Latest

మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం
Local· 18 Aug 2026

మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం

మారుమూల, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. వాంకిడి మండలం ఇందాని గ్రామంలో గ్రాన్యుల్స్ ఇండియా ఫార్మా కంపెనీ రూ.25 లక్షల సీఎస్‌ఆర్‌ (CSR) నిధులతో నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రానికి ఆమె భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేయడమే ధ్యేయంగా ఈ నిర్మాణం చేపడుతున్నామని, ఇది అందుబాటులోకి వస్తే ఇందాని గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాథమిక వైద్యం సులభంగా అందుతుందన్నారు.

బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ నిరసన
Local· 18 Aug 2026

బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ నిరసన

TG: బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు, DCC అధ్యక్షుడు బీర్ల అయిలయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, విద్యార్థులు, యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు.

G.O.97 శక్తి పథకం రద్దు చెయ్యాలి
Local· 18 Aug 2026

G.O.97 శక్తి పథకం రద్దు చెయ్యాలి

TG: పాలిటెక్నిక్ విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్‌ను ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పడానికి నిరసన చేపడితే, స్పీకర్ పర్యటన ఉందనే కారణంతో అనుమతి నిరాకరించడం ఎందుకు అని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును వినాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని అన్నారు. కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఐటీఐ వారితో సమానం చేసే G.O. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థిని చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
AP· 18 Aug 2026

విద్యార్థిని చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

AP: పల్నాడు జిల్లా మాచవరం మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరి ఇంజనీరింగ్ చదువుకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆర్థిక సహాయం అందించారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి రూ.3,65,500 ఉన్న ఫీజు, బకాయిలను రూ.2.50 లక్షలకు తగ్గించారు. ఇందులో రూ.1.25 లక్షలను ఇప్పటికే చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని వచ్చే ఏడాది చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. కుటుంబ ఖర్చుల కోసం రూ.50 వేలు, విద్యా ఫీజు కోసం రూ.2.50 లక్షలు కలిపి మొత్తం రూ.3 లక్షలను ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి అందించారు.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
AP· 18 Aug 2026

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అక్టోబర్‌ నెలా ఖరులోగా స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ముందు మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది. గతంలో ఇచ్చి న హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించగా, పట్టణ ప్రాంతాల్లో 33.1 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని నిర్ణయించింది.

సెప్టెంబర్ 16 వరకు ఓటర్ల మార్పుకు అవకాశం
TG· 18 Aug 2026

సెప్టెంబర్ 16 వరకు ఓటర్ల మార్పుకు అవకాశం

తెలంగాణలో SIR–2026లో భాగంగా సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు కోసం ఫారం–6, పేరు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఫారం–7, చిరునామా మార్పు, వివరాల సవరణ కోసం ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.

వైద్య కళాశాలలో 39 పోస్టుల రిక్రూట్‌మెంట్
Jobs· 18 Aug 2026

వైద్య కళాశాలలో 39 పోస్టుల రిక్రూట్‌మెంట్

TG: జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 38 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో, ఒక ట్యూటర్ పోస్టును గౌరవ వేతనం పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అధికారులు కోరుతున్నారు. ఆగస్టు 25వ తేదీ ఉదయం 11 గంటలకు గద్వాల ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించే వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. వివరాల కోసం జోగులాంబ గద్వాల జిల్లా అధికారిక <a href="https://gadwal.telangana.gov.in/">వెబ్‌సైట్ </a>పరిశీలించవచ్చు.

భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
Local· 18 Aug 2026

భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

TG: జగిత్యాల జిల్లా కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి పెండింగ్ అంశాలు, సాదా బైనామా, మీసేవ ఫైళ్లను పరిశీలించి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. మీసేవ సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు పూర్తి చేసి ప్రజలకు అందించాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం
Local· 18 Aug 2026

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం

TG: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతామని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. AICC కార్యదర్శి సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించారు. సచిన్ సావంత్ పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

విఐపీ భద్రతలో అప్రమత్తతే కీలకం
Local· 18 Aug 2026

విఐపీ భద్రతలో అప్రమత్తతే కీలకం

TG: విఐపీ భద్రతా విధుల్లో ఉన్న పీఎస్‌ఓలు అప్రమత్తత, క్రమశిక్షణ, సమన్వయంతో పని చేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. కమిషనరేట్‌లో పీఎస్‌ఓలకు విఐపీ భద్రతపై సంక్షిప్త శిక్షణ నిర్వహించారు. ఆరోగ్యం, శారీరక దారుఢ్యంతో పాటు మంచి అలవాట్లు, నిజాయితీ, విశ్వసనీయత పాటించాలని సూచించారు. భద్రతకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, అనుమానాస్పద కదలికలను వెంటనే ఉన్నతాధికారులకు చెప్పాలని ఆదేశించారు.

ఉదయాన్నే నిద్రలేవాలా? ఈ ట్రిక్ వాడండి!
Motivational· 18 Aug 2026

ఉదయాన్నే నిద్రలేవాలా? ఈ ట్రిక్ వాడండి!

ఉదయాన్నే త్వరగా లేవడం వల్ల జీవితంలో క్రమశిక్షణ, గెలుపు సాధ్యమవుతాయి. అయితే బద్ధకాన్ని వదిలి మంచం దిగడం చాలామందికి కష్టంగా ఉంటుంది. దీనికోసం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మెల్ రాబిన్స్ ‘5 సెకన్ల రూల్’ అనే ఒక మంచి ట్రిక్ చెప్పారు. ఉదయం మెలకువ రాగానే రాకెట్ లాంచ్ లాగా మనసులో 5, 4, 3, 2, 1 అని కౌంట్‌డౌన్ చేసుకుని వెంటనే మంచం దిగేయాలి. ఈ చిట్కా బద్ధకాన్ని పోగొట్టడమే కాకుండా, ఆందోళనను, సాకులు చెప్పే అలవాటును వదిలించడానికి అద్భుతంగా పనిచేస్తుందని తెలిపారు.

కంగారు, చిరాకుగా ఉంటోందా?.. కారణం ఇదే కావచ్చు!
Health· 18 Aug 2026

కంగారు, చిరాకుగా ఉంటోందా?.. కారణం ఇదే కావచ్చు!

ఆందోళన, చిరాకు, అలసట వస్తుంటే దానికి కేవలం టెన్షనే కారణం కాకపోవచ్చు, శరీరంలో విటమిన్ బి12 తగ్గడం వల్ల కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ విటమిన్ తగ్గితే మెదడు, నరాల బలం తగ్గి భయం, మూడ్ మారడం వంటి సమస్యలొస్తాయి. మన శరీరం బి12ని సొంతంగా తయారు చేసుకోలేదు. కాబట్టి మనం తినే గుడ్లు, పాలు, పాల పదార్థాలు, చేపలు, చికెన్, మాంసం ద్వారానే దీనిని పొందాల్సి ఉంటుందని తెలిపారు.

పిల్లల కోసం ChatGPT మారుతోంది!
Technology· 18 Aug 2026

పిల్లల కోసం ChatGPT మారుతోంది!

ఇక 13–17 ఏళ్ల వాళ్లు ChatGPT వాడితే.. పెద్దలు వాడే విధంగా అంతా ఒకేలా ఉండదు. OpenAI టీనేజర్ల కోసం ప్రత్యేకంగా ChatGPT for Teensను తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ వయసులో AIని వాడేటప్పుడు కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. అందుకే సున్నితమైన కంటెంట్‌పై అదనపు పరిమితులు, వయసుకు తగ్గ సమాధానాలు ఉంటాయి. అంతేకాదు, తల్లిదండ్రులు కొన్ని సెట్టింగ్స్‌ను తమకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. అంటే.. ChatGPT ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు అనేదాన్ని కూడా పట్టించుకునే దిశగా అడుగు వేసిందన్నమాట.

NTR - త్రివిక్రమ్ కాంబో.. రెండు టైటిల్స్!
Entertainment· 18 Aug 2026

NTR - త్రివిక్రమ్ కాంబో.. రెండు టైటిల్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందనే వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రెండు టైటిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. ‘దేవసేనాపతి’, ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేర్లను రిజిస్టర్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.

కర్నూలులో డ్రోన్ హబ్.. భారీగా ఉద్యోగాలు
AP· 18 Aug 2026

కర్నూలులో డ్రోన్ హబ్.. భారీగా ఉద్యోగాలు

AP: ఈరోజు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీని దేశంలోనే డ్రోన్ తయారీ, పరిశోధన, శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. రూ.5 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశముందన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే 5 వేల మందికి డైరెక్ట్‌గా, 25 వేల మందికి ఇన్‌డైరెక్ట్‌గా ఉపాధి లభిస్తుందని చెప్పారు. రానున్న 2–3 ఏళ్లలో అన్ని ప్లాట్ల కేటాయింపులు పూర్తి చేసి తయారీ ప్రారంభిస్తామని వెల్లడించారు.

తెలంగాణలో MBBS, BDS ప్రవేశాలకు మళ్లీ రిజిస్ట్రేషన్
Education· 18 Aug 2026

తెలంగాణలో MBBS, BDS ప్రవేశాలకు మళ్లీ రిజిస్ట్రేషన్

TG: MBBS, BDS అడ్మిషన్ల కోసం చూస్తున్న స్టూడెంట్స్‌కు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి స్టార్ట్ చేసినట్టు పేర్కొంది. స్టూడెంట్స్ రిక్వెస్ట్‌లను పరిగణంలోకి తీసుకుని ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు మరో అవకాశం కల్పించినట్లు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు అడ్మిషన్ <a href="https://tsmedadm.tsche.in/">పోర్టల్‌</a> చూడొచ్చు.

పసిబిడ్డతో అసెంబ్లీకి ఎమ్మెల్యే.. విమర్శలకు గట్టి కౌంటర్!
National· 18 Aug 2026

పసిబిడ్డతో అసెంబ్లీకి ఎమ్మెల్యే.. విమర్శలకు గట్టి కౌంటర్!

తమిళనాడు అసెంబ్లీకి తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ఎమ్మెల్యే ఆర్. పల్లవి తన పసిబిడ్డతో రావడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. పాపను కేర్‌టేకర్ దగ్గర బయట ఉంచి ఆమె సభకు హాజరవుతున్నారు. దీనిపై కొందరు మెచ్చుకోగా, మరికొందరు 'కేవలం పబ్లిసిటీ కోసమే ఈ సీన్లు చేస్తున్నారు' అని కామెంట్లు చేశారు. ఈ విమర్శలపై ఎమ్మెల్యే స్పందిస్తూ 'పాప చిన్నది, ఇంట్లో ఒంటరిగా వదిలేసి రాలేను. తల్లిగా నా బాధ్యత చూసుకుంటూనే, ఎమ్మెల్యేగా పని చేయడంలో తప్పేంటి?' అని అడిగారు. ఎవరి పరిస్థితి తెలుసుకోకుండా ట్రోల్ చేయడం సరికాదన్నారు.

బిహార్‌లో భారీగా టీచర్ పోస్టుల భర్తీ!
Jobs· 18 Aug 2026

బిహార్‌లో భారీగా టీచర్ పోస్టుల భర్తీ!

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు బిహార్ ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ద్వారా ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRE 4.0) కింద ఏకంగా 32,388 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1 నుంచి 12వ తరగతి వరకు పాఠాలు చెప్పే ప్రైమరీ, సెకండరీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు <a href="https://indianexpress.com/article/education/bihar-bpsc-tre-4-teacher-recruitment-advertisement-out-vacancies-posts-important-dates-bpsc-bihar-gov-in-10838712/">చెప్పారు</a>.

మున్సిపల్ కార్మికుల నిరసన
Local· 18 Aug 2026

మున్సిపల్ కార్మికుల నిరసన

AP: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు.. మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, మున్సిపల్, పౌర సేవల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు .

హార్దిక్ పాండ్యా నుంచి క్రాంతి గౌడ్‌కు స్పెషల్ గిఫ్ట్!
Sports· 18 Aug 2026

హార్దిక్ పాండ్యా నుంచి క్రాంతి గౌడ్‌కు స్పెషల్ గిఫ్ట్!

భారత మహిళల క్రికెటర్ క్రాంతి గౌడ్ తన అభిమాన ఆటగాడైన హార్దిక్ పాండ్యా నుంచి గొప్ప కానుక అందుకుంది. బెంగళూరులో వీరిద్దరూ కలిసినప్పుడు, క్రాంతి పుట్టినరోజు సందర్భంగా పాండ్యా తన సంతకంతో కూడిన 33వ నంబర్ జెర్సీని ఇచ్చాడు. తాను ఎంతగానో అభిమానించే పాండ్యా నుంచి జెర్సీ అందడంతో క్రాంతి గౌడ్ చాలా ఆనందించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.

నటి నమిత వెయిట్ లాస్ సీక్రెట్!
Health· 18 Aug 2026

నటి నమిత వెయిట్ లాస్ సీక్రెట్!

సినీ నటి <a href="https://www.instagram.com/reel/Dbx2IqMJr8k/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ==">నమిత</a> 3 నెలల్లో 10 కేజీల బరువు తగ్గి షాక్ ఇచ్చారు. క్రాష్ డైటింగ్, పస్తులు లేకుండా కేవలం సౌత్ ఇండియన్ డైట్, ఇంటెన్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తోనే ఇది సాధ్యమైందని చెప్పారు. కఠినమైన డైట్ వల్ల మజిల్స్ వీక్ అవుతాయని, హెల్దీగా బరువు తగ్గాలంటే ప్రాపర్ ఫుడ్, వర్కవుట్స్ రెండూ ముఖ్యమని వివరించారు. 'స్కల్ప్ట్ యువర్ బాడీ' డైటీషియన్ ధరణి గైడెన్స్‌తో బరువు తగ్గడం చాలా హ్యాపీగా ఉందంటూ ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.