Latest

పాడి రైతులకు అండగా 25 ఏళ్ల సేవలు
TG: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా డెయిరీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహించారు. 25 ఏళ్ల డెయిరీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, మేనేజర్ భాస్కర్ రెడ్డి, డెయిరీ సిబ్బంది, మహిళా సభ్యులు, పాడి రైతులు పాల్గొన్నారు. భవిష్యత్‌లో పాల సేకరణను విస్తరించడం, డెయిరీని మరింత అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.

షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి నిధులు వెంటనే విడుదల చేయాలి
TG: పేద కుటుంబాలకు అండగా నిలిచే షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో బీఆర్‌ఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ముచ్చర్ల సాగర్ మాట్లాడుతూ షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధిదారులకు నిధులు అందకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అర్హులైనవారి ఖాతాలో నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు.

సెలబ్రిటీ ప్రమోషన్స్‌పై FDA యాక్షన్!
విమల్ ఎలాచీ యాడ్ ద్వారా నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నారంటూ బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర FDA షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వీరికి ఫుడ్ సేఫ్టీ, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ల కింద రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది. నటులు నేరుగా రానవసరం లేదు, 15 రోజుల్లోగా వారి లీగల్ టీమ్ ద్వారా రిప్లై ఇవ్వొచ్చు. కమిషనర్ తుకారామ్ ముండే ఈ సెలబ్రిటీ యాడ్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు.
శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్!
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. కుల్దీప్ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ (14) ముందుకు వచ్చి షాట్ కొట్టగా, గిల్ ఎడమవైపుకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకున్నారు. ఆశ్చర్యపోయిన బ్యాటర్ క్రీజు వదిలి వెళ్లక తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది.
ప్రజావాణిలో వినతుల వెల్లువ.. సమస్యలను పరిష్కరించాలి
TG: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 20 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో రమేష్ తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. విధుల నిర్వహణలో సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు సీరియస్!
కోర్టులో జడ్జీలు మాట్లాడే మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం చేయడంపై సుప్రీంకోర్టు ఫోకస్ పెట్టింది. తీర్పులపై విమర్శలు ఓకే కానీ, చెప్పని మాటలను క్రియేట్ చేసి ప్రచారం చేస్తే న్యాయ వ్యవస్థ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అడ్వకేట్ రాజా చౌదరి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై CJI సూర్యకాంత్ రియాక్ట్ అవుతూ ఈ విషయంలో జడ్జీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోందని చెప్పారు. ఈ సోషల్ మీడియా ఫేక్ ట్రోలింగ్ అంశంపై పూర్తి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది.

ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా ఇవ్వాలని ధర్నా
TG: రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల పునరుద్ధరణ కోసం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వికారాబాద్‌లో ఆందోళన చేపట్టారు. పథకాలను వెంటనే అమలు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థికభరోసా కల్పించేందుకు KCR ప్రభుత్వం ఈ పథకాలను తీసుకొచ్చిందని నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థికసాయం అందించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

బొత్స వర్సెస్ అచ్చెన్న.. ‘దద్దమ్మ’ పదంతో వేడెక్కిన మండలి
AP: DSC అంశంపై శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, YSRCP నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరిగింది. అచ్చెన్నాయుడు ‘దద్దమ్మ’ అంటూ చేసిన వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. “మనిషి పెరిగితే సరిపోదు.. భాష కూడా బాగుండాలి” అని బొత్స అన్నారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. చేతగాని వాళ్లను ‘దద్దమ్మ’ అంటారని, అది అన్ పార్లమెంటరీ పదం కాదని తిరిగి సమాధానమిచ్చారు. దీంతో DSC అంశంపై మాటల తూటాలు పేలడంతో ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది.

కొరియన్ నూడుల్స్‌కి మన ఊరి తడ్కా భలే రుచి!
విదేశీ కొరియన్ రామెన్ నూడుల్స్ ఇప్పుడు మన ఇండియన్ టేస్ట్‌తో కొత్తగా తయారవుతున్నాయి. మనవాళ్లు ఈ నూడుల్స్‌లో వెల్లుల్లి చట్నీ, కొత్తిమీర, తడ్కా, మహారాష్ట్ర స్పెషల్ ‘తేచా’ (పచ్చిమిర్చి-వెల్లుల్లి కారం) కలిపి వెరైటీ డిషెస్ ట్రై చేస్తున్నారు. ఉల్లిపాయలు, టమాటోలు, గరం మసాలా, పసుపు వేసి దేనికదే క్రేజీ టేస్ట్‌తో ఈ నూడుల్స్ వండేస్తున్నారు. విదేశీ వంటకమే అయినా మన ఊరి దేశీ మసాలాలు తోడయ్యేసరికి ఫుడీస్ వీటిని చాలా ఇష్టంగా తింటున్నారు.

ఇవాళ విలియం కేరీ జయంతి
భారతదేశంలో ఆధునిక విద్య, పత్రికారంగం, సామాజిక సంస్కరణల విస్తరణలో కీలక పాత్ర పోషించిన విలియం కేరీ జయంతి ఇవాళ. ఆగస్టు 17, 1761 న ఇంగ్లాండ్ లో జన్మించారు. 1793లో భారతదేశానికి వచ్చి శ్రీరాంపుర్ కేంద్రంగా తన సేవలను ప్రారంభించారు. కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో బెంగాలీ, సంస్కృత లెక్చరర్‌గా పనిచేశారు. 1818లో శ్రీరాంపుర్ కాలేజీని స్థాపించారు. జూన్ 9, 1834న మరణించారు. సతీ సహగమన దురాచార నిర్మూలనలో, బహుభాషా డిక్షనరీల తయారీలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా వర్ల రామయ్య
AP: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. YSRCPకి చెందిన పాండుల రవీంద్రబాబు, జాకియా ఖానం పదవీ విరమణతో ఖాళీ అయిన రెండు స్థానాలపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ టీడీపీ నాయకుడు వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది. భవిష్యత్తులో ఆయనకు శాసన మండలి ఛైర్మన్ పదవి కూడా దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.

యువత ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం: మంత్రి వివేక్
TG: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ఏర్పాటుకు అడుగు పడింది. లాల్‌కోట–నెల్లికొండి గ్రామాల మధ్య ఎర్రగట్టు వద్ద రూ.44 కోట్లతో నిర్మించనున్న ATCకి మంత్రి వివేక్ వెంకటస్వామి, MLA జి. మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంత యువత నగరాలకు వెళ్లకుండానే ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

దర్శిగుంటపేటలో మహిళ దారుణహత్య.. ప్రజల ఆందోళన
AP: మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం మండలం దర్శిగుంటపేటలో ఈనెల 13న బంగారం కోసం ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల దర్యాప్తులో బంగారం కోసమే ఈ హత్య జరిగినట్లు నిర్ధారణ అయింది. మృతురాలు ధరించిన బంగారు నగలను దుండగులు తీసుకెళ్లారు. పోస్టుమార్టం నివేదికలో గొడ్డలితో తలపై దాడి చేయడం వల్ల తీవ్ర గాయం కావడంతో ఆమె మృతి చెందినట్లు తేలింది. హత్య జరిగి నాలుగు రోజులైనా నిందితులను ఇంకా పట్టుకోకపోవడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామంలో పోలీసు భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

462 రన్స్ కి ఆలౌట్.. అయినా ఇండియాదే పైచేయి!
ఇండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 3వ రోజున టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 462 రన్స్‌కి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 రన్స్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్‌కి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సోమవారం నాటి ఆటలో శ్రీలంక బౌలర్లు మిగతా వికెట్లను త్వరగా పడగొట్టి కమ్‌బ్యాక్ చేశారు. అయినప్పటికీ, పడిక్కల్ సెంచరీ హెల్ప్‌తో ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్‌పై ఫుల్ కంట్రోల్ సాధించి, శ్రీలంకపై మంచి ఆధిక్యంలో నిలిచింది.

మీ కంప్యూటర్ టేబుల్‌ను రెట్రో స్టైల్‌లోకి మార్చుకోండి ఇలా!
మీ కంప్యూటర్ టేబుల్‌ని పాతకాలపు (రెట్రో) శైలిలో కూల్‌గా మార్చుకోవడం చాలా ఈజీ. టైప్‌రైటర్ మోడల్‌లో ఉండే మెకానికల్ కీబోర్డ్ వాడితే మీ వర్క్‌స్పేస్‌కి ఒక క్లాసిక్ లుక్ వస్తుంది. పాత గేమ్స్, పిక్సెల్ ఆర్ట్ లేదా పాత ఓఎస్ డిజైన్లలో ఉండే వాల్‌పేపర్లను కంప్యూటర్ స్క్రీన్‌పై పెట్టుకోవచ్చు. డెస్క్ లుక్ పెంచడానికి పాత ఫ్లాపీ డిస్క్‌లు, ఆడియో క్యాసెట్ టేప్‌లు, పాత కెమెరాలు లాంటివి డెకరేషన్‌గా పెట్టుకోవచ్చు. వెలుగునిచ్చే చిన్న డెస్క్ లాంప్ పెట్టుకుంటే మీ వర్క్ ఏరియా చాలా ప్రశాంతంగా, క్లాసీగా మారిపోతుంది.

ఆగస్టు 18 వరకు ఆగని వానలు?
ఉత్తర ఒడిశాలో భారీ వర్షాలు, వరదల వల్ల 5 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఆగస్టు 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించడమే కాకుండా అధికారుల లీవులను రద్దు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలైన భద్రక్, జాజ్‌పూర్ జిల్లాల్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నారు.

పథకాలు ఆపొద్దని BRS నాయకుల నిరసన
TG: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో BRS నాయకులు ర్యాలీ నిర్వహించారు. మాజీ MPTC గజేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు వంటి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రూ.16కే బట్టలు.. షాపు దగ్గర జనం చేసిన రచ్చ!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో ఓ బట్టల వ్యాపారి ప్రకటించిన ఫ్లాష్ సేల్ తీవ్ర గందరగోళానికి దారితీసింది. రయీస్ ఆలమ్ అనే వ్యాపారి ఏ క్లాత్ కొన్నా కేవలం రూ.16కే ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఆఫర్ కేవలం 16 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పడంతో భారీగా జనం షాపు వద్దకు పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. స్థానికులకు ఇబ్బందులు కలగడంతో పోలీసులు వ్యాపారిపై FIR నమోదు చేశారు. వ్యాపారితో పాటు ఇంకొంతమందిపై చర్యలు తీసుకున్నారు.

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సీతక్క
TG: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల MPDO కార్యాలయంలో మంత్రి సీతక్క సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆమె స్వయంగా వినతులను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించిన మంత్రి, వాటిని సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పెరిగిన బంగారం ధరలు!
అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ రూ.530 పెరిగి రూ.1,55,660కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.500 మేర పెరిగి రూ.1,42,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. పసిడి మార్కెట్‌లో ప్రైసెస్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసుకునే ముందు లైవ్ రేట్స్ క్రాస్ చెక్ చేసుకోవడం బెస్ట్.
నిద్రమత్తులో డ్రైవింగ్.. బోల్తా కొట్టిన సుబాబుల్ లారీ
AP: NTR జిల్లా మైలవరం-ఛత్తీస్‌గఢ్ జాతీయ రహదారిపై మైలవరం బైపాస్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి వరంగల్‌కు సుబాబుల్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.