేకుండా తుది జాబితా రూపొందించాలని ఆదేశించారు.

BCల రాజకీయ భవిష్యత్తుపై బిగ్ డెసిషన్: CM
AP· 19 Aug 2026

BCల రాజకీయ భవిష్యత్తుపై బిగ్ డెసిషన్: CM

AP: BCలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే కీలక నిర్ణయాన్ని CM చంద్రబాబు శాసనసభ వేదికగా ప్రకటించారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర జనాభాలో 50.14 శాతం ఉన్న బీసీలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమని CM తెలిపారు. మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజాపరిషత్‌లను 28కి పెంచే నిర్ణయాన్ని వెల్లడించారు.

మీకు ఏది ఇష్టమో మీ ఫోన్‌కి ఎలా తెలుస్తుంది?
Technology· 18 Aug 2026

మీకు ఏది ఇష్టమో మీ ఫోన్‌కి ఎలా తెలుస్తుంది?

ఫోన్ ఓపెన్ చేసి “రెండు నిమిషాలు” స్క్రోల్ చేద్దాం అనుకుంటారు. కానీ చూస్తుండగానే అరగంట దాటిపోతుంది. ఇదంతా కేవలం మన ఇష్టం వల్లే కాదు. మనం ఏ వీడియో దగ్గర ఆగుతున్నాం, ఏది లైక్ చేస్తున్నాం, ఏది స్కిప్ చేస్తున్నాం, ఎంతసేపు చూస్తున్నాం… ఇవన్నీ యాప్‌ల ఆల్గోరిథమ్ గమనిస్తుంటుంది. ఆ డేటాతో మనకు తర్వాత ఏ కంటెంట్ నచ్చొచ్చో అంచనా వేసి అదే ముందుకు తెస్తుంది. అందుకే ఒక చిన్న స్క్రోల్ పెద్ద సమయంగా మారుతుంది. మనకు కంటెంట్ ఎంచుకుంటున్నామనిపిస్తుంది… కానీ మన కోసం కూడా కంటెంట్ ఎంచుకోబడుతోంది.

తల్లిదండ్రులు గొడవపడితే.. పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
Parenting· 18 Aug 2026

తల్లిదండ్రులు గొడవపడితే.. పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

తల్లిదండ్రులు గొడవపడితే.. “పిల్లలే కదా, వాళ్లకేం అర్థం అవుతుంది?” అని అనుకుంటాం. కానీ వాళ్లకు చాలా విషయాలు అర్థమవుతాయి.😕 ఇంట్లో తరచూ అరుపులు, తిట్టుకోవడం, గొడవలు జరిగితే వాళ్లలో భయం, టెన్షన్ పెరగొచ్చు. కొందరైతే “నా వల్లే ఇలా జరుగుతుందా?” అని కూడా ఫీల్ అవుతారు. దాని ప్రభావం నిద్ర, చదువు, ప్రవర్తనపైనా పడొచ్చు. ప్రతి డిసగ్రీమెంట్ సమస్య కాదు.. కానీ తరచూ, తీవ్రంగా ఉంటే మాత్రం పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అందుకే వాళ్ల ముందు గొడవపడకుండా.. సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం.❤️

బ్లడ్ క్యాన్సర్‌తో విద్యాకుసుమం..కదిలిన విద్యార్థిలోకం
AP· 18 Aug 2026

బ్లడ్ క్యాన్సర్‌తో విద్యాకుసుమం..కదిలిన విద్యార్థిలోకం

AP: చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, పేదరికంతో పోరాడుతూ ఇంటర్ ఫస్టియర్‌లో 446 మార్కులు సాధించాడు. ఇప్పుడు ఆ విద్యార్థి జీవితం బ్లడ్ క్యాన్సర్‌తో ఊగిసలాడుతోంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బుడార్సింగి పంచాయితీ నరసింగపురం గ్రామానికి చెందిన సారక శివకుమార్ ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికోసం తోటి విద్యార్థులు గ్రామాలు తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. విద్యార్థి వైద్య ఖర్చుల నిమిత్తం సహాయార్థం ఫోన్‌పే నెంబర్ 8074560021 కు సంప్రదించాలన్నారు.

ఆకలితో ఉన్నవారికి అండగా.. పోలీసుల కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
Motivational· 18 Aug 2026

ఆకలితో ఉన్నవారికి అండగా.. పోలీసుల కమ్యూనిటీ ఫ్రిజ్‌లు

AP: విశాఖ నగరంలో ఆకలితో ఉన్నవారికి వైజాగ్ సిటీ పోలీసులు అండగా నిలుస్తున్నారు. ‘మిషన్ జ్యోతిర్గమయ’లో భాగంగా పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్‌లను ప్రారంభించారు. వీటి ద్వారా నిరాశ్రయులు, ఆకలితో ఉన్నవారు, అవసరమైన వారికి ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. మిగిలిన ఆహారం వృథా కాకుండా అవసరమైన వారికి చేరేలా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఈ సేవ కొనసాగుతోంది.

విద్యుత్ ఉద్యోగులు JAC ఆధ్యర్యంలో మహాధర్నా పోస్టర్స్ విడుదల
Local· 18 Aug 2026

విద్యుత్ ఉద్యోగులు JAC ఆధ్యర్యంలో మహాధర్నా పోస్టర్స్ విడుదల

TG: తెలంగాణ పవర్ ఎంప్లాయ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్యర్యంలో చలో విద్యుత్ సౌదా మహా ధర్నా పోస్టర్‌ని నాగర్ కర్నూల్ సర్కిల్ ఆవరణలో విద్యుత్ ఉద్యోగులు JAC ఆధ్యర్యంలో విడుదల చేసారు. ఉద్యోగులు ఆర్టిజన్లు, పెన్సన్‌కు సంబంధిన PRC-2026 వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి టర్నల్ పవర్ ప్లాంట్‌ని ప్రెవేట్‌పరం చెయ్యవద్దని అన్నారు, ఆర్టిజన్ల APSEB రూల్స్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 1999 నుండి 2004 బ్యాచ్ ఉద్యోగులకు EPF to GPF అమలు చేయాలని కోరారు.

చంద్రశేఖరన్ తర్వాత ఎవరు? టాటాలో కొత్త టెన్షన్!
Technology· 18 Aug 2026

చంద్రశేఖరన్ తర్వాత ఎవరు? టాటాలో కొత్త టెన్షన్!

TATA గ్రూప్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది.. చంద్రశేఖరన్ తర్వాత ఎవరు? ఫిబ్రవరి 2027లో తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగనని ఎన్. చంద్రశేఖరన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు, ఆయన వారసుడిని ఎంపిక చేసేందుకు TATA ట్రస్ట్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతలో ఈరోజు జరగాల్సిన టాటా సన్స్ వార్షిక సమావేశం కూడా అవసరమైన సభ్యులు లేక వాయిదా పడింది. దీంతో కొత్త బాస్ ఎవరు అన్నదానితో పాటు.. TATA లోపల అసలు ఏం జరుగుతోందన్న ఆసక్తి మరింత పెరిగింది.

జీవో నెంబర్ 97 తక్షణమే రద్దు చేయాలి
Local· 18 Aug 2026

జీవో నెంబర్ 97 తక్షణమే రద్దు చేయాలి

TG: G.O 97ను తక్షణమే రద్దు చేయాలని, ⁠ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను Young India Skills University పరిధిలోకి తీసుకెళ్లే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కన్వీనర్ బి.మల్లేష్ అన్నారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ధర్నా నిర్వహించారు. శక్తి పథకం వెనక్కి తీసుకోవాలని, SBTET బోర్డును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ ల్యాబ్స్ భవనాలు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలన్నారు. పాలిటెక్నిక్ అధ్యాపకులు సిబ్బంది సర్వీస్ నిబంధనకు రక్షణ కల్పించాలన్నారు.

ప్రారంభం కానున్న పోలీస్ ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియ
Jobs· 18 Aug 2026

ప్రారంభం కానున్న పోలీస్ ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియ

TG: తెలంగాణలో 7437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు 19 ఆగస్టు ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు <a href="https://www.tgprb.in/">వెబ్‌సైట్</a> ద్వారా సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పార్ట్-1 దరఖాస్తుకు ముందుగా ఫోన్లో ఆధార్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

నారాయణగూడ సర్వే భవన్ వద్ద ఉద్రిక్తత
TG· 18 Aug 2026

నారాయణగూడ సర్వే భవన్ వద్ద ఉద్రిక్తత

TG: హైదరాబాద్‌లోని నారాయణగూడ సర్వే భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ రెవెన్యూ లైసెన్స్‌డ్ సర్వేయర్లు కార్యాలయాన్ని ముట్టడించారు. సర్వేయర్లు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం చేతుల మీదుగా లైసెన్స్ పత్రాలు అందించి ఏడాది గడుస్తున్నా, ఇప్పటివరకు తమను విధుల్లోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లోకి చేర్చుకుని, నెలకు ₹30,000 జీతంతో ఉద్యోగ భద్రత కల్పించాలని సర్వేయర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు

అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు
Sports· 18 Aug 2026

అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు

TG: ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు షట్లర్ గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్జున అవార్డులకు ఎంపికైన వాళ్లు రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ క్రీడా పురస్కారాలు–2025 అందుకున్న విజేతలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.